నలుగురు కుర్రాళ్ల కథ | Puncture movie press meet | Sakshi
Sakshi News home page

నలుగురు కుర్రాళ్ల కథ

Published Mon, Feb 17 2020 5:16 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 AM

Puncture movie press meet - Sakshi

హరీష్, సంజన

హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్‌ హీరోలుగా, గీత్‌ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్‌’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్‌. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్‌. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్‌ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్‌. శ్రీనివాస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement