లవ్లీ ఎంటర్‌టైనర్! | Lovely entertainer! | Sakshi
Sakshi News home page

లవ్లీ ఎంటర్‌టైనర్!

Published Wed, Jun 10 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

లవ్లీ ఎంటర్‌టైనర్!

లవ్లీ ఎంటర్‌టైనర్!

‘‘నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస నడకదానా...’’ అని అప్పట్లో ఏయన్నార్ నర్తించిన పాట ఇప్పుడు ఏకంగా టైటిల్‌గా మారింది. మెహెర్‌రాజా, మనీషా జంటగా అవతార్ మెహెర్‌బాబా క్రియేషన్స్ సంస్థ ఈ  పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శాంతి సూర్యమ్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
 నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ పాటలను ఆవిష్కరించారు. ‘‘అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ప్రేమకథ ఇది. కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. మెహెర్‌రాజ్ బాగా నటించారని కాదంబరి కిరణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయణ, అడిషనల్ ఏసీపీ వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement