Nitu Ghangas confirms India's first medal at Women's Boxing World Championships - Sakshi
Sakshi News home page

Women’s Boxing World C’ships: భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన నీతూ ఘంగాస్‌

Published Wed, Mar 22 2023 4:42 PM | Last Updated on Wed, Mar 22 2023 5:36 PM

Nitu Ghanghas Assures India Of Its First Medal At Womens Boxing World Championships - Sakshi

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు) భారత్‌కు పతకం ఖరారు చేసింది. ఇవాళ (మార్చి 22) జరిగిన క్వార్టర్‌ ఫైనల్ బౌట్‌లో జపాన్‌కు చెందిన మడోకా వాడాకు మట్టికరిపించిన నీతూ.. సెమీఫైనల్‌కు అర్హత సాధించి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది.

తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్ధిపై పంచ్‌ల వర్షం కురిపించడంతో రెండవ రౌండ్‌లో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి RSC (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూను విజేతగా ప్రకటించాడు. ఈ పోటీల్లో నీతూ RSC ద్వారానే మూడు బౌట్‌లలో విజయం సాధించడం విశేషం.

మరోవైపు, ఇవాళ జరుగబోయే బౌట్‌లలో మరో ఏడుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుత వరల్డ్‌ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా (60 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) (+81 కేజీలు) (+81 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement