‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్‌లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్‌లైఫ్ వెబ్‌సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్‌ఆర్, ఎన్‌టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్‌పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్‌మేట్స్‌కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను.
రైటర్ టూ డైరెక్టర్..
తొలుత రచయితగా 3 వెబ్‌సిరీస్‌లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్‌లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్‌ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్‌లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి.
ఒక్క ఛాన్స్.. చాలు..
మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్...
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
Published Wed, Sep 11 2024 10:55 AM | Last Updated on Thu, Sep 12 2024 11:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment