నిఖత్, నీతూ (PC: BFI)
World Boxing Championship 2023- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిఫెండింగ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీఫైనల్ చేరితే ఈ నలుగురికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయా రు.
ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో పాట్రిసియా అల్వారెజ్ (మెక్సికో)పై, సుమయా కొసిమోవా (తజికిస్తాన్)పై నీతూ, నూర్ ఎలిఫ్ తుర్హాన్ (తుర్కియే)పై మనీషా, సమదోవా (తజికిస్తాన్)పై జాస్మిన్ గెలుపొందారు. శశి చోప్రా 0–4తో మాయ్ కిటో (జపాన్) చేతిలో, నవ్‌బఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో మంజు ఓడిపోయారు.
చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై!
SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు
Quarterfinals Ready 🔥💥
— Boxing Federation (@BFI_official) March 21, 2023
🇮🇳 champs acing it at the #WWCHDelhi
Tomorrow ⏳
Book your tickets now to not miss the action 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider pic.twitter.com/KeXDKSuC90
Comments
Please login to add a commentAdd a comment