manisha
-
షట్లర్ తులసిమతికి రూ. 2 కోట్ల నజరానా
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు. -
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్‌లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్లైఫ్ వెబ్‌సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్‌పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్‌మేట్స్‌కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను. రైటర్ టూ డైరెక్టర్.. తొలుత రచయితగా 3 వెబ్‌సిరీస్‌లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్‌ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఒక్క ఛాన్స్.. చాలు.. మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్... -
Bigg Boss OTT: మనీషా రాణి లేటెస్ట్ గ్లామర్ స్టిల్స్ (ఫోటోలు)
-
కలల సాధకులు... చరిత్ర సృష్టించారు
విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి... మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది... మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి. హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’ ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది. మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి. యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది. ఏడీసీ మనీషా చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది... మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. ‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్లకు ఇద్దరిని నియమిస్తారు. మా కూతురు మా శక్తి మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి. ‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి. ‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’ -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్‌గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
'మనీషా, శివాని ఆత్మహత్య'పై.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి..
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు మనీషా, శివాని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. విద్యార్థినుల ఇద్దరి ఫోన్లో కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? వాట్సాప్ చాటింగ్ ఎవరితో ఉంది? మెస్సేజ్‌ల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరిస్తున్నాడని.. వాడు ఎవడో తెలియదని ఆ విద్యార్థులు మాట్లాడినట్లు ఫోన్ రికార్డు వైరల్ కావడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. పరువు పోతుందని ఫోన్లో ఏమైనా ఫొటోలు ఉంటే విద్యార్థులు డిలీట్ చేశారా? అనే కోణంలో ఫోన బ్యాకప్‌ను పరిశీలిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వివరాలను డిలీట్ చేసిన వివరాలను సైబర్ క్రైం విభాగం నుంచి బ్యాకప్ తీసి పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు వచ్చిన ఇన్‌కం, అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బస్సు దిగిన విద్యార్థులు నడుచుకుంటూ ప్రకాశంబజార్కు అటునుంచి రాజీవ్పార్కులోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తే ఇద్దరు విద్యార్థినులు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సాంకేతికంగా ఉన్న అన్ని ఆధారాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. లోకేషన్ ఆధారంగా.. ఇద్దరు విద్యార్థులకు ఏ ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి? ఆ సమయంలో వీరిద్దరు ఎక్కడ ఉన్నారని ట్రేస్ చేస్తున్నారు. డీపీలో ఫొటోలు పెట్టుకోవద్దు.. దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం విద్యార్థినుల స్వగ్రామాలకు వెళ్లి విచారించారు. నక్కలపల్లి గ్రామంలో శివాని స్నేహితుల నుంచి, అమ్మనబోలు గ్రామానికి మనీషా క్లాస్మేట్లు, స్నేహితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అయితే, అమ్మాయిలు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో డీపీగా ఫొటోలు పెట్టుకోవద్దని శివాని గ్రామంలోని స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. ఎందుకు పెట్టుకోవద్దని అడిగితే సమాధానం చెప్పలేదని ఆమె స్నేహితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నక్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ ఎస్సై ఉద్యోగం సాధించడంతో.. డిగ్రీ పూర్తి కాగానే మనం కూడా ఎస్సై ఉద్యోగం సాధించాలని ఇద్దరు విద్యార్థినులు నిర్ణయించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. -
అమ్మాయిల పంచ్ అదిరింది.. క్వార్టర్ ఫైనల్లో నిఖత్, నీతూలతో పాటు..
World Boxing Championship 2023- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిఫెండింగ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీఫైనల్ చేరితే ఈ నలుగురికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయా రు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో పాట్రిసియా అల్వారెజ్ (మెక్సికో)పై, సుమయా కొసిమోవా (తజికిస్తాన్)పై నీతూ, నూర్ ఎలిఫ్ తుర్హాన్ (తుర్కియే)పై మనీషా, సమదోవా (తజికిస్తాన్)పై జాస్మిన్ గెలుపొందారు. శశి చోప్రా 0–4తో మాయ్ కిటో (జపాన్) చేతిలో, నవ్బఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో మంజు ఓడిపోయారు. చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు Quarterfinals Ready 🔥💥 🇮🇳 champs acing it at the #WWCHDelhi Tomorrow ⏳ Book your tickets now to not miss the action 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider pic.twitter.com/KeXDKSuC90 — Boxing Federation (@BFI_official) March 21, 2023 -
Nikhat Zareen: ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్
Women's World Boxing Championship- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు నమోదు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ రెండో రౌండ్ బౌట్లో 5–0తో ఆఫ్రికా చాంపియన్ బూఆలమ్ రుమేసా (అల్జీరియా)ను ఓడించగా... మనీషా 5–0తో రహీమి టీనా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం -
మనీషా కిక్ కొడితే...
పంజాబ్ రాష్ట్రం హొషియార్పూర్ జిల్లాలోని ముగొవాల్ గ్రామం...ఆ ఊర్లో ఒక రోజు ఒక టీనేజ్ అమ్మాయి ఫుట్‌బాల్‌తో డ్రిబ్లింగ్ చేస్తూ మైదానంలో కనిపించింది. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఆ గ్రామానికి ఇది కూడా ఒక వార్తగా మారింది! అమ్మాయిలు ఆటలు ఆడటమే ఎక్కువ అనుకుంటే అందులోనూ ఫుట్‌బాల్ ఆడటం వారిని సహజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించినట్లుగానే అందరినుంచీ విమర్శలూ వచ్చాయి. అయితే ఆ అమ్మాయి ఎవ్వరీ మాటా వినలేదు, తన ఆటనూ మార్చుకోలేదు. ఆ తర్వాత మైదానంలోనే సత్తా చాటి అనూహ్య వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు భారత్ తరఫున చాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన తొలి మహిళగా ఘనతకెక్కింది. 21 ఏళ్ల ఆ ప్లేయర్ పేరే మనీషా కల్యాణ్. పాఠశాలలో ఉన్నప్పుడు చాలా మందిలాగే మనీషా రన్నింగ్ రేస్‌లలో పాల్గొంది. స్కూల్లోనే కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఒక రోజు మనీషాలోని వేగాన్ని, ఆమె కాళ్ల కదలికలను గుర్తించిన కోచ్ ఆమె ఫుట్బాల్కైతే సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. మనీషాకు కూడా వ్యక్తిగత క్రీడలకంటే టీమ్ గేమ్‌లంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో వెంటనే ఓకే అనేసింది. అయితే వీరిద్దరు కూడా ఊర్లో వచ్చే అభ్యంతరాల గురించి అసలు ఆలోచించలేకపోయారు. చిన్నపాటి దుకాణం నడుపుకునే తండ్రికి ఆటలపై ఎలాంటి అవగాహన లేకపోగా, అసలు మనకెందుకీ తంటా అన్నట్లుగా పెద్దగా ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కోచ్ అన్ని విషయాల్లో సరైన మార్గదర్శిగా నిలవడం మనీషాను ముందుకు వెళ్లేలా చేయగలిగింది. అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ / ఫార్వర్డ్‌గా మైదానంలో మనీషా తన ముద్ర చూపించగలిగింది. 2021–22లో భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎమర్జింగ్ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఆమెకే దక్కింది. వేగంగా దూసుకెళ్లి... 13 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ వైపు మళ్లిన ఈ అమ్మాయి నాలుగేళ్లు తిరిగే సరికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. వేర్వేరు వయో విభాగాల సెలక్షన్స్‌లో రాణించడంతో మనీషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ‘బ్రిక్స్’ దేశాల అండర్–17 ఫుట్‌బాల్ కప్‌తో తొలిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే మనీషా కల నెరవేరింది. ఆ తర్వాత 2019 ఏఎఫ్సీ అండర్–19 చాంపియన్‌షిప్ ఆమె కెరీర్లో మరో మలుపు. భారత జట్టు పాకిస్తాన్‌ను 18–0తో చిత్తు చేసిన మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్’తో చెలరేగిన మనీషా థాయిలాండ్‌పై భారత్ విజయం సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సీనియర్ టీమ్‌కు కూడా ఎంపికై మనీషా సంచలనం సృష్టించింది. 2019 ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీషా అరంగేట్రం చేసింది. గత ఏడాది ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బ్రెజిల్‌పై సాధించిన గోల్ ఆమెను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. క్లబ్ తరఫున ఆడుతూ... ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు లీగ్‌లలో క్లబ్‌లకు ఆడే అవకాశం రావడం కూడా ఆటగాళ్లకు వరంలాంటిదే. మనీషా ప్రతిభను గుర్తించిన ఇండియన్ ఉమెన్స్ లీగ్ క్లబ్ ‘గోకులమ్ కేరళ’ ఆమెను జట్టులోకి తీసుకుంది. ఆ జట్టు వరుస విజయాలతో టైటిల్ గెలవడంలో భాగం కావడంతో పాటు ప్రతిష్టాత్మక ఏఎఫ్సీ ఉమెన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో గోకులమ్ టీమ్ తరఫున ఆడుతూ ఉజ్బెకిస్తాన్ క్లబ్ బున్యోడ్కర్ ఎఫ్‌సీపై చేసిన గోల్‌తో మనీషా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ టోర్నీలో ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడే అదే ఆమెకు యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించింది. భారత మహిళల ఫుట్‌బాల్‌లో దిగ్గజంలాంటి బాలాదేవిని అభిమానించే మనీషా ఆమె తరహాలో మరింత పైకి ఎదగాలని పట్టుదలగా ఉంది. యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్‌లో ఆడిన తొలి భారత మహిళగా మనీషా నిలిచింది. ‘అపోలాన్ లేడీస్ ఎఫ్‌సీ’ టీమ్ తరఫున గురువారం ఆమె అరంగేట్రం చేసింది. ఎస్‌ఎఫ్‌కే రిగాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 60వ నిమిషంలో మరిలెనా జార్జియాకు సబ్‌స్టిట్యూట్‌గా మనీషా మైదానంలోకి దిగింది. అపోలాన్ టీమ్‌తో ఆమె రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. –సాక్షి క్రీడా విభాగం -
అయ్యో మనీషా! కానరాని దేశంలో అవస్థలు.. చార్జీల కోసం వాట్సాప్ వీడియో
తెర్లాం (విజయనగరం): విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయమాటలను నమ్మి మోసపోయిన ఓ వివాహిత ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో ఉద్యోగం లేక, తినడానికి తిండిలేక అవస్థలు పడుతోంది. విజిటింగ్ వీసా గడువు కూడా ఈ ఆదివారంతో ముగియనుండడంతో ఏమి చేయాలో తెలియక దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. దుబాయ్ నుంచి వచ్చేందుకు విమాన చార్జీలు ఎవరైనా దాతలు పంపిస్తే తాను ఇండియాకు వస్తానని, తనను ఆదుకోవాలని దుబాయ్ నుంచి వాట్సాప్ వీడియోను శనివారం ఆమె పోస్ట్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం గ్రామానికి చెందిన మనీషా ఉద్యోగం కోసమని కొన్నిరోజుల క్రితం దుబాయ్ వెళ్లింది. విశాఖపట్నానికి చెందిన ఓ ఏజెంట్ ఆమెతో రూ.80 వేలు కట్టించుకుని, దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆమె తన దగ్గరున్న సొమ్మునంతా ఆ ఏజెంట్‌కు ఇచ్చి, అతడి విజిటింగ్ వీసాతో ఆమె దుబాయ్ వెళ్లింది. ఇలా దుబాయ్‌కు వెళ్లిన కొద్దిరోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత అతడు కొన్నాళ్లకు పరారయ్యాడు. దీంతో ఆ మహిళకు ఏమి చేయాలో, ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు. ఆఖరికి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. తాను మోసపోయిన విషయం వివరించింది. ఆమె వద్ద ఉన్న వీసాను రాయబార కార్యాలయ అధికారులు పరిశీలించగా, అది విజిటర్స్ వీసా అని, ఆదివారంతో గడువు ముగుస్తుందని తెలిపారు. ఇండియాకు వెళ్లేందుకు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, కొన్ని రోజులుగా తిండి కూడా తినలేదని, దాతలెవరైనా తనను ఇండియా తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆమెతో ఓ వీడియో చిత్రీకరించి, దానిని వాట్పాప్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మనీషా వివరాలపై అధికారుల ఆరా.. మనీషా వివరాలపై విజయనగరం ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) అధికారులు శనివారం ఆరా తీశారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్బీ అధికారులు తెర్లాం గ్రామం, మండలంలోని పలువురికి ఫోన్ చేసి, ఆమె వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ
రాప్తాడు (అనంతపురం): మండలంలోని రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. వివరాలు.. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు. కాగా, ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్లో జరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో బీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2018లో గ్రూప్–1 పరీక్ష రాశారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. చదవండి: (ఆర్బీకే ఓ అద్భుతం!) -
విలేకరిగా మారిన హీరో విమల్
సాక్షి, చెన్నై: నటుడు విమల్ విలేకరి అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడిక్కుమ్ కరంగళ్’. ముంబై బ్యూటీ మనీషా నాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈమె ఇంతకుముందు తెలుగులో రెండుచిత్రాలు, కన్నడంలో ఒక చిత్రం చేశారు. ఒడియన్ టాకీస్ పతాకంపై కె.అన్నాదురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేలుదాస్ దర్శకత్వంతో పాటు సహ నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద 23 ఏళ్లు పని చేసిన ఆయన సోదరుడి కొడుకు రాఘవ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్మీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటుడు విమల్ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ విలేకరిగా బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. ఈ షూటింగ్‌ను చెన్నైలో 45 రోజుల్లో పూర్తి చేశామన్నారు. -
Womens World Boxing Championships: పసిడికి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: తన కెరీర్లో సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచ చాంపియన్ కావడానికి భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం దూరంలో నిలిచింది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ తెలంగాణ అమ్మాయి 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ 5–0తో కరోలైన్ డి అల్మెదా (బ్రెజిల్)పై ఘనవిజయం సాధించింది. మరోవైపు భారత్‌కే చెందిన మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు. సెమీఫైనల్స్‌లో మనీషా 0–5తో ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో... పర్వీన్ 1–4తో అమీ సారా బ్రాడ్‌హర్ట్స్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయారు. కరోలైన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆద్యంతం దూకుడుగా ఆడిన నిఖత్ నిర్ణీత మూడు రౌండ్లలోనూ పైచేయి సాధించింది. నేడు జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్‌పోంగ్ జుటామస్‌తో నిఖత్ తలపడుతుంది. 2011లో టర్కీలోనే జరిగిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. సెమీఫైనల్లో బ్రెజిల్ బాక్సర్‌ను ఆమె సహజశైలిలో ఆడేందుకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాను. స్వర్ణ పతకంతో స్వదేశానికి రావాలని పట్టుదలతో ఉన్నాను. నా ఫైనల్ ప్రత్యర్థి థాయ్‌లాండ్ బాక్సర్తో గతంలో ఒకసారి తలపడ్డాను. ఆమెను ఎలా ఓడించాలో హెడ్ కోచ్‌తో కలిసి వ్యూహం రచిస్తా. –నిఖత్ జరీన్ -
రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం
Asian Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ మహిళల విభాగంలో శుక్రవారం భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్ (జపాన్)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది. అంతకుముందు అన్షు వరుసగా మూడు బౌట్లలో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించడం) పద్ధతిలో షోఖిడా (ఉజ్బెకిస్తాన్)పై... డానియెలా స్యు చింగ్ లిమ్ (సింగపూర్)పై, బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. భారత రెజ్లర్ రాధిక మూడు బౌట్లలో గెలిచి, ఒక బౌట్లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్బిట్ లీ (కొరియా)పై గెలిచింది. చదవండి: Rishabh Pant: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గొంతే కాదు రూపం కూడా అందమే.. సింగర్ మనీషా బ్యూటిఫుల్ పిక్స్
-
ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ప్రతిభావంతురాలైన ఓ విద్యార్థిని ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పోటీ పరీక్షల్లో సత్తా చాటిన అమ్మాయి జీవితంలో మాత్రం ఆ తెగువ,తెలివి చూపలేకపోయింది. ఇంటిపై బెంగ పెట్టుకుని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక, వెంటాడుతున్న మనోవ్యధను భరించలేక, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పాలుపోక బంగారు భవిష్యత్తు ఉన్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్‌లో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొండపల్లి మనీష అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల. అనారోగ్యం అని చెప్పి.. ఈ ఏడాది టెన్త్ క్లాస్‌లో కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేసేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన మనీష అంజు శ్రీకాకుళం క్యాంపస్‌లో సీటు సంపాదించింది. ఈమెకు కాలేజీ హాస్టల్లోని ఎస్–4 గదిని మరో ఇద్దరు విద్యార్థినులు అక్షిత, యమునలతో కలిపి కేటాయించారు. యమున ఇంకా రిపోర్ట్ చేయలేదు. అక్షిత మాత్రం ఇదే గదిలో ఉంటూ బుధవారం క్లాసుకు వెళ్లిపోయింది. మనీష తనకు ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటానని కేర్‌టేకర్‌కు చెప్పి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. ఉదయం అంతా క్లాసులకు వెళ్లిపోయాక 10.30 గంటల ప్రాంతంలో గదిలోని ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (13 మంది విద్యార్థినులపై అత్యాచారం.. టీచర్‌కు..) మధ్యాహ్నం తోటి విద్యార్థినులు ఆమెను భోజనానికి పిలవడానికి గది వద్దకు వచ్చారు. తలుపులు కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో వారు కేర్ టేకర్‌కు సమాచారం అందించారు. అనంతరం తలుపులు బద్దలుగొట్టి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ మనీష కనిపించింది. దీంతో కేర్ టేకర్ కంగారు పడి డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలన అధికారి కె.మోహన్‌కృష్ణ చౌదరిలకు సమాచారం చేరవేశారు. తర్వాత మనీషను కిందకు దించి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఎచ్చెర్ల పోలీసులకు, విద్యార్థిని తల్లిదండ్రులు సూరిబాబు, కరుణకుమారిలకు సమాచారం చేరవేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ కె.రాము ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు విచారణ నిర్వహించి, ఆధారాలు సేకరించారు. తోటి విద్యార్థినులను విచారించారు. ఇంటిపై బెంగ పెట్టుకుందా..? మనీష అంజు చురుకైన విద్యార్థిని. ప్రాథమిక విద్యలో మంచి ప్రతిభ కనబరిచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైంది. ఇక్కడ పీయూసీ మొదటి ఏడాది, మొదటి సెమిస్టర్ క్లాస్ వర్క్ సంక్రాంతి పండగ ముందు 15 రోజులు నిర్వహించారు. అనంతరం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. మొదటి ఏడాది విద్యార్థులకు క్యాంపస్ అలవాటు చేసేందు ఆఫ్‌లైన్ క్లాస్‌వర్క్‌ను ఈ నెల 14న ప్రారంభించారు. ఈమె రెండు రోజుల పాటు క్లాస్‌కు హాజరైంది. కానీ ఇక్కడ తనకు నచ్చడం లేదని, ఇల్లు గుర్తుకు వస్తోందని తోటి వారితో తరచూ చెప్పేది. తల్లిదండ్రులతో రోజూ మాట్లాడేది. రెండు రోజుల కింద తల్లి స్వయంగా వచ్చి ఆమెను క్యాంపస్‌లో దించి వెళ్లారు. సంక్రాంతి ముందు కూడా ఆమె తండ్రి 15 రోజుల్లో రెండుసార్లు వచ్చి చూశారు. విద్యార్థిని ఇంటికి వెళ్లినప్పుడు కూడా తాను కాలేజీకి వెళ్లనని చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులను విడిచి ఇక్కడ ఉండలేకే విద్యార్థి ఇలా చేసుకుందని తోటివారు భావిస్తున్నారు. ఈ క్యాంపస్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’
దిక్కు లేని వారికి దేవుడే ఏదో ఒక దిక్కు చూపిస్తాడు. తమిళనాడులో అయితే ఆ దిక్కును ‘మనీషా’ పేరుతో పిలుస్తారు. 24 ఏళ్ల మనీషా ఈరోడ్‌లో నర్సింగ్ కాలేజీలో పాఠాలు చెబుతుంది. కాని ఆ కాసేపు మినహాయిస్తే తక్కిన సమయమంతా దీనులకు ఆమె అమ్మగా మారుతుంది. మతిస్తిమితం తప్పి వీధుల్లో ఉన్నవారిని మామూలు మనిషిని చేసే వరకూ ఆమె విశ్రమించదు. దూరం నుంచి దానం అందరూ చేస్తారు. దగ్గరి నుంచి సేవ చేసే మనీషి మనీషా. మనీషా చిన్నప్పుడు చెన్నైలో తన తండ్రితో పాటు కలిసి తండ్రి నడిపే మటన్షాప్కు వెళ్లేది. నాలుగు రోజులు వెళ్లాక తండ్రి ఎంత కష్టంగా సంపాదన చేస్తున్నాడో, ఎంత కష్టంగా పేదరికంలో తాము బతకాల్సి వస్తోందో ఆమెకు అర్థమైంది. మూడు పూట్ల అంతో ఇంతో తినడానికి ఉన్న తమ పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు మీద ఏ దిక్కూ లేకుండా తిరిగే దౌర్భాగ్యుల పరిస్థితి ఏమిటి అని ఆ వయసులో ఆమెకు అనిపించేది. ఎందుకంటే షాపులో ఉన్నంత సేపు పిచ్చివాళ్లో, దిక్కులేని వాళ్లో కనిపిస్తూనే ఉండేవారు. పెద్దయ్యాక అయినా వారి కోసం ఏమైనా చేయగలనా అనుకునేది మనీషా. డాక్టర్ అవ్వాలని బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకునేది మనీషా. కాని అంత డబ్బు లేదు. అందుకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా డబ్బు లేదు. సైన్యంలో చేరి దేశం కోసం పని చేయాలనుకుంది. కాని ఆడపిల్లను పంపడానికి తల్లిదండ్రులు, బంధువులు ఎన్నో విధాలుగా సంశయించారు. అందుకని నర్సింగ్ కోర్స్ చదివి ఈరోడ్‌లో లెక్చరర్ అయ్యింది మనీషా. డాక్టర్‌గా చేయాల్సిన సమాజ సేవ, సైనికురాలిగా చేయాల్సిన దేశ సేవ రెండూ ఒక సామాజిక కార్యకర్తగా చేయాలని నిశ్చయించుకుంది. 2018లో ఒక న్యూస్పేపర్లో ఆమె తంజావూరులో ఒక దీనుడి ఫొటో చూసింది. ఎవరూ పట్టించుకోక ఆ దీనుడు ఆకలితో అలమటిస్తున్నాడని ఆ ఫొటో సారాంశం. వెంటనే మనీషా ఆ ఫొటోను ఫేస్బుక్లో పెట్టి అందరి సాయం కోరింది. తంజావూరు వెళ్లి మరీ ఆ దీనుడి షెల్టర్‌కు చేర్చడంలో సాయపడింది. అలా ఆమె పని మొదలయ్యింది. ఇలాంటి వారు కావాలి డబ్బు సాయం చేయమంటే చేసేవారు చాలామంది ఉంటారు. కాని ప్రత్యక్షంగా సేవ చేయమంటే వెనుకాడుతారు. కాని మనీష తానే స్వయంగా సేవ చేస్తుంది. పిల్లలు బాగా మురికి పడితే కన్న తల్లే విసుక్కుంటుంది. కాని సంవత్సరాల తరబడి స్నానపానాలు లేకుండా శుభ్రత లేకుండా తిరిగే పిచ్చివాళ్లకు, డ్రగ్ అడిక్ట్స్‌కు, అనాథలకు, ఇళ్ల నుంచి పారిపోయిన వారికి తానే స్వయంగా సేవ చేస్తుంది మనీషా. వారికి క్షవరం చేస్తుంది. స్నానం చేసేలా చూస్తుంది. బట్టలు ఇస్తుంది. వారి షెల్టర్ కోసం ప్రయత్నిస్తుంది. ఈరోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ ఆదుకుంటోంది. వీరిలో ఎవరైనా పనిచేసి సంపాదించే సత్తా ఉన్నవారికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గాలను చూపుతోంది. జీవితం ఫౌండేషన్ తాను సంపాదించే దాంట్లో తన ఖర్చులకు పోగా మిగిలిందంతా ఊరి దిమ్మరుల కోసం ఖర్చు చేస్తుంది మనీష. కాని అది చాలదు. సమాజం ఆసరాతో ఈ పని చేయాలని ‘జీవితం ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. దాదాపు 500 మంది దిమ్మరులకు స్వస్థత, భద్రత, భరోసా కలిగించడంలో కృషి చేసింది. ఆమెతో పాటు అలాంటి స్ఫూర్తి ఉన్న యువతరం కూడా తోడయ్యింది. వీరంతా ఒక టీమ్‌గా పని చేస్తూ దీన బాంధవులుగా మారారు. ముఖ్యంగా కరోనా సమయంలో మనీష ఒక గొప్ప మానవిగా మారింది. ఆ సమయంలో అన్నీ మూతపడగా ఈరోడ్ చుట్టుపక్కల కొత్తగా వచ్చే లేదా ముందు నుంచి ఉన్న దిమ్మరులకు అన్నమే లేకుండా పోయింది. వారికి నిలువ నీడ లేదన్న సంగతి కూడా కనిపెట్టింది. వెంటనే ఆమె ఈరోడ్ కమిషనర్ని కలిసి ఒక స్కూల్‌ను టెంపరరీ షెల్టర్‌గా అడిగింది. వెంటనే కమిషనర్ అందుకు అంగీకరించాడు. మనీష ఆ ఇరుగు పొరుగు వారికి వంట చేయమని దినుసులు సరఫరా చేసింది. ఊళ్లో ఉన్న దాదాపు 80 మంది అభాగ్యులను ఆ స్కూల్లో ఉండేలా చూసింది. వారికి మాస్కులు, శానిటైజర్లు, రేషన్, మూడుపూటల భోజనాన్ని అందించింది. వ్యాయామం చేయించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేగాక, కొంతమందికి వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి 54 మందికి ఉపాధి కల్పించింది. మరికొంత మందిని వృద్ధాశ్రమాలకు, కుటుంబాల ఆచూకి తెలిసిన వారిని, కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది. మైనర్లకు అరిక ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే మెషిన్లను అందించి వారికి ఉపాధి కల్పించింది. మనిషి బాధ్యత ‘ఎదుటివారి కష్టానికి స్పందించడం మనిషి కనీస బాధ్యత. మన దేశంలో ఎందరో ఎన్నో కారణాల రీత్యా రోడ్డు మీదే బతుకుతుంటారు. వారి గోడు ఎవరూ పట్టించుకోరు. వారి వేదన ప్రభుత్వాలకు అర్థం కాదు. కాని వారిని అక్కున జేర్చుకుని మనుషులుగా చేసే ప్రయత్నం చేసినప్పుడు వారి ముఖాల్లో కూడా చిరునవ్వు వెలుగుతుంది. అలాంటి చిరునవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను నా జీవితం అంతా ఆ పనికి వెచ్చిస్తాను. పిల్లలు గెంటేసిన వృద్ధులు, డ్రగ్స్ బానిసలైన యువకులు, వీధి బాలలు... వీరందరి కోసం ఒక సొంత షెల్టర్ కట్టాలని నా కోరిక. ఏదో ఒకరోజు దానిని సాధిస్తాను. ఈలోపు సమాజంలోని మంచి మనసున్న వారితో ఈ సహాయాన్ని కొనసాగిస్తాను’ అంటోంది మనీషా. భవిష్యత్తులో ఆమెను జనం తమిళనాడు థెరిస్సా అని పిలిచినా ఆశ్చర్యం లేదు. -
పాక్‌లో హిందూ డిఎస్పీ
కొద్ది రోజుల క్రితం వరకు మనీషా రూపిత కరాచీలోని జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్లో వైద్యురాలు. ఇప్పుడు ఆమె సిం«ద్ ప్రావిన్సులోని జకోబాబాద్ జిల్లా డిఎస్పీ! ‘డీఎస్పీలు వస్తుంటారు పోతుంటారు’ అనుకోవచ్చు. ఇక్కడ అలా అనుకోడానికి లేదు. పాకిస్తాన్‌లోనే తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత! అయితే.. సర్వీస్ కమిషన్ విజేతగా సింద్ ప్రావిన్స్‌లోని హిందూ మహిళలకు తననొక ప్రతినిధిగా రూపిత భావించడం లేదు. సింద్ గ్రామీణ మహిళలందరికీ తన విజయం ఒక ప్రేరణ అవాలని మాత్రమే కోరుకుంటున్నారు! ‘సింద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ (ఎస్పీఎస్సీ) పరీక్షలో ర్యాంక్ సంపాదించి, ఈ ఘనతను సాధించారు రూపిత. మొదట ఆమె ‘సెంట్రల్ సుపీరియర్ సర్వీసు’ (మన దగ్గర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రాశారు. అదొక్కటే అత్యున్నతస్థాయి ఉద్యోగాలకు మార్గం అనుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు.. సిం«ద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ర్యాంకు సాధించినా కూడా డైరెక్టు నియామకాలు ఉంటాయని తెలిసింది. పట్టుపట్టి బుక్స్ ముందు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు డీఎస్పీ సీట్లో కూర్చోబోతున్నారు. నియామక ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు చేపట్టడమే తరువాయి! మనీషా రూపిత, పాక్ పోలీస్ దళం ఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడై, ర్యాంకు సాధించి, డీఎస్పీ అయ్యాక గానీ రూపిత పాకిస్తాన్‌లోనే మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ అన్న సంగతి ఎవరి దృష్టికీ రాలేదు. పాకిస్తాన్లో కపిల్ దేవ్ అనే ఒక హక్కుల కార్యకర్త ‘ప్రథమ’ అనే ప్రత్యేకత కలిగిన ఈ నియామకం గురించి తన ట్విట్టర్లో వెల్లడించడంతో రూపితకు అభినందనలు మొదలయ్యాయి. ‘‘పాకిస్తాన్‌లోని హిందువులందరికీ ఇది గర్వకారణం’’ అని ఆయన ట్వీట్ చేశారు. రూపిత జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్లో మెడికల్ థెరపీ డాక్టర్‌గా పని చేస్తున్న రూపిత కు కంబైండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (సి.సి.ఇ) అయిన ఎస్పీఎస్సీ రాసి గవర్నమెంట్లో డైరెక్ట్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్‌గా సేవలు అందిస్తూనే సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ‘‘అయితే ఇదేమీ అంత తేలికైన ప్రయాణం కాదు. 2007 నాన్నగారు చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయాం. అయినా అమ్మ మా చదువును మాన్పించలేదు’’ అంటారు రూపిత. ఫీజులు, సర్వీస్ కమిషన్ పరీక్ష పుస్తకాలు కొనడం కోసం ఆమె ట్యూషన్ లు చెప్పారు. ‘‘గెలిచింది నేనే అయినా గెలిపించింది మా అమ్మే. ఆమె కలను నేను నెరవేర్చగలిగాను. అదే నా సంతోషం’’ అంటున్నారు రూపిత. తన విజయం సింద్‌లోని గ్రామీణ మహిళలందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. -
జీవితంపై విరక్తి.. నవవధువు ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. నంద్యాల పట్టణంలోని మాల్దార్‌పేటకు చెందిన మనీషా (20) ఇంటర్ వరకు చదివింది. ఆమె తల్లిదండ్రులు తన చిన్నతనంలోని మృతి చెందడంతో మేనమామ మహేష్ వద్దనే ఉంటూ చదువుకుంది. ఈ ఏడాది జనవరిలో మనీషాకు పట్టణంలోని చింతరుగు వీధికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. కట్నంగా రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు ఇచ్చారు. రాజేష్ పట్టణంలో మెడికల్ రెప్రజెంటేటివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం అనంతరం తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మనీషా సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి మేనమామ మహేష్ ఫిర్యాదు మేరకు మనీషా భర్త రాజేష్, కుటుంబీకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ ఓబులేసు మంగళవారం తెలిపారు. -
తండ్రీకూతుళ్లుగా నటించిన వాళ్లు ప్రేమలో పడ్డారు!
నానా పాటేకర్ నటనే కాదు జీవితమూ వైవిధ్యమే! నటుడిగా విజయాలే ఎక్కువ. భర్తగా, ప్రేమికుడిగా వైఫ్యలాలు ఎక్కువ! మనీషా కోయిరాలా కూడా వెర్సటైల్ నటే. ఆమెకూ జీవితంలో పోరాటం తప్పలేదు. స్వభావ రీత్యా ఇద్దరూ ఒకటే. కోపం, ఆవేశం విషయంలో ఇద్దరిదీ ఒకే మీటర్. ప్రేమ విషయంలోనూ ఆ మీటర్ తప్పలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఇద్దరూ తప్పారు. వివరాలు.. 1996లో వచ్చిన అగ్నిసాక్షి.. నానా, మనీషా కలసి చేసిన మొదటి సినిమా. ఆ సెట్స్ మీదే వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. తనలాగే ఉండే మనీషా ముక్కుసూటి వ్యవహారం అతనికి నచ్చింది. ఆమె మీద ప్రేమా కలిగింది. అంతకుముందే వివేక్ ముష్రాన్తో బ్రేకప్ అయిన బాధలో ఉన్న మనీషాకు నానా స్నేహం, చూపిస్తున్న ప్రేమ ఊరటనిచ్చాయి. దాంతో తనూ నానా పట్ల ప్రేమను పెంచుకుంది. అదే యేడు వచ్చిన ఖామోషీ (ఇందులో తండ్రీ, కూతురిగా నటించారు)తో ఆ ఇద్దరి మధ్య అనుబంధం బలపడ్డమే కాదు ఆ రహస్యం చిత్రపరిశ్రమకూ తెలిసిపోయింది. ఆ ప్రేమను పెళ్లిగా మలచుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు నానా పాటేకర్. మనీషా ‘నో’ చెప్పలేదు కాని అప్పటికే పెళ్లయి ఉన్న నానాతో ‘నీ భార్యకు విడాకులివ్వు’ అంది. మౌనంతో ఆ సందర్భాన్నుంచి బయటపడ్డాడు అతను. నిజానికి నానా పాటేకర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్నేమీ ఆస్వాదించట్లేదు. అతని భార్య నీలకాంతి. మరాఠీ నటి, దర్శకురాలు, నిర్మాత. మంచి శిల్పి కూడా. పెళ్లయిన ఏ కొంత కాలమో సంతోషంగా ఉన్నారు ఆ భార్య, భర్త. తర్వాత నుంచి విభేదాల ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారింది వాళ్ల దాంపత్యం. ఇద్దరు పిల్లలూ పుట్టడంతో వాళ్ల ముందు కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం ఇష్టం లేక విడాకులు తీసుకోకుండానే విడి విడిగా ఉండడం ప్రారంభించారు. ఆయేషా, నీలకాంతి విడాకులు, పెళ్లి గురించిన వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి మనీషా, నానా మధ్య. ఇంకోవైపు ఆమె మీద పొసెసివ్‌నెస్ ఎంతలా పెరిగిందంటే మనీషా ప్రవర్తనకు హద్దులు పెట్టేంతగా. ఆమె కాస్త ఆధునికంగా అలంకరించుకున్నా నానా అభ్యంతరపెట్టేవాడు. సహ నటులతో కొంచెం చనువుగా మాట్లాడినా ఆమె మీద నోటి దురుసుతనం ప్రదర్శించేవాడు. పెళ్లితో ఆ అభద్రతకు చెక్ పెట్టొచ్చని ఆశపడింది మనీషా. అందుకే నీలకాంతితో విడాకుల కోసం ఒత్తిడి తెచ్చింది. ‘ఇవ్వను. నీతో కలసి ఉండడానికి సిద్ధమే.. కాని నీలకాంతికి విడాకులు ఇచ్చేసి కాదు’ అని స్పష్టం చేశాడు నానా పాటేకర్. నివ్వెరపోయింది మనీషా. అప్పటి నుంచి ఆమెలో అభద్రత మొదలైంది. ఈలోపు.. నానా పాటేకర్.. ఆయేషా జుల్కాతో దగ్గరగా ఉంటున్నాడన్న విషయం పరిశ్రమలో గుప్పుమంది. పత్రికల్లోనూ అచ్చయింది. మనీషా మెదడులోనూ పడింది. ఒకసారి మనీషా నానా పాటేకర్‌ను కలవడానికి వెళ్లేసరికి ఆయేషా జుల్కా అక్కడే ఉంది. స్నేహం కంటే ఎక్కువ దగ్గరితనం వాళ్ల మధ్య కనపడేసరికి కోపావేశాలకు లోనైన మనీషా ఇంగితం మరచిపోయి ఆయేషా జుల్కాను తిట్టేసింది. నానా పాటేకర్ జోక్యంతో అక్కడికి, అప్పటికి సద్దుమణిగినా ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసింది. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం నెమ్మది నెమ్మదిగా వాళ్ల మధ్య అనుబంధాన్ని, బంధాన్నే తెంచేసింది. నానా పాటేకర్, మనీషాల ప్రేమ కథ బ్రేకప్‌తో ఎండ్ అయిపోయింది. నానా పాటేకర్, ఆయేషా జుల్కా కలసి ఉండడం ప్రారంభించినా, మనీషా ముందుకు సాగిపోయినా విడిపోవడం ఆ రెండు మనసులనూ వేధించింది. ‘బ్రేకప్ అనేది డిఫికల్ట్ ఫేజ్. అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది ఆ బాధేంటో. మనీషా కస్తూరి మృగం లాంటిది. చాలా సున్నిత మనస్కురాలు. ఆమె నన్ను వదిలి వెళ్తుంటే అతికష్టమ్మీద కన్నీళ్లను దిగమింగా. ఐ మిస్ మనీషా’ అని చెప్పాడు నానా పాటేకర్ ఒక ఇంటర్వ్యూలో. 2010లో మనీషా .. నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ను పెళ్లిచేసుకుంది. కాని రెండేళ్లకే ఆ పెళ్లి విఫలమైంది. తర్వాత ఆమె క్యాన్సర్ బారినపడింది. ఆ పోరాటంలో గెలిచి.. మళ్లీ సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. -ఎస్సార్ చదవండి: శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..? -
జంగం సిస్టర్స్ గీతావధానం
అష్టావధానం గురించి విన్నాం. శతావధానం చూశాం. ఈ గీతావధానం ఏమిటి? భగవద్గీత భారతీయుల ఆధ్యాత్మిక సంపద. ఇంకా చెప్పాలంటే ప్రపంచ జనులకు మార్గదర్శి. జీవన సందేశి. భగవద్గీతను ఔపోసన పట్టిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గీతావధానం చేస్తున్నారు. మనీష, శిరీష... అనే ఈ అక్కచెల్లెళ్లు ‘జంగం సిస్టర్స్’గా గతంలో గణితావధానం చేశారు. ఇప్పుడు గీతావధానం చేస్తున్నారు. ఆపైన నాట్యావధానం కూడా చేస్తారట. ఆ ప్రతిభకు పరిచయం ఇది. ‘‘నేను దూరవిద్యలో తెలుగు ఎంఏ చేస్తున్నాను. సాహిత్య అవధానాలు ఇప్పటికే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాన్నగారు మాతో రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు కంఠస్థం చేయించారు. తెలుగులో ఇప్పటివరకు సుమారు రెండు వేల పద్యాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. మనుచరిత్ర, మేఘసందేశం కావ్యాలు సంపూర్ణంగా కంఠపాఠం అయ్యాయి. మా నాన్నగారే మా గురువు. ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీతం సర్టిఫికెట్ కోర్సు చేశా. మా బాబయ్య జంగం విజయకుమార్ మాకు బాల్యం నుంచే కూచిపూడి నాట్యం నేర్పించారు. నేను డాన్స్‌లో డిప్లొమా పూర్తి చేశాను. త్వరలో ఎం.ఏ చేద్దామనుకుంటున్నాను’ అంటూ వివరించారు జంగం సిస్టర్స్‌లోని అక్క మనీషా చక్రవర్తి. అవధానం తెలుగువారి సాహిత్య ప్రక్రియ. ఎనిమిది మంది పృచ్ఛకులతో చేస్తే అది అష్టావధానం. ఈ విధంగా శతావధానం, సహస్రావధానం వరకు చేస్తారు. ఇది తెలుగువారికి సొత్తు. ఇందులోనే గణితావధానం, నేత్రావధానం, నాట్యావధానం వంటి ఎన్నో ప్రక్రియలు కూడా తెలుగువారిని అలరిస్తున్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ‘భగవద్గీత అవధానం’ చేస్తున్నారు జంగం సిస్టర్స్. ‘నేను పదో తరగతితో చదువు ఆపేశాను. నా ఐదోఏటే మా బాబయ్య మా అక్కకు, నాకు నాట్యం, నాట్యశాస్త్రం కూడా మా బాబయ్యే నేర్పించారు. నాట్యశాస్త్రంలో మొత్తం ఆరువేల శ్లోకాలు ఉన్నాయి. అందులో 3500 శ్లోకాలు కంఠతా నేర్చుకున్నాను. 2021 ఉగాది నాటికి ఆరు వేల శ్లోకాలూ కంఠస్థం చేసి నాట్యావధానం చేయాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి సాధన చేయటమే పరమావధిగా సాగుతున్నాం. మా అక్క సాహిత్య అవధానం చేస్తుంటే, నేను నాట్యావధానం చేయడానికి సన్నద్ధురాలిని అవుతున్నాను. అక్క ఐదోతరగతి చదువుతున్నప్పుడు మొట్టమొదటి గణితావధానం చేసింది. నేను మాత్రం ఏడో తరగతిలో మొదలుపెట్టాను. ఇద్దరం కలిసి ఇప్పటివరకు పది అవధానాలు చేశాం’ అని చెబుతారు చెల్లాయి శిరీష. గణితావధానంలో క్యాలండర్ మెమరీ అంశాన, ఏ సంవత్సరంలో ఏ తారీకు నాడు ఏ వారం వచ్చిందో చెబుతారు. దత్తపది పేరున పన్నెండు అంకెల సంఖ్యను 7, 13 అంకెతో గుణిస్తే ఎంత వస్తుంది లేదా భాగిస్తే ఎంత వస్తుంది... వంటివి చెబుతారు. చిన్నప్పటి నుంచే తండ్రి జంగం చక్రవర్తి పిల్లలకు యోగా నేర్పించారు. అలాగే పద్యాలు కూడా ఆయనే నేర్పించారు. నాట్యానికి సంబంధించి సంగీత పరిజ్ఞానం అవసరం కనుక, ఈ పిల్లలిద్దరికీ సంగీతం నేర్పించారు. ‘ప్రస్తుతం నేను వయొలిన్ నేర్చుకుంటున్నాను, చెల్లి మృదంగం నేర్చుకుంటోంది’ అంటూ తమ గురించి చెప్పుకొచ్చారు జంగం సిస్టర్స్. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫోటోలు: నడిపూడి కిషోర్, సాక్షి, విజయవాడ భగవద్గీత అవధానం... 1. శ్లోకం – సంఖ్య: భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం సంఖ్య అడిగితే ఆ శ్లోకం చెప్పాలి. 2. న్యస్తాక్షరి: ఒక శ్లోకంలో అక్కడక్కడ అక్షరాలు ఇస్తారు. చివరకు మొత్తం శ్లోకం చెప్పాలి 3. దత్తపది: ఒక పదం చెప్పి, ఆ పదం ఏ శ్లోకంలోదో, ఎన్నో అధ్యాయంలోదో అడిగితే, దానికి సమాధానం చెప్పాలి. 4. పాద వ్యతిక్రమం: శ్లోకం తీసుకుని ఏదో ఒక పాదం చెబుతారు. ఆ పాదం ఉన్న శ్లోకం అప్పచెప్పాలి. 5. శ్లోకధార: ఒక అధ్యాయంలో వారు ఒక సంఖ్య చెబుతారు. అంటే రెండు అనే సంఖ్య చెబితే ఆ అధ్యాయంలోని 2, 12, 22, 32 అలా ఆ సంఖ్యల శ్లోకాలు అప్పచెప్పాలి. 6. శ్లోకార్థ తాత్పర్యం: ఏ శ్లోకం అడిగినా దానికి అర్థం తాత్పర్యం చెప్పాలి 7. శ్లోక ఆరోహణ అవరోహణం: ఐదు లేదా పది శ్లోకాలు అడుగుతారు. వాటిని కింద నుంచి పైకి లేదా పై నుంచి కిందకు అప్పగించాలి. 8. ప్రస్తుతి ప్రసంగం: భగవద్గీత మీద అడిగే ప్రశ్నలకు చమత్కార సమాధానాలు చెప్పాలి. గిడుగు వారి జయంతిని పురస్కరించుకుని, మా పిల్లలు వాళ్ల స్నేహితులతో కలిసి ‘శతకసేన’ పేరున మొత్తం 108 పద్యాలు కంఠస్థం చేస్తున్నారు. వారికి సర్టిఫికేట్లు ఇస్తున్నాం. మా పిల్లలు పిల్లలు జావళీలకు నృత్యం సమకూర్చి ప్రదర్శనలు ఇస్తున్నారు. పిల్లలు ఈ మార్గంలో వెళ్లడానికి నా భార్య వాసవి ఒక మౌన సైనికురాలిగా సహకరిస్తోంది. ఈ భగవద్గీత అవధాన కార్యక్రమంలో మా పిల్లలు ఎనిమిది మంది పండితులను అవధానం ద్వారా ఢీ కొట్టబోతున్నారు. గతంలో అత్యంత క్లిష్టమైన గణితావధానం నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఎంతోమంది మా పిల్లలకు ఆశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తున్నారు. నేను పంచకావ్యాలను యక్షగానాలుగా రాశాను. మనుచరిత్రలో పెద్దమ్మాయి ప్రవరాఖ్యుడిగా, చిన్నమ్మాయి వరూధినిగా నటిస్తున్నారు. పిల్లలిద్దరూ ‘నాట్యవేద అకాడెమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్థాపించి’ నృత్య దర్శకత్వం కూడా చేస్తున్నారు. భగవద్గీత ధర్మబద్ధంగా జ్ఞానసముపార్జనకు తోడ్పడుతుంది. అందుకే అందులోని 700 శ్లోకాలు పిల్లలకు నేర్పాను. 72 ఏళ్ల వయసులో యడ్లవల్లి మోహన్‌రావు అనే పండితుడితో ఈ ప్రక్రియలో భగవద్గీత అవధానం చేయించాను. ఆయన తనకు వయసు మీద పడుతుండటంతో, ఈ ప్రక్రియను వేరేవారికి కూడా నేర్పమన్నారు. అప్పుడు మా పిల్లలకు నేర్పాను. వారు ఇప్పుడు ప్రథమంగా ఈ రోజు అవధానం చేస్తున్నారు. భగవద్గీతను రెండు నెలల పాటు సాధన చేశారు. మూడో నెలలో అవధాన క్రమంలో వాళ్ల చేత సాధన చేయించాను. – జంగం శ్రీనివాస చక్రవర్తి, (ఈ చిన్నారుల తండ్రి), తెలుగు పండితులు, విజయవాడ -
మనీషా జోడీకి డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: జేఈ విల్సన్ ఘనా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో తెలుగు అమ్మాయి మనీషా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణతో కలిసి చాంపియన్‌గా నిలిచిన మనీషా... మిక్స్డ్ డబుల్స్‌లో అర్జున్‌తో కలిసి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఘనాలోని అక్రా వేదికగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా–రుతుపర్ణ (భారత్) ద్వయం 21–11, 21–11తో డోర్కస్ అజోకే అడ్సోకన్–చెచువు డెబోరా ఉకెహ్ (నైజీరియా) జంటపై అలవోక విజయాన్ని సాధించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్‌గా బరిలో దిగిన మనీషా–అర్జున్ (భారత్) జంట 19–21, 15–21తో శ్లోక్–రుతుపర్ణ (భారత్) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అర్జున్–శ్లోక్ (భారత్) జోడీ 21–11, 21–12తో గోడ్విన్ ఓలోఫువా–అనౌలువాపో జువోన్ ఒపెయోరి (నైజీరియా) జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిరణ్ జార్జ్ (భారత్) 25–23, 21–19తో అడె రెస్కీ వికాయో (అజర్బైజాన్)ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ముగ్ధా ఆగ్రే (భారత్) 10–21, 6–21తో థి త్రాంగ్ వు (వియత్నాం) చేతిలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలిసారి జరిగిన ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
హాజీపూర్ గ్రౌండ్ రిపోర్ట్
-
ఆ బావిలో మరో మృతదేహం
సాక్షి, యాదాద్రి/బొమ్మలరామారం : యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో శుక్రవారం వెలుగుచూసిన శ్రావణి హత్య ఉదంతం మరవక ముందే సోమవారం మనీషా అనే యువతి హత్యకుగురైన విషయం వెలుగులోకి వచ్చింది. హర్రర్ సినిమాను తలపించే రీతిలో ఒకే తరహాలో వెలుగుచూస్తున్న వరుస హత్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. పేద బాలికలను టార్గెట్ చేసి పథకం ప్రకారం వారిపై అత్యాచారం, హత్య చేసి పూడ్చిపెడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణి మృతదేహం లభించిన వ్యవసాయ బావిలోనే మనీషా (19) మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు భారీ పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాన్ని బావిలోంచి తీసి పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒంటరి మహిళలే టార్గెట్: హాజీపూర్ వద్ద జరిగిన బాలిక, యువతి హత్యలు ఒకేతీరును పోలి ఉండటంతో నిందితుడు ఒక్కడే అన్న అనుమానం బలపడుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి ఈహత్యలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో పలు విషయాలు వెల్లడైనట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి లిప్టు మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఇతనిపై గతంలో ఏపీలోని కర్నూల్, వరంగల్ జిల్లాల్లో మహిళలపై అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అలవాటు ఉన్న శ్రీనివాస్‌రెడ్డి మత్తులో నేరాలకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. గంజాయి, కొకైన్, వైట్నర్ వంటి వాటిని సేవించి ఆ మత్తులో అత్యాచారాలు, హత్యలు చేసే అలవాటు ఉందని సమాచారం. ఒంటరిగా ఉన్న మహిళలు, బాలికలను టార్గెట్ చేసే శ్రీనివాస్‌రెడ్డి, హాజీపూర్ వెళ్లడానికి ఎదురుచూస్తున్న శ్రావణి, మనీషాలను తన వాహనంపై ఎక్కించుకుని తీసుకువస్తూ ఈ ఘాతుకాలకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలికలను తన వాహనంపై తీసుకువస్తూ మధ్యలో బావిలోకి నెట్టేసి.. వారు గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అత్యాచారం చేసి అందులోనే పూడ్చిపెట్టడం శ్రీనివాస్‌రెడ్డి వికృత చర్యలుగా తెలుస్తోంది. అతను సైకోలా వ్యవహరించేవాడని సమాచారం. 2013లో కర్నూల్లో, 2014లో వరంగల్‌లో మహిళలపై అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. ఇటీవల బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లిలో నిర్మానుష్యప్రాంతంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తే అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదినట్లు తెలుస్తోంది. ఇతని నేరప్రవృత్తిని చూసి తోటి పనివారుసైతం దూరమయ్యారని సమాచారం. మూడేళ్ల క్రితం గ్రామంనుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఏడాదిగా మళ్లీ గ్రామంలో ఉంటున్నాడు. శ్రావణిని వ్యవసాయ బావిలోంచి తీసిన సమయంలో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి తన తండ్రితో కలసి ప్రజల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఇదే మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన అనే బాలిక అదృశ్యం వెనుక కూడా శ్రీనివాస్‌రెడ్డి హస్తం ఉన్నదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ వ్యవసాయ బావిలో మరికొంతమంది మృతదేహాలు ఉండొచ్చని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. విచారణలో విషయం వెల్లడి çహాజీపూర్‌కు చెందిన బాలిక పాముల శ్రావణి హత్యకేసులో ఎస్ఓటీ పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మనీషా హత్యోదంతం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగానే బావిలో పుస్తకాల బ్యాగును గుర్తించి దాని కిందనే శవాన్ని వెలికితీశారు. రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి సోమవారం ఉదయం శ్రావణి శవాన్ని తీసిన బావిలోకి దిగి మనీషాకు చెందిన పుస్తకాల బ్యాగును గుర్తించి అందులో గుర్తింపు కార్డు, బస్‌పాస్, సెల్‌ఫోన్ పౌచ్, స్కార్ప్, పెన్నులు, చెవి కమ్మలు, చెప్పులు, నోట్ పుస్తకాలపై పేరుతో మృతురాలు మనీషా అని నిర్ధారణకు వచ్చారు. అనంతరం మనీషా కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి మీ కూతురు ఇటీవల కనిపించకుండా పోయిందా అని ప్రశ్నించడంతో వారు శివరాత్రి పండుగ తర్వాత కళాశాలకు వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు. ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పారు. పరువు పోతుందన్న కారణంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వారు వివరించారు. పోలీసులు మృతురాలు మనీషా తండ్రి నుంచి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఫిర్యాదు తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పర్యవేక్షణలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మనీషా కనిపించకుండా పోయి 45 రోజులవడంతో ఎముకలగూడే మిగిలింది. కళాశాలకు వెళ్తున్నా అని.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురానికి చెందిన తిప్రబోయిన మల్లేశ్, భారతమ్మ కుటుంబం బతుకుదెరువు కోసం హాజీపూర్‌కు 20 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడింది. కూలీ పనులు చేసుకుంటూ జీవించే మల్లేశ్‌కు నలుగురు కుమార్తెలు. ముగ్గురి వివాహం చేశాడు. చిన్నకూతురు మనీషా మేడ్చల్ జిల్లా కీసరలో గల కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. మార్చి 6వ తేదీన కళాశాలకు వెళ్తానని చెప్పిన ఆమె తిరిగి రాలేదు. ఆనాటి నుంచి తన కూతురు కోసం మల్లేశ్ వెతుకుతూనే ఉన్నాడు. ఈలోపు పోలీసులు వచ్చి తప్పిపోయినట్లుగా ఫిర్యాదు తీసుకోవడం.. బావిలో శవమై ఉన్నదన్న సమాచారం తెలియడంతో మల్లేశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కుప్పకూలిపోయాడు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన నందు, భాగ్యమ్మ దంపతుల మూడో కుమార్తె కల్పన స్థానికంగా 6వ తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో 2015 ఏప్రిల్‌లో హాజీపూర్‌లో నివాసం ఉంటున్న తన మేనత్త జయమ్మ ఇంటికి వచ్చింది. అదే నెల 22వ తేదీన మధ్యాహ్న సమయంలో మేనత్త ఇంటి వద్ద నుంచి కాలినడకన స్వగ్రామానికి బయలుదేరింది. కానీ ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు బంధువుల ఇళ్లలో వెతికి మరుసటి రోజే ఫిర్యాదు చేశారు. ఇంతవరకు కల్పన ఆచూకీ కనిపెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెళ్లయిన నాలుగు రోజులకే నవవధువు మృతి
రాంగోపాల్‌పేట్: కాళ్ల పారాణి ఆరలేదు...పెళ్లి తంతూ ఇంకా పూర్తికాలేదు. అంతలోనే ఓ నవ వధువును కరెంటు కాటేసింది. పెళ్లయిన నాలుగు రోజులకే ఆమెకు నూరేళ్లు నిండాయి. హీటర్ షాక్ కొట్టి నవవధువు మృతి చెందిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ కళాసీగూడ ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన పరమేశ్వర్, షీమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం జరిగింది. పరమేశ్వర్ మృతి చెందగా, షీమాదేవి కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటోంది. రెండో కుమార్తె మనీషా ఈ నెల 22న నాంపల్లికి చెందిన కృష్ణ శర్మతో వివాహం జరిగింది. సికింద్రాబాద్‌లోని సిక్‌వాలా సమాజ్‌లో ఘనంగా వివాహం జరిపించారు. శుక్రవారం పుట్టింట్లో పగిరిరథం (ఫంక్షన్) ఉండటంతో ఆమెను కళాసీగూడకు తీసుకుని వచ్చారు. రాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక జరిగింది. శనివారం ఉదయం స్నానం చేసేందుకు బాత్ రూమ్‌లో బకెట్లో హీటర్ పెట్టుకున్న ఆమె నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు కరెంట్ స్విచ్ ఆఫ్ చేయకుండా హీటర్‌ను బయటికి తీసింది. అదే సమయంలో హీటర్ ఆమెకు నడుముకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. బాత్రూమ్లో కిందపడి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పెళ్లింట్లో విషాదం... బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్లైన నాలుగు రోజులకే వధువు మృతి చెందడంతో విషాదం నెలకొంది. మనీషా కుటుంబ సభ్యులు, ఆమె భర్త బోరున విలపించారు. -
అదరగొట్టిన భారత బాక్సర్లు!
న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన ఐదు విభాగాల బౌట్లకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు విజయాలు సాధించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (48 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 2006 చాంపియన్ లైష్రామ్ సరితా దేవి (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. మరో బౌట్లో గెలిచి సెమీస్ చేరుకుంటే మేరీకోమ్, మనీషా, లవ్లీనా, భాగ్యవతిలకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. రికార్డుస్థాయిలో ఆరో స్వర్ణంపై గురి పెట్టిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఈ మెగా ఈవెంట్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగిన ఈ మణిపూర్ బాక్సర్ 5–0తో ఐజెరిమ్ కెసెనయేవా (కజకిస్తాన్)ను ఓడించింది. తొలి రౌండ్లో ఆచితూచి ఆడిన మేరీకోమ్ రెండో రౌండ్లో అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌లు విసిరింది. బౌట్‌ను పర్యవేక్షించిన నలుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 30–27 పాయింట్లు ఇవ్వగా... మరోజడ్జి 29–28 పాయింట్లు ఇచ్చారు. ‘తొలి బౌట్ కఠినంగానే సాగింది. టోర్నీలో మొదటి బౌట్ కావడంతో ఒత్తిడితో పాల్గొన్నా. అయితే గత 16 ఏళ్లుగా నా అభిమానుల నుంచి ఈ రకమైన ఒత్తిడిని విజయవంతంగా అధిగమిస్తూ వస్తున్నా. ఈ తరహా ఒత్తిడంటే నాకు ఇష్టమే’ అని 35 ఏళ్ల మేరీకోమ్ వ్యాఖ్యానించింది. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా బాక్సర్ వు యుతో మేరీకోమ్ తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా మౌన్ మరో సంచలనం నమోదు చేసింది. 54 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ దీనా జాలమన్ (కజకిస్తాన్)తో జరిగిన బౌట్లో మనీషా 5–0తో గెలుపొందింది. ఈ ఏడాది దీనాపై మనీషాకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. పోలాండ్‌లో ఇటీవలే జరిగిన సిలెసియాన్ టోర్నీలోనూ మనీషా చేతిలో దీనా ఓడిపోయింది. ‘ఒకసారి రింగ్‌లో అడుగుపెడితే నా ప్రత్యర్థి ప్రపంచ చాంపియనా? రజత పతక విజేతా? లాంటి విషయాలు అస్సలు పట్టించుకోను. ( భాగ్యవతి ,లవ్లీనా,మనీషా,సరితా దేవి ) క్వార్టర్ ఫైనల్లో్లనూ దూకుడుగానే ఆడతా’ అని మనీషా వ్యాఖ్యానించింది. ఇతర బౌట్లలో లవ్లీనా 5–0తో 2014 ప్రపంచ చాంపియన్ అథెనా బైలాన్ (పనామా)పై... భాగ్యవతి 4–1తో నికొలెటా షోన్బర్గర్ (జర్మనీ)పై గెలుపొందారు. మరో బౌట్లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 2–3తో కెలీ హారింగ్టన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఫలితంపై సరితా దేవి అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం చలాయించాను. కానీ జడ్జిల నిర్ణయంతో నిరాశ చెందాను. అయితే వారి నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. 2014 ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న వివాదం కారణంగా నాపై ఏడాదిపాటు నిషేధం విధించారు. జడ్జిలను విమర్శించి మరోసారి వివాదంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’ అని 36 ఏళ్ల సరితా దేవి వ్యాఖ్యానించింది. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టోకా పెట్రోవా (బల్గేరియా)తో మనీషా; స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా; పాలో జెస్సికా (కొలంబియా)తో భాగ్యవతి తలపడతారు. -
తొలి పంచ్ అదిరింది
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సరిత దేవి, మనీషా శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్ బౌట్లలో వీరిద్దరు అలవోక విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 54 కేజీల విభాగంలో మనీషా 5–0తో క్రిస్టినా క్రుజ్ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... 60 కేజీల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ సరిత దేవి 4–0తో డయానా శాండ్రా బ్రగెర్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెల్లీ హెరింగ్టన్ (ఐర్లాండ్)తో సరిత, డీనా జోలామన్ (కజకిస్తాన్)తో మనీషా తలపడతారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా తన బౌట్లో ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయించింది. గతంలో రెండుసార్లు ఈ మెగా ఈవెంట్లో కాంస్యాలు గెలిచిన 36 ఏళ్ల క్రుజ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన మనీషా ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు నివేదిక
తాడితోట (రాజమహేంద్రవరం): వివాహమై ఆరు నెలలైంది. గర్భిణి అని తెలియడంతో రక్త పరీక్షల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆ యువతికి పిడుగులాంటి వార్త అందింది. తనకు హెచ్ఐవీ ఉందంటూ ఆస్పత్రి సిబ్బంది నివేదిక ఇచ్చారు. తనకు వచ్చే అవకాశమే లేదని బాధితురాలు వాపోయినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరువు పోయిందని భావించిన ఆమె భర్త, ఆ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, సన్నిహితుల సలహా మేరకు ప్రైవేట్ ల్యాబ్‌లో ఆ యువతి పరీక్షలు చేయించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేదనే తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని నిరసనకు దిగారు. తప్పుడు నివేదిక ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సంతోష్‌నగర్‌కు చెందిన నల్లామట్టి నాని ఆటో డ్రైవర్. అతని భార్య మనీషా గర్భిణి. ఈ నెల 4న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగానికి వైద్య పరీక్షలకు వెళ్లింది. రక్త పరీక్షలు నిర్వహించేందుకు రక్తం శాంపిల్ తీసుకొని ఇంటికి పంపించేశారు. మరుసటి రోజున ‘మీ భర్తను తీసుకొని ఆస్పత్రికి రండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. తన భర్తను వెంటబెట్టుకొని ఆమె హడావుడిగా వెళ్లింది. ‘నీకు హెచ్ఐవీ ఉందని’ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో ఆ దంపతులు హడలిపోయారు. ‘నేను బయట తిరిగేదాన్ని కాదు. పెళ్లయి ఆరు నెలలైంది. నాకు హెచ్ఐవీ ఎలా వస్తుంది’ అంటూ ఆ యువతి విలపించినా పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఉన్న హెచ్ఐవీ కౌన్సిలర్ లలిత బలవంతంగా హెచ్ఐవీ విభాగం (ఏఆర్టీ సెంటర్)కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, భీతిల్లిన ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయింది. బాధితురాలి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఆ రిపోర్టుతో తీవ్ర మనోవేదనకు గురైన మనీషా 5న ఆత్మహత్య చేసుకునేందుకు బయటకు వెళ్లిపోతుండగా స్థానికులు రక్షించారు. ఆమె తల్లి, భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిపోర్టు మీద నమ్మకం లేక మరో ల్యాబ్‌లో రక్త పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని తేలింది. మరో మూడు చోట్ల రక్త పరీక్షలు చేయించినా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం వల్లే తప్పుడు రిపోర్టులు వచ్చాయని నిర్ధారణకు వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ రవిపైనా, గర్భిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిలర్ లలితపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనపై ఎంక్వెరీ వేశామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామన్నారు. -
బాయ్‌ఫ్రెండ్ ద్రోహం చేశాడని..లైవ్‌లో
ఫగ్వారా : ప్రియుడు మోసం చేశాడని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది ఓ పంజాబీ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషియాపూర్ జిల్లాకి చెందిన మనీషా(18) ఫగ్వారాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. గత గురువారం రాత్రి ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ‘ నా బాయ్‌ఫ్రెండ్ ఇందర్ నాకు ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. అది నేను తట్టుకోలేక పోతున్నా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. లేఖలో ప్రియుడి పేరు మాత్రమే రాసి ఉందని, అతని వివరాలు ఏమీ లేవని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్ డేటా పరిశీలిస్తున్నామని..త్వరలోనే మనీషా ప్రియుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. భువనగిరిలో మరో యువతి ఆత్మహత్య తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మానస అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడని, శారీరంగా వాడుకున్నాడని, తన తల్లిని కూడా ఏమైనా చేస్తాడేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి స్వస్థలం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు
‘‘సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్ అవ్వాలి. యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్‌కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. సంగకుమార్ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్‌ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ ఎం. శ్రీధర్, నటులు రాజ్‌కాంత్, సంజన మేరీ, ఎస్ఎస్ పట్నాయక్ పాల్గొన్నారు. -
మిసెస్ ఇండియా యునివర్స్ మనీషా
యశవంతపుర : ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన డాజల్ మిసెస్ ఇండియా యునివర్స్–2018 కిరీటాన్ని శివమొగ్గకు చెందిన మనీషా వరుణ్ దక్కించుకొంది. ఈ పోటీలు శ్రీలంక–భారత పర్యటక శాఖ అధికారులు నిర్వహించారు. ఈనెల 14న జరిగిన ఈ పోటీలలో శివమొగ్గకు చెందిన వక్క వ్యాపారి వరుణ్ భార్య మనీషా పాల్గొని మిసెస్ ఇండియా యునివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మిస్ ర్యాంప్ వాక్, మిసెస్ ఇండియా యునివర్స్ సౌత్ పురస్కారాలు దక్కించుకున్న ఆమె మిసెస్ ఇండియా యునివర్స్–2018లో విన్నర్‌గా నిలిచారు. -
డబుల్స్ ఫైనల్లో మనీషా ద్వయం
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. మనీషా భారత్‌కే చెందిన తన భాగస్వామి ఆరతి సారా సునీల్‌తో కలిసి ఫైనల్లోకి ప్రవేశించింది. పోలాండ్లోని బీరన్ నగరంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనీషా–ఆరతి జోడీ 21–12, 21–13తో కార్నెలియా మార్క్‌జాక్–మగ్దలీనా విటెక్ (పోలాండ్) జంటపై విజయం సాధించింది. -
21న తెరపైకి మీసైమురుక్కు
తమిళసినిమా: మీసైమురుక్కు చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు దర్శకుడు సుందర్.సీ వెల్ల డించారు. ఆయన తన అవ్నీ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. యువ సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ ఆది కథ, కథనం, మాటలు, పాట లు, సంగీతం, దర్శకత్వం వహించి కథానా యకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మీసైమురుక్కు. ఆద్మిక, మనీషా కథానాయకలుగా నటించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. చిత్ర నిర్మాత సుందర్.సీ విలేకరులతో మాట్లాడుతూ తాను క్లబ్బుల పబ్బుల పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హిప్ హాప్ తమిళా ఆదిని కలిశానన్నారు. ఆ సయమంలో చిత్రంలోని ఐదు పాటలను ఐదుగురు సంగీతదర్శకులతో చేయించాలని భావించామని అన్నారు. అలా ఆదికి ఇచ్చిన పళగికలామా పాట బాగా నచ్చిందన్నారు. చిత్రంలో ని అన్ని పాటలను తానే చేస్తానని ఆది అడగటంతో తానూ ఒకే చెప్పానని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆదికి హీరో అవకాశం కల్పిస్తానని మాటిచ్చానని, అది ఇప్పుడు నెర వేర్చానని అన్నారు. చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే విధంగా ఉంటుందని సుందర్.సీ తెలిపారు. -
ఈమెకు నాగదేవతతో సంబంధముందట
- 34సార్లు పాము కరిచినా ఆరోగ్యంగానే ఉన్న మనీషా - 26సార్లు శ్వేతనాగే కాటేసిందన్న కుటుంబ సభ్యులు శ్రీమౌర్: ఒక్కసారి పాము కరిస్తేనే బతకడం కష్టం. అలాంటిది 34 సార్లు కరిస్తే.. బతికే అవకాశముంటుందా? కానీ ఓ అమ్మాయి బతికేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రీమౌర్లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. అయితే ఇందులో 26 సార్లు ఆమెను శ్వేతనాగే (తెల్లని త్రాచుపాము) కరవడం విశేషం. ఆమె ఎక్కడున్నా ఆ శ్వేతనాగు వచ్చి కాటేసి వెళ్లిపోతోందట. మొదటిసారి స్థానిక నది సమీపంలో పాము కరిచిందని, ఆ తర్వాత ఒక్కోరోజు రెండుమూడుసార్లు కూడా శ్వేతనాగు కరిచేదని చెబుతోంది. ఆ తర్వాత మరికొన్ని పాములు కూడా తనను కాటేశాయని, గడిచిన మూడేళ్లలో మొత్తం 34 సార్లు తాను పాము కాటుకు గురయ్యానని చెప్పింది. అయినా తనకేమీ కాకపోవడం వెనుక నాగదేవతే ఉందని నమ్ముతోంది. తనకు నాగ దేవతకు ఏదో సంబంధం ఉండటం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్టు ఆ అమ్మాయి చెబుతోంది. కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు గుర్తించినట్టు తెలిసింది. తాజాగా ఫిబ్రవరి 18న మరోసారి పాము కరవడంతో మనీషా ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ కేకే ప్రసాద్ చెప్పారు. ‘పాము కాటుకు గురైన లక్షణాలతో మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇది విషం లేని పాముగా గుర్తించాం. ఇక్కడ ఉండే 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదు’అని డాక్టర్ తెలిపారు. -
34సార్లు పాములు కరిచినా తప్పించుకోగలిగింది
శ్రీమౌర్ : 34 సార్లు పాములు కరిచిన తర్వాత ఎవరైనా బతికి ఉన్నారని ఎప్పుడైనా విన్నారా? నిజంగా ఆశ్చర్యం. హిమచల్ ప్రదేశ్‌లోని శ్రీమౌర్లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా.. వాటి విషం నుంచి తప్పించుకోగలిగింది. గత మూడేళ్లలో ఆ అమ్మాయి 34 సార్లు పాము కాటుకు గురైంది. మొదటిసారి ఆ అమ్మాయి తమ స్థానిక నది సమీపంలో పాము కరిచింది. స్కూల్ డేస్‌లో తనను చాలా సార్లు పాము కరిచిందని, ఒక్కోసారి రోజుకు రెండు లేదా మూడు సార్లు పాము కాటుకు గురయ్యే దానినని మనీషా చెబుతోంది. అయితే తనకు నాగ దేవతకు ఏదో సంబంధం ఉండటం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్టు ఆ అమ్మాయి పేర్కొంటోంది. కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు గుర్తించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 18న పాము కరిచిన కారణంగా మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయిందని డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ''పాము కాటుకు గురైన లక్షణాలతో మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇది విషం లేని పాముగా గుర్తించాం. ఇక్కడ ఉండే 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదు'' అని డాక్టర్ కేకే ప్రసాద్ తెలిపారు. మనీషా పాము కాటుకు గురవ్వడం రొటీన్ అయిపోయిందని ఆమె తండ్రి సుమెర్ వర్మ చెబుతున్నాడు. అయితే తరుచు ఆమెను పాములు కరవడంతో మనీషా శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పెరిగి, పాము కాటు నుంచి తప్పించుకునే ప్రక్రియ ఉత్పన్నమవుతుందని హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ శాఖ పశువైద్యుడు డాక్టర్ రోహిత్ చెబుతున్నారు. -
భార్యను చావబాది.. తలను రంపంతో కోసి..
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు ఢిల్లీ నగరమంతా కాస్తంత సంబరాల మధ్య ఉండగా నగర పోలీసులు మాత్రం ఓ అవాక్కయ్యే కేసును పట్టుకున్నారు. కట్టుకున్న భార్యను కడతేర్చి కసాయిగా ఆమె తలను మొండేన్ని వేరు చేసిన భర్తను అరెస్టు చేశారు. అత్యంత భయంకరమైన ఈ ఘటన మూడు రోజుల కిందే జరిగింది. తన భార్యను చంపేసిన ఆ వ్యక్తి మూడు రోజులపాటు ఆమె మృతదేహంతోనే కలిసి ఉన్నాడు. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని మధు విహార్ అనే ప్రాంతంలో సుబోధ్ కుమార్ (40) అనే వ్యక్తి మనీషా భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలె భార్యకు తెలియకుండా అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మునియా. రెండు ఫ్యామిలీలు నడపాలన్న కుట్ర చేసినా చివరికి అది బయటపడటంతో సుబోధ్‌ను భార్య మనీషా నిలదీసింది. ఈ విషయంపై ఇటీవల తరుచు వారిమధ్య గొడవలు జరిగాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్య సుబోధను అడిగింది. అయితే, తాను చెప్పినట్లు పడుండాలంటూ అతడు గొడవపడ్డాడు. పిల్లలను ముందుగానే తన అత్తమామ వద్దకు పంపించి తన భార్యను చంపే కుట్ర రచించాడు. శనివారం రాత్రి ఆమెపై పైపు దాడి చేసి పదేపదే తలపై కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే వీలుకాక రంపాన్ని తెచ్చి ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఆయా సంచుల్లో ఆమె దేహాన్ని ముక్కలు చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే, అప్పటికే మూడు రోజులు కావడంతో దుర్గంధం వచ్చి చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం తెలిసింది. తాను నేరం చేసినట్లు అతడు అంగీకరించాడు. అయితే, అతడి రెండో భార్య మునియా హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భర్తతో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక..
జైపూర్: తన భర్తతో చనువుగా ఉంటుందనే అనుమానంతో చిన్ననాటి స్నేహితురాలిని పథకం ప్రకారం హతమార్చిందో యువతి. అనంతరం ప్రమాదవశాత్తు స్నేహితురాలు మరణించిదంటూ కట్టుకథలు అల్లింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఆమె చివరకు కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్తాన్ జైపూర్‌లోని చురులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.... బబిత, మనీషా బాల్య స్నేహితులు కాగా, ఆర్మీ జవాన్ అజయ్‌తో మనీషా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్తతో బబితకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానం కలిగింది. అంతేకాకుండా వారిద్దరూ గంటలకొద్ది ఫోన్లలో మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో ఆమెపై మనీషా ఆగ్రహం పెంచుకుంది. దీంతో ఎలాగైనా స్నేహితురాలిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అజయ్ వస్తున్నాడని, తనకు తోడు రావాలంటూ మనీషా ఈ నెల 6న బబితను రతన్‌ఘర్ సమీపంలోని చర్న్వాసి బస్టాండ్‌కు తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితురాళ్లు బస్టాండ్ సమీపంలోని ఓ చెరువు వద్ద కూర్చున్నారు. కొంత సమయం గడిచాక, మనీషా అనుకోకుండా పడిపోయినట్లుగా తన చేతికున్న ఉంగరాన్ని నీళ్లలోకి జారవిడిచింది. అది తన ఎంగేజ్మెంట్ రింగ్ అని అదిపోతే అజయ్ ఫీల్ అవుతాడని, తీసివ్వాల్సిందిగా బబితను కోరింది. రింగ్ కోసం చెరువులోకి దిగిన బబిత, లోతు ఎక్కువగా ఉండటంతో తాడు సాయంతో బయటకు వచ్చేందుకు యత్నించింది. అయితే మనీషా...స్నేహితురాలు పైకిరాకుండా గుండెలపై బలంగా కాలితో తన్నడంతో ఆమె నీళ్లలో మునిగిపోయింది. తన కుమార్తె మృతిపై బబిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు మనీషాను తమదైన శైలిలోవిచారణ జరపటంతో నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు బుధవారం మనీషాను అదుపులోకి తీసుకుని ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : విజయనగర్ కాలనీకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు అనంతపురం నగర సమీపంలో ఉన్న విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న జయరాములు పార్వతమ్మల కుమార్తె మనీషా(19) నగరంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వెలువడిన పరీక్షల ఫలితాల్లో రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నంపల్లిలో వృద్ధురాలు.. బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని చెన్నంపల్లిలో ఓ వృద్ధురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నంపల్లిలో జయమ్మ (70) అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. జీవితంపై విరక్తి చెంది కొడుకు, కోడలు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చని కుటుంబంపై విధి కన్నెర్ర
కేకే నగర్ : విధి ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన జీవితాలతో ఆడుకుంటుందన్న విషయం ఎవరికీ తెలియదు. విధి ఆడిన నాటకంలో తల్లి, చెల్లిని మంటల్లో కోల్పోయిన ఓ చిన్నారి లగ్జరీ కారు రూపంలో వచ్చిన మృత్యువు ద్వారా తండ్రిని కూడా దూరం చేసుకుంది. ఇప్పడు ఏ నీడా లేక ఒంటరిగా అనాథగా మిగిలింది. తిరుత్తణి సమీపంలోని అకూర్ గ్రామానికి చెందిన ఆర్ముగం అదే ప్రాంతానికి చెందిన పుష్ప అనే యువతిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి మనీషా(07), రంజన(05) ఇద్దరు కుమార్తెలు. భార్య, కుమార్తెలు తిరుత్తణి, అకూర్లో నివసిస్తుండగా ఆర్ముగం చెన్నైలో ఉంటూ ఆటో నడిపేవాడు. రాత్రింబవళ్లు అద్దె ఆటో నడిపే ఆర్ముగంకు ఆటో యజమాని రోజుకు రూ.300 ఇచ్చేవాడు. ఈ సంపాదనతో ఆర్ముగం కుటుంబం ఆనందంగా గడిపేది . వీలైనప్పుడు ఆర్ముగం అకూర్కు వెళ్లి భార్య పిల్లలకు ఇష్టమైనవి కొనిచ్చి సంతోషపెట్టేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ తగాదాల కారణంగా ఆర్ముగం భార్య పుష్ప గత మే నెలలో తన చిన్న కుమార్తె రంజనను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంది. తల్లి చెల్లిని కోల్పోయిన మనీషా తన అవ్వ మంజుల దగ్గర ఉంటోంది. భార్య కుమార్తెల మృతితో ఆర్ముగం దిక్కులేనివాడయ్యాడు. అయినా మనీషా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరిగి చెన్నై వ చ్చి ఆటో నడపడం ప్రారంభించాడు. అ క్రమంలో గత 18న ఆల్వార్‌పేట రాధాకృష్ణన్ రోడ్డుపై ఆటోలో నిద్రిస్తుండగా అతనిపై విధి రెండోసారి పంజా విసిరింది. వికాస్ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు పక్కన నిలిపిఉన్న 12 ఆటోలను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఆటోడ్రైవర్లు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిలో ఆర్ముగం చికిత్సలు ఫలించక మృతి చెందాడు. దీంతో చిన్నారి మనీషా ఒంటరిగా మిగిలింది. మూడు నెలల క్రితం తల్లిని, చెల్లిని కోల్పోయి బాధలో ఉన్న చిన్నారి మనీషా తండ్రి మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తోంది. నాన్న చెన్నై నుంచి ఎప్పుడు వస్తాడు? ఇంక రాడా? అంటూ అవ్వను ప్రశ్నించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇలా ఉండగా ఆళ్వార్ పేటలో మద్యం తాగి అతివేగంగా కారు నడిపి ఆర్ముగం మృతికి కారకుడైన వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు భవిష్యత్తులో కారు రేస్‌లో పాల్గొనడానికి వీలులేదని ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. విశాల్ ఉదారత : ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ ఆర్ముగం కుమార్తె మనీషా చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను దేవి ట్రస్ట్ ద్వారా భరిస్తానని నటుడు విశాల్ తెలిపారు. ఈ విషయమై ఆయన ఆర్ముగం ఇంటికి వెళ్లి మనీషా అవ్వ మంజులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. -
కట్టుకున్నోడే కడతేర్చబోయాడు
నేలకొండపల్లి : అదనపు కట్నం ఇవ్వకుంటే చంపుతానని చిత్రహింసలు.. భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్య.. అక్కడ కూడా వదలకుండా అర్ధరాత్రి ఇంట్లో చొరబడి భార్య గొంతుపై కత్తితో పొడిచాడు భర్త. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. కోరట్లగూడెం గ్రామానికి చెందిన జరీనా కూతురు మనీషాను.. నల్లగొండ జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెంకు చెందిన జలీల్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొంతకాలం సాఫీగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో ఓ కూతురు జన్మించింది. పనీపాట లేకుండా తిరుగుతున్న జలీల్ అదనపు కట్నం తేవాలని నిత్యం భార్యను వేధించేవాడు. తట్టుకోలేక మనీషా పుట్టింటికి నెల క్రితం వచ్చింది. అయినా వదలకుండా అప్పుడప్పుడు వచ్చి బెదిరించేవాడు. దీంతో మనీషా విషయాన్ని తల్లికి, ఇతర పెద్దలకు చెప్పింది. ఈ క్రమంలో ఇంట్లో మనీషా నిద్రిస్తుండగా.. ఆరుబయట తల్లి జరీనా, మనవరాలు పడుకున్నారు. దీనిని గమనించిన జలీల్ ఇంటి వెనక ఉన్న కిటికీని పగులగొట్టి లోనికి చొరబడ్డాడు. మంచంపై నిద్రిస్తున్న మనీషా గొంతుపై కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన మనీషా మాటలు రాకపోవడంతో.. పలకపై రాసి విషయాన్ని తల్లికి చూపింది. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అనంతరం మనీషాను చికి త్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించినట్లు తల్లి తెలిపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై పి.దేవేందర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్లో రచ్చకెక్కిన విభేదాలు
ఆదిలాబాద్ : తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగురామన్నకు ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ వర్గీయుల మధ్య నెలకొన్న విభేదాలు గురువారం తారస్థాయికి చేరాయి. పట్టణంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎవరికి వారే పోటాపోటీగా చేసుకుంటున్నారు. ఛైర్మన్ మనీషాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మంత్రి జోగు రామన్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మంత్రి వ్యవహార శైలిపై మున్సిపల్ ఛైర్మన్ మనీషా వర్గీయులు కారాలు మెరియాలు నూరతున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం వద్ద పంచాయితీ తేల్చుకోవాలని ఇరు వర్గాలు వ్యూహారచన చేస్తున్నట్లు సమాచారం. -
మనీషా-సాత్విక్ జంటకు ‘మిక్స్డ్’ టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ముంబై: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కె.మనీషా-సాత్విక్ సాయిరాజ్ ద్వయం టాటా ఓపెన్ ఇండియన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మనీషా-సాత్విక్ జంట 21-13, 21-16తో రెండో సీడ్ అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడిపై విజయం సాధించింది. శనివారం టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించిన మనీషా-సాత్విక్ అదే జోరును ఫైనల్లోను కనబరిచారు. సమన్వయంతో ఆడుతూ తమ ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. విజేతగా నిలిచిన మనీషా-సాత్విక్ జోడికి 1,185 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 79 వేలు)తోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మనీషా కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. గతంలో ఆమె నందగోపాల్‌తో కలిసి 2013లో మాల్దీవ్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి జంట 11-21, 21-15, 13-21తో టాప్ సీడ్ చలాద్‌చలమ్ చాయనిత్-ఫతైమాన్ మ్యున్‌వోంగ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌గా నిలవడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది మేఘనతో కలిసి ఫైనల్ ఆడిన మనీషాకు ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. తన సోదరుడు సౌరభ్ వర్మతో జరిగిన ఫైనల్లో సమీర్ వర్మ 21-11, 21-18తో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జోడీ 14-21, 9-21తో వానవత్-ఇస్రియానాతె (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
వారి భాష మీకు తెలుసా?
ఆత్మబంధువు ‘‘హలో రేఖా. ఎలా ఉన్నావ్?’’ ఫోన్లో పలకరించింది మనీషా. ‘‘హాయ్ మనీ... వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటే ఇవ్వాళ నా మీద దయ కలిగింది.’’ ‘‘అదేం లేదు. ఆ మధ్య మీ ఇంటికి వచ్చాం కదా. అప్పటినుంచి నీతో మాట్లాడాలనే అనుకుంటున్నా. కానీ నువ్వు ఏమనుకుంటావోననీ...’’ ‘‘ఏమిటే... ఏదైనా సమస్యా?’’ ‘‘హా... సమస్యే. కలిసి చెప్తాలే. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు.’’ ‘‘నీకోసం ఎప్పుడైనా ఫ్రీ నే. వచ్చేసెయ్’’ అంది రేఖ. సరే అని ఫోన్ పెట్టేసిన రెండు గంటల్లో రేఖ ఇంటిలో ప్రత్యక్షమైంది మనీషా. అంత త్వరగా వచ్చిందంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుందని అర్థమైంది రేఖకు. కాస్త కాఫీ తాగాక కబుర్లు మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు చెప్పరా. ఏంటి నీ సమస్య?’’ అడిగింది. ‘‘శంకర్’’ తటపటాయిస్తూ చెప్పింది మనీషా. ‘‘శంకర్‌తో నీకు సమస్యేంటే?’’ ‘‘మనం కాలేజీలో ఉన్నప్పుడు వాడు నాకోసం ఎంత తిరిగాడో, ఎలా తపస్సు చేశాడో నీకు తెలుసుగా. అంతగా ప్రేమిస్తున్నాడనే ఇంట్లో వాళ్లను ఒప్పించి వాడ్ని పెళ్లి చేసుకున్నా.’’ ‘‘అవును. ఇప్పుడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా?’’ ‘‘అలాంటిదేం లేదు. కానీ ఓ మంచి చీర కట్టుకున్నా, మంచి వంట చేసినా... అసలేమీ మాట్లాడడు.‘ఐ లవ్యూ’ చెప్పిన సందర్భాలైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘నేను రోజుకోసారైనా చెప్తా.’’ ‘‘శంకర్ ఐలవ్యూ చెప్పడం లేదంటే... నువ్వంటే ఇష్టం లేదా?’’ ‘‘కాదు, ఇష్టమే. ఎక్కడ టూర్‌కు వెళ్లినా తీసుకెళ్తాడు. తీసుకెళ్లలేకపోతే నాకోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. నా ఫొటోలు తీసి ఇల్లంతా అలంకరిస్తాడు. నేను మంచి చీర కట్టుకుంటే తినేసేలా చూస్తాడు.’’ ‘‘మరింకేం.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావ్‌గా’’ కన్నుగీటింది రేఖ. ‘‘అవుననుకో. కానీ ఓ మాటామంతీ ఉండదే.’’ అర్థమైనట్లుగా తలూపింది రేఖ. ‘‘నీ సమస్య శంకరా? లేక అతను మాట్లాడక పోవడమా?’’ అంది కూల్‌గా. ‘‘అంటే... వాడి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, నేను చెప్పినా స్పందించక పోవడం నాకు నచ్చట్లేదు.’’ ‘‘కనీసం తన ప్రేమ అర్థమైందా?’’ ‘‘అర్థమైంది కానీ...’’ అంటూ ఆగిపోయింది మనీషా. ‘‘సమస్యేమిటో నీకు అర్థం కాలేదని నాకర్థమైందిలే.’’ ‘‘నువ్వు అర్థం చేసుకుని ఏదైనా సలహా చెప్తావనేగా నీ దగ్గరకు వచ్చింది.’’ ‘‘సరే సరే... ఇచ్ లీబే డిచ్.’’ ‘‘ఏంటీ?’’ అర్థం కాక అడిగింది మనీషా. ‘‘జే తైమే.’’ ‘‘ఏంటే... ఏమంటున్నావ్?’’ ‘‘తే అమో.’’ ‘‘ఏమైందే... ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావ్?’’ ‘‘ఐ లవ్యూ అని జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో చెప్పా. అర్థమైందా?’’ అంది రేఖ నవ్వుతూ. ‘‘ఊహూ’’ అంటూ తల అడ్డంగా ఊపింది మనీషా. ‘‘కదా... అలాగే శంకర్ మాట్లాడే భాష కూడా నీకు అర్థం కావడం లేదు.’’ ‘‘మేం మాట్లాడుకునేది తెలుగులోనే కదా. అర్థం కాకపోవడమేంటి?’’ అంది మనీషా అయోమయంగా. ‘‘చెప్తా చెప్తా. మనుషులు మౌలికంగా మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. దృష్టి ప్రధానం, శ్రవణ ప్రధానం, అనుభూతి ప్రధానం. మీరు మాట్లాడుకునేది తెలుగు లేదా ఇంగ్లిష్‌లోనే అయినా మీరెంచుకునే పదాలు ఆయా వ్యక్తిత్వాలపైన ఆధారపడి ఉంటాయి. శంకర్‌ది దృష్టి, అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని నీ మాటలను బట్టి అర్థమైంది. అంటే అతను అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి ఇష్టపడతాడు. తన ప్రేమను అందమైన కానుకల రూపంలో లేదంటే స్పర్శ ద్వారా వ్యక్తీకరిస్తాడు. నీది శ్రవణ ప్రధానమైన వ్యక్తిత్వం. నీకు ఏదైనా మాటల్లో చెప్పాలి. చేతల్లో చూపిస్తే అర్థం కాదు. అంటే ఓ లక్ష రూపాయల నెక్లెస్ కొనిచ్చినదానికన్నా.. ‘ఐ లవ్యూ’ అని చెప్తే ఎక్కువ ఆనందిస్తావ్. అలా చెప్పడం శంకర్‌కి రాదు. అంటే మీ ఇద్దరి భావ వ్యక్తీకరణ తీరు వేర్వేరు. అందుకే అతని ప్రేమ నీకు అర్థం కావట్లేదు.’’ ‘‘ఆ నిజమే. వాడు నాకు ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేస్తే వాడి కళ్లు మెరిసి పోతాయి. వెంటనే హగ్ చేసుకుంటాడు.’’ ‘‘అదీ అతని భావ వ్యక్తీకరణ తీరు. అదీ అతను ఐ లవ్యూ చెప్పే విధానం. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అతని ప్రేమ నీకు అర్థమవుతుంది.’’ ‘‘ఆ, అర్థమైంది వాడికి నేనంటే ఎంత ప్రేమో. థాంక్స్ రేఖా..’’ అంటూ ఆనందంగా వెళ్లిపోయింది మనీషా. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ప్రాణస్నేహం
ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు... కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా? స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి... అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు! స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి... కాయాన్ని మోయడానికి కాదు! స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి... నీటి కుండ పగలేయడానికి కాదు! స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి... చితికి మంట పెట్టడానికి కాదు! వృథా... వృథా... వృథా... స్నేహం వృథా... ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ! ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి. మీ స్నేహంలో దమ్ముంటే... స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి. ఆత్మీయ స్నేహితుల్లారా... ఆత్మహత్యల్ని ఆపండి. ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..? గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం. బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు... జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..? మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్‌లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు. మనసుపెట్టి గమనించండి ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్- 88888 17666, హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి ఇవీ... డేంజర్ సిగ్నల్స్ ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్... తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు. కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే వెళ్లి ఉంటే... రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్‌చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్‌కు బయల్దేరాం. రవళి బుక్స్‌ను ఆమె క్లాస్‌రూమ్‌లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్‌కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది. - ఎర్రబల్లి గంగాభవాని, రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు తెలుసుకోలేకపోయాం... మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది. - మాదమాల శ్రీలక్ష్మి, రాపూరు మండలం, పెనుబర్తి మంచి స్నేహితులు... మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు. - జి.గీతారెడ్డి, ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఊహించలేదు.. మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. - పి.శివబిందు, మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి (ఫైల్‌ఫొటో) -
హత్య చేసి ఆత్మహత్య అంటున్నారు
- సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి - మనీషా తల్లిదండ్రుల డిమాండ్ కడప అగ్రికల్చర్ : 'మా అమ్మాయి మనీషా ఆత్యహత్య చేసుకునేంత పిరికిది కాదు. నారాయణ కళాశాలలోనే చంపి ఉరివేసి యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరిస్తోంది. ఇప్పుడు విచారణ చేసిన కమిటీ వల్ల మాకు న్యాయం జరగదు. సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది' అని కడప నారాయణ కళాశాలలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని మనీషా త ల్లిదండ్రులు సరోజ, బాలకృష్ణారెడ్డి, ఇతర బంధువులు డిమాండ్ చేశారు. ఆదివారం క డప నగరంలోని సీపీఎం కార్యాలయ ఆవరణలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. . సంఘటన జరిగిన రోజే మధ్యాహ్న సమయంలో ఏమమ్మా..భోజనం చేశావా? అని మనీషాను ఫోన్ ద్వారా అడుగగా ఇంకా తినలేదని తినడానికి పోతున్నానని, తలనొప్పిగా ఉందని చెప్పిందని, తలనొప్పి మందు రాసుకోమని చెప్పామని వారన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని చెప్పారన్నారు. తాము వెంటనే అక్కడికి వెళ్లగా తమను కళాశాలలోకి రాన్వికుండా పోలీసులతో అడ్డగించారని చెప్పారు. ‘ఇక్కడ చనిపోయింది మా పాపే మేము చూడడానికి కూడా వీలులేదా’ అని అడిగితే అడుగడుగునా అడ్డగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు, కాళ్ల మీద కమిలిన గాయాలు ఉన్నాయని, ఉరి వేసుకుంటే దెబ్బలెలా తగిలాయో చెప్పాలని కోరారు. ఆ రోజు ఎలాంటి కాగితాలు దొరకనప్పుడు ఇప్పుడెలా ఆ కాగితాలు పుట్టుకొచ్చాయో అర్థం కావడంలేదన్నారు. ఉరివేసుకుంటే కనీసం ఫ్యాను రెక్కలు వంగిపోయి ఉండాలని, నాలుక బయటకు వచ్చి ఉండాలని పోలీసులే చెప్పారు. మరి అలా అక్కడలేదన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, ప్రిన్సిపాల్‌ను, వార్డెన్‌ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని వారు పోలీసు అధికారులను ప్రశ్నించారు. మాకు ఒక్క అవకాశం ఇస్తే పోలీసుల ఎదుట ప్రిన్సిపాల్‌ను, వార్డెన్‌ను మూడు ప్రశ్నలు అడుగుతామని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థినుల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాల విద్యార్థినులు మనీషా, నందినిల మృతి సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కడపలో ప్రదర్శన నిర్వహించారు. బాలికల జూనియర్ కళాశాల, న్యూ విక్రమ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద కాసేపు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జి.సుబ్బరాజు మాట్లాడుతూ నారాయణ కళాశాలలో జరిగిన ఘటన ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ హత్యేనన్నారు. అయితే, మంత్రి నారాయణ, కళాశాల యాజమాన్యం కలిసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కళాశాలలో జరిగిన ఈ ఘాతుకాన్ని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అంజలి, శిరీషా, అనూష, ఏబీవీపీ నాయకులు బాబూ రామ్మోహన్, శ్రీనివాసులు, సాయిప్రసాద్, శివారెడ్డి, షఫీ పాల్గొన్నారు. బీజేవైఎం నిరసన దీక్ష కడప నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న నందిని, మనీషాల మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ యువమోర్చా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మోర్చా జిల్లా కార్యదర్శి సాయిప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య, సిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మరణానికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. విద్యార్థుల కుటుంబాలను నారాయణ కళాశాల యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ర్యాంకులు సాధించాలంటూ ఒత్తిడి చేయడం తగదన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు దస్తగిరి, ప్రధాన కార్యదర్శి విజయ నరసింహులు, బీజేఎంఎం నాయకులు సుదర్శన్ రాయల్, రవికుమార్ పాల్గొన్నారు. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కడప నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడంపై ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఒత్తిడిని తట్టుకోలేక నందిని, మనీషా ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందుకు మంత్రి నారాయణను బాధ్యుడిని చేసి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనంద్, ఏబీవీపీ నగర కార్యదర్శి భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ కళాశాల ఎదట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కళాశాలలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ..ప్రైవేట్ కళాశాలల్లో మార్కుల కోసం విద్యార్థులను యంత్రాలుగా మార్చి మానసిక ప్రశాంతతను యాజమన్యాలు హరిస్తున్నాయని ఆరోపించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. సోమా ఆర్కేడ్లోని నారాయణ కళాశాల(గర్ల్స్) ఎదుట ఏబీవీపీ నగర కమిటీ అధ్యక్షుడు భరత్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారాయణనను అడ్డుపెట్టుకొని విద్యావ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కడప ఘటన లో ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఇంతవర కు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం దా రుణమన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కరువైందని, రిషితేశ్వరి ఘటన మ రువక ముందే నందని, మనిషా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదన కలిగిం చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు శివ, సుమన్, భరత్, సురేష్‌నాయక్, మహేష్, ప్రశాంత్, అంజి, భాస్కర్ పాల్గొన్నారు. నేడు విద్యాసంస్థల బంద్ కడప నారాయణ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన నందిని, మనిషా ఘటనకు నిరసనగా బుధవారం ఏబీవీపీ, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, పీడీఎస్‌యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
విద్యార్థి సంఘాల డిమాండ్ నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు కడప/కర్నూలు/అనంతపురం/తిరుచానూరు: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని నారాయణ జూనియర్ కళాశాలలో మనీషా, నందిని ఆత్మహత్య ఘటనలో మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పలు విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. కడపలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నారాయణను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల్ని నడుపుతున్న ప్రైవేటు కాలేజీల తీరుకు నిరసనగా ఈ నెల 19వ తేదీన ఏఐఎస్ఎఫ్ (అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్) పిలుపు నిచ్చిన విద్యా సంస్థల రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం ప్రకటించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం సహా గత ఏడాది కాలంలో నారాయణ సంస్థల్లో పదుల సంఖ్యలో సంభవించిన మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ సలాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల మరణాలకు ఎవరు కారకులో తేల్చాలని కోరారు. తాము బంద్‌కు మద్ధతిస్తున్నట్లు ప్రకటించారు. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
అధ్యాపకుల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ కడప అర్బన్/చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్న నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరం ఓం శాంతినగర్‌కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని(16), సిద్దవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా(16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన వీరుఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరారు. ఇదే క్యాంపస్‌లో హాస్టల్లో ఉంటూ 103వ గదిలో కలసి ఉంటున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ బ్రేక్ తరువాత హాస్టల్ గదిలోకి వెళ్లారు. కొంత సేపటి తర్వాత ఇతర విద్యార్థినులు వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించారు. కళాశాల సిబ్బంది వచ్చి చూసే సరికే మృతి చెందారు. మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని అధ్యాపకుల వేధించడంవల్లే మనీషా, నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారిని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం: కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యలకు యాజమాన్యం, అధ్యాపకుల వేధింపులే కారణమని మృతుల బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలలో ఫర్నీచర్, ద్వారం, కిటీకీల అద్దాలు ధ్వంసం చేశారు. -
'నా ఎదుటే మా అమ్మాయిపై దాడికి దిగాడు'
* నోట్స్ విషయంలో.. * విద్యార్థినికి ఫిట్స్.. ఆస్పత్రికి తరలింపు ఆత్మకూరు/ఎంజీఎం: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఒగ్లాపూర్‌లోని కేర్ ఫార్మసీ కళాశాల లో సోమవారం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కళాశాలలో ఖమ్మం జిల్లాకు చెందిన కాసర్ల వేదశ్రీ హన్మకొండలో తల్లితో ఉంటూ ఫార్మాడీ మూడో సంవత్సరం చదువుతోంది. మనీషా, దొంతి వంశీకృష్ణ కూడా నగరంలో ఉంటూ ఇదే కళాశాలలో చదువుతున్నారు. మూడురోజుల క్రితం వేదశ్రీ, మనీషాకు నోట్స్ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయంలో మనీషాకు వంశీకృష్ణ మద్దతు పలికి వేదశ్రీతో గొడవపడ్డాడు. ఈ విషయం పెద్దల వరకు చేరడంతో ఇరువర్గాల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చారు. వేదశ్రీ తల్లి, వంశీకృష్ణ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వేదశ్రీపై వంశీకృష్ణ చేయి చేసుకోవడంతో ఆమెకు ఫిట్స్ వచ్చి పడిపోయింది. దీంతో ఆమెను కళాశాల వాహనంలో ఎంజీఎంకు తరలించారు. నోట్స్ విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన విషయం వాస్తవమేనని కళాశాల ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. ఏసీపీ జనార్దన్‌రెడ్డి, సీఐ మదన్‌లాల్ వేదశ్రీ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అయితే, ఈ ఘటనపై వేదశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గొంతు నులిమి దాడికి పాల్పడ్డాడు... ‘మా అమ్మాయి వేదశ్రీని.. వంశీ అనే అబ్బాయి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కళాశాలకు వచ్చాం. వంశీకి మరో అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇందులో మా అమ్మాయిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా ఎదుటే మా అమ్మాయిపై వంశీ దాడికి దిగాడు. గొంతునులిమి తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగాడు. వెంటనే మా అమ్మాయిని ఎంజీఎంకు తీసుకువచ్చాం.’ అని వేదశ్రీ తల్లి విలేకరులకు తెలిపారు. -
"నిలువవే వాలు కనుల దానా" స్టిల్స్
-
లవ్లీ ఎంటర్టైనర్!
‘‘నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస నడకదానా...’’ అని అప్పట్లో ఏయన్నార్ నర్తించిన పాట ఇప్పుడు ఏకంగా టైటిల్‌గా మారింది. మెహెర్రాజా, మనీషా జంటగా అవతార్ మెహెర్‌బాబా క్రియేషన్స్ సంస్థ ఈ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శాంతి సూర్యమ్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ పాటలను ఆవిష్కరించారు. ‘‘అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ప్రేమకథ ఇది. కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. మెహెర్‌రాజ్ బాగా నటించారని కాదంబరి కిరణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయణ, అడిషనల్ ఏసీపీ వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘బరువు’ బాధ్యత
ఫొటోలోని చిన్నారి అమీషా (తెల్లచొక్కా) వయసు ఐదేళ్లు. బరువు 47 కిలోలు. మూడేళ్ల యోగిత (ఎర్రచొక్కా) బరువు 33కిలోలు. ఏడాది వయస్సున్న హర్ష బరువు 17కిలోలు. వీరు ముగ్గురూ పుట్టిన కొద్ది నెలల నుంచే విపరీతంగా బరువు పెరుగుతూనే ఉన్నారు. రైతు కూలీగా నెలకు ఐదారువేలకు మించి సంపాదనలేని తండ్రి రమేష్ నన్వాన్కు వీరి పోషణ భారమైంది. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని వాందీ గ్రామంలో ఈ కుటుంబం ఉంటోంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ఆ చిన్నారుల వైద్యఖర్చులు రాష్ట్ర సర్కారే భరిస్తుందని ప్రకటించారు. చిన్నారులను అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. -
అంత వైరాగ్యం లేదు..
ఇప్పుడే తనకు అంత వైరాగ్యం లేదని మనీషా కొయిరాలా చెబుతోంది. ఇటీవల సాధువులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనీషా కాషాయ వస్త్రాలతో కనిపించడంతో, సాధ్విగా మారే ఆలోచనలో ఉన్నారా అని ప్రశ్నిస్తే, ఆమె మీడియా ప్రతినిధులకు సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఇదివరకు కూడా పలు సందర్భాల్లో తాను కాషాయ వస్త్రాలు ధరించానని చెప్పింది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడమంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించడంతోనే సరిపోదని, అందుకు చాలా మనోబలం ఉండాలని వ్యాఖ్యానించింది. -
గ్లామర్‌తో సంచలనం సృష్టించాలి
పాపులారిటీ కోసం గ్లామర్‌ను ఆశ్రయించి సంచలనం సృష్టిస్తానంటోంది మరాఠి నటి మనీషా. వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో పలు అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ కూడా విజయం సాధించింది. మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో అందాలారబోతతో ప్రాచుర్యం పొందుతానంటోందీ బ్యూటీ. మనీషా మాట్లాడుతూ తాను బెంగళూరుకు చెందిన మరాఠీ అమ్మాయినని చెప్పింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్‌లోకి ప్రవేశిం చానంది. ఒక హోటల్లో భోజనానికి వెళ్లినప్పుడు అక్కడ వళక్కు ఎన్ 18/9 చిత్ర హీరోయిన్ అడిషన్ జరిగిందని చెప్పింది. ఆ చిత్ర సహాయ దర్శకుడు శివకుమార్ తనను చూసి చిత్రంలో నటిస్తారా? అని అడిగారని తెలిపింది. అలా తన సినీ తెరంగేట్రం జరిగిందని వివరిం చింది. డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో నటించి సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశని, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు మనీషా తెలిపింది. -
సురేష్ చేస్తున్న పదో ప్రయత్నం ‘ప్రేమించాలి!'
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని సురేష్ కొండేటి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్ తో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇందులో కొత్తవాళ్ళయిన సంతోష్, మనీషా జంటగా నటించగా, ఈ చిత్రానికి సమన్యరెడ్డి సహనిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కథా కథనాలు ప్రధాన బలం. . . ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. -
ప్రేమించాలి.. ప్రేమను పంచాలి
ప్రేమను పంచే తల్లిదండ్రులే... ప్రేమను పొందడానికి ప్రథమార్హులు అని తెలిపే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. సంతోష్, మనీషా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగించింది. ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి సురేష్ మాట్లాడుతూ- ‘‘పరిణతిలేని ప్రేమ ఓ జంట జీవితంతో ఎలా ఆడుకుంది? అనే అర్థవంతమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మా సంస్థలో వచ్చిన గత చిత్రాలకు మించే విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుంది. తమిళనాట విజయ్ ‘తలైవా’ చిత్రంతో పాటు విడుదలై 16 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. యువతరాన్ని విశేషంగా అలరించే విధంగా సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘సురేష్ కొండేటితో కలిసి నేను విడుదల చేసిన పిజ్జా, క్రేజీ, మహేష్ చిత్రాలు మంచి విజయాలుగా నిలిచాయి. మా కాంబినేషన్లో విడుదలవుతున్న ఈ నాల్గవ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుంది’’ అని సహనిర్మాత సమన్యరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: సూర్య వి.ఆర్, కూర్పు: ఆంటో