మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2023లో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్ నిఖిత్ జరీన్ వియత్నాంకు చెందిన థామ్ గుయేన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖిత్ ఈ ఘనత సాధించింది.
తొలి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై పూర్తి అధిపత్యం చెలాయించిన నిఖిత్ రెండో సారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక రెండువ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖిత్ జరీన్ అరుదైన రికార్డు సాధించింది. ఒకటి కంటే ఎక్కవ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖిత్ జరీన్ నిలిచింది. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత బాక్సర్ మేరీకోమ్ తొలి స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment