
గ్లామర్‌తో సంచలనం సృష్టించాలి
పాపులారిటీ కోసం గ్లామర్‌ను ఆశ్రయించి సంచలనం సృష్టిస్తానంటోంది మరాఠి నటి మనీషా. వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో పలు అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ కూడా విజయం సాధించింది. మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో అందాలారబోతతో ప్రాచుర్యం పొందుతానంటోందీ బ్యూటీ. మనీషా మాట్లాడుతూ తాను బెంగళూరుకు చెందిన మరాఠీ అమ్మాయినని చెప్పింది.
డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్‌లోకి ప్రవేశిం చానంది. ఒక హోటల్‌లో భోజనానికి వెళ్లినప్పుడు అక్కడ వళక్కు ఎన్ 18/9 చిత్ర హీరోయిన్ అడిషన్ జరిగిందని చెప్పింది. ఆ చిత్ర సహాయ దర్శకుడు శివకుమార్ తనను చూసి చిత్రంలో నటిస్తారా? అని అడిగారని తెలిపింది. అలా తన సినీ తెరంగేట్రం జరిగిందని వివరిం చింది. డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో నటించి సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశని, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు మనీషా తెలిపింది.