దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు | Tantrika Movie Audio Launch | Sakshi
Sakshi News home page

దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు

Jul 20 2018 2:39 AM | Updated on Jul 20 2018 2:39 AM

Tantrika Movie Audio Launch - Sakshi

మనీష

‘‘సంగకుమార్‌ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్‌ అవ్వాలి. యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్‌ అన్నారు. సంగకుమార్‌ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్‌కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్‌ విడుదల చేశారు. సంగకుమార్‌ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్‌ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్‌ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్‌ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్‌ ఎం. శ్రీధర్, నటులు రాజ్‌కాంత్, సంజన మేరీ, ఎస్‌ఎస్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement