Nitu Ghanghas
-
చరిత్ర సృష్టించిన నిఖిత్ జరీన్.. భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2023లో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్ నిఖిత్ జరీన్ వియత్నాంకు చెందిన థామ్ గుయేన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖిత్ ఈ ఘనత సాధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై పూర్తి అధిపత్యం చెలాయించిన నిఖిత్ రెండో సారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక రెండువ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖిత్ జరీన్ అరుదైన రికార్డు సాధించింది. ఒకటి కంటే ఎక్కవ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖిత్ జరీన్ నిలిచింది. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత బాక్సర్ మేరీకోమ్ తొలి స్థానంలో ఉంది. -
శభాష్ సావిటీ.. భారత్ ఖాతాలో మరో బంగారు పతకం
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. గతంలో సిల్వర్ మెడల్ తోనే సరిపెట్టుకున్న సావిటీ .. ఈ సారి మాత్రం పట్టుదలతో ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఫైనల్లో ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్‌లతో సావిటీ విరుచుకుపడింది. రెండో రౌండ్ లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక అంతకుముందు 48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్ అల్టాంట్సెట్సెగ్పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. 𝐒𝐄𝐂𝐎𝐍𝐃 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳 SAWEETY BOORA beat Lina Wang of China in the FINAL 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @saweetyboora @BFI_official @Media_SAI @kheloindia pic.twitter.com/TUHqBhfUvf — Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023 చదవండి: World Boxing Championships 2023: పసిడి పంచ్ విసిరిన నీతూ -
World Boxing Championships 2023: పసిడి పంచ్ విసిరిన నీతూ
న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 48 కేజీల విభాగం ఫైనల్ బౌట్లో నీతూ ఘంగాస్ మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్ అల్టాంట్సెట్సెగ్పై 5-0 తేడాతో విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. హర్యాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి వెలుగులోకి వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో తొలి బౌట్ నుంచి ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన నీతూ.. తొలి 3 బౌట్లను రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేడంతో (RSC) విజయం సాధించింది. సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై 5-2 తేడాతో విజయం సాధించిన ఘంగాస్. ఫైనల్లో మంగోలియా బాక్సర్‌ను మట్టికరిపించి పసిడి పట్టింది. కాగా, ఇవాళే జరిగే మరో పసిడి పోరులో సావీటీ బూరా (81 కేజీలు) కూడా తన అదష్టాన్ని పరీక్షించుకోనుండగా.. రేపు జరిగే మరో రెండు పసిడి పోరాటాల్లో లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) వేర్వేరు ప్రత్యర్ధులతో పోటీ పడనున్నారు. Nitu Ghanghas is a world champion! 🥇 The Indian defeated her Mongolian opponent on points by a unanimous decision in the final. #WWCHDelhi pic.twitter.com/kmFrWKcGUM — ESPN India (@ESPNIndia) March 25, 2023 #NituGhanghas🇮🇳 wins Gold🥇Medal in finals of 48 Kg; Beats Mangolian boxer Lutsaikhan by 5-0 at Women Boxing Championship.#WorldChampionships | #WWCHDelhi | #Boxing | #WBC2023 pic.twitter.com/LtmakpiD9o — All India Radio News (@airnewsalerts) March 25, 2023 -
ఫైనల్లో నీతూ, నిఖత్.. భారత్‌కు కనీసం 2 సిల్వర్ మెడల్స్ ఖాయం
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్‌కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. ఇవాళ (మార్చి 23) జరిగిన సెమీ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు), ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) ప్రత్యర్ధులపై విజయాలు సాధించి ఫైనల్‌కు చేరారు. నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయం సాధించగా, తెలంగాణ అమ్మాయి నిఖత్.. కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వెలెన్సియాను మట్టికరిపించింది. ఈ పోటీల్లో భారత్‌కు మరో 2 పతకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన క్వార్టర్స్‌లో లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) విజయాలు సాధించి కనీసం కాంస్యం పతాకన్ని ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8:15 గంటలకు జరిగే సెమీఫైనల్లో లవ్లీనా.. లీ కియాన్ (చైనా)ను, రాత్రి 8: 30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సావీటీ.. సూ ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు. ఈ బౌట్లలో వీరిరువురు విజయాలు సాధిస్తే, భారత్‌కు మరో 2 రజత పతకాలు ఖాయమవుతాయి. -
భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన నీతూ ఘంగాస్
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు) భారత్‌కు పతకం ఖరారు చేసింది. ఇవాళ (మార్చి 22) జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో జపాన్‌కు చెందిన మడోకా వాడాకు మట్టికరిపించిన నీతూ.. సెమీఫైనల్‌కు అర్హత సాధించి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. తొలి రౌండ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్ధిపై పంచ్‌ల వర్షం కురిపించడంతో రెండవ రౌండ్లో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి RSC (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూను విజేతగా ప్రకటించాడు. ఈ పోటీల్లో నీతూ RSC ద్వారానే మూడు బౌట్లలో విజయం సాధించడం విశేషం. మరోవైపు, ఇవాళ జరుగబోయే బౌట్లలో మరో ఏడుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా (60 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) (+81 కేజీలు) (+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. -
అమ్మాయిల పంచ్ అదిరింది.. క్వార్టర్ ఫైనల్లో నిఖత్, నీతూలతో పాటు..
World Boxing Championship 2023- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిఫెండింగ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీఫైనల్ చేరితే ఈ నలుగురికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయా రు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో పాట్రిసియా అల్వారెజ్ (మెక్సికో)పై, సుమయా కొసిమోవా (తజికిస్తాన్)పై నీతూ, నూర్ ఎలిఫ్ తుర్హాన్ (తుర్కియే)పై మనీషా, సమదోవా (తజికిస్తాన్)పై జాస్మిన్ గెలుపొందారు. శశి చోప్రా 0–4తో మాయ్ కిటో (జపాన్) చేతిలో, నవ్బఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో మంజు ఓడిపోయారు. చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు Quarterfinals Ready 🔥💥 🇮🇳 champs acing it at the #WWCHDelhi Tomorrow ⏳ Book your tickets now to not miss the action 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider pic.twitter.com/KeXDKSuC90 — Boxing Federation (@BFI_official) March 21, 2023 -
CWG 2022: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘పసిడి’ పంచ్‌తో..
CWG 2022- Boxer Nitu Ghanghas: బాక్సింగ్‌లో మన అమ్మాయిల పంచ్ కామన్వెల్త్ క్రీడల్లో గట్టిగా పడింది. తెలంగాణ నిఖత్ జరీన్‌తో పాటు హర్యాణ నీతు ఘణఘస్ కూడా స్వర్ణం సాధించింది. నిఖత్ వెనుక ఆమె తండ్రి ఎలా మద్దతుగా నిలిచాడో నీతు ఘంఘస్ వెనుక ఆమె తండ్రి జై భగవాన్ నిలిచాడు. హర్యాణ విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసే జై భగవాన్ ఉద్యోగానికి జీతం లేని సెలవు పెట్టి నీతు బాక్సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచాడు. అతని త్యాగం ఫలించింది. నీతు బంగారు పతకం సాధించింది. ఆదివారం కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన నీతు ఘణఘస్ అక్కడి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో అభిమానులు ‘భారత మాతాకీ జై’ అని ఉత్సాహంగా నినాదాలు ఇస్తుంటే తన మెడలోని బంగారు పతకాన్ని చూపుతూ ‘ఈ పతకం ఈ దేశ ప్రజలందరితో పాటు మా నాన్నకు అంకితం’ అని చెప్పింది. కామన్వెల్త్ క్రీడలలో 45– 48 కేజీల విభాగంలో నీతు ఘణఘస్ ఇంగ్లండ్ బాక్సర్ డెమీ జేడ్‌ను ఘోరంగా ఓడించింది. ఎంత గట్టిగా అంటే రెఫరీలందరూ ఆమెకు ఏకగ్రీవంగా 5–0తో గెలుపునిచ్చారు. ‘మా కోచ్ భాస్కర్ చంద్ర భట్ నాతో నీ ప్రత్యర్థి ఎత్తు తక్కువ ఉంది. ఎక్కువగా దాడి చేసే వీలు ఉంది. కాచుకోవడానికి పక్కకు జరుగుతూ దాడి చెయ్ అన్నారు. అదే పాటించాను’ అంది నీతు. ఇలాంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంది కాబట్టే ఇవాళ ఆమె విజేత అయ్యింది. తండ్రికీ, దేశానికీ గర్వకారణంగా నిలిచింది. అతని గెలుపుతో స్ఫూర్తి 2008లో బీజింగ్ ఒలిపింగ్స్లో బాక్సర్ విజేందర్ సింగ్ స్వర్ణం సాధించడంతో నీతు కల మొదలైంది. అప్పటికి ఆ అమ్మాయికి 8 ఏళ్లు. ఆమె ఊరు ధనానాకు విజేందర్ సింగ్ ఊరు సమీపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ విజేందర్ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో నీతు తాను కూడా బాక్సర్ కావాలని నిశ్చయించుకుంది. ముగ్గురు తోబుట్టువులలో ఒకరైన నీతు ఇంట్లోగాని స్కూల్లోగాని ఫైటింగుల్లో ముందు ఉంటుంది. ఆ దూకుడు గమనించిన తండ్రి జై భగవాన్ ఆమెను బాక్సర్‌ను చేయడానికి నిశ్చయించుకుని చండీగఢ్‌లోని కుటుంబాన్ని ధనానాకు మార్చాడు. తను ఉద్యోగం చేస్తూ కూతురిని అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘భివాని బాక్సింగ్ క్లబ్’కు శిక్షణ కోసం వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాడు. భివానిలోనే విజేందర్ సింగ్ బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. రెండేళ్లు గడిచిపోయాయి. కాని నీతు బాక్సింగ్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ‘నేను బాక్సింగ్ మానేస్తాను నాన్నా’ అని తండ్రికి చెప్పింది. కాని కూతురు అలా నిరాశలో కూరుకుపోవడం తండ్రికి నచ్చలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి చండీఘడ్‌లో విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం. మూడేళ్లు లీవ్ అడిగాడు కూతురి కోసం. అన్నేళ్లు ఎవరు ఇస్తారు. పైగా కూతురి బాక్సింగ్ కోసం అంటే నవ్వుతారు. కాని జై భగవాన్ లాస్ ఆఫ్ పే మీద వెళ్లిపోయాడు. సొంత ఊరు ధనానాకు చేరుకుని ఉదయం సాయంత్రం కూతురిని ట్రైనింగ్‌కు తీసుకెళ్లసాగాడు. జరుగుబాటుకు డబ్బులు లేవు. తండ్రి నుంచి వచ్చిన పొలంలో కొంత అమ్మేశాడు. ఎప్పుడో కొనుక్కున్న కారు అమ్మేశాడు. ఒక్కోసారి ట్రైనింగ్ కోసం ధనానా నుంచి భివానికి నీతు వెళ్లకపోయేది. ఇంట్లోనే సాధన చేయడానికి ఊక బస్తాను వేళ్లాడగట్టి ఉత్సాహపరిచేవాడు. ‘నువ్వు గొప్ప బాక్సర్వి కావాలి’ అనేవాడు. ‘నాన్నా... నేను మంచి బాక్సర్‌ని కాకపోతే నువ్వు ఉద్యోగంలో చేరిపో’ అని నీతు అనేది. ‘దాని గురించి ఆలోచించకు’ అని లక్ష్యంవైపు గురి నిలపమనేవాడు. విజయం వరించింది జై భగవాన్ అతని భార్య ముకేశ్ కుమారి కలిసి నీతు మీద పెట్టుకున్న ఆశలు ఫలించాయి. 2017, 2018 రెండు సంవత్సరాలు వరుసగా యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు ఛాంపియన్‌గా నిలిచింది. 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో దిగి గోల్డ్‌మెడల్ సాధించడంతో ఆమె ఘనత ఉన్నత స్థితికి చేరింది. గొప్ప విషయమేమంటే ఏ విధాన సభలో తండ్రి పని చేస్తాడో అదే విధాన సభ చైర్మన్ జ్ఞాన్‌చంద్ నీతు విజయం గురించి విని సంబరాలు జరపడం. నీతు తండ్రి జై భగవాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ‘మనమ్మాయి గొప్ప విజయం సాధించింది’ అన్నాడాయన జై భగవాన్‌తో నిజమే. ఇప్పుడు నీతు ‘మన అమ్మాయి’. మన భారతదేశ గర్వకారణం. చదవండి: CWG 2022: నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు