శభాష్‌ సావిటీ.. భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం | Saweety Boora beats Chinas Wang Lina to help India bag second gold at WBC | Sakshi
Sakshi News home page

World Boxing Championships 2023: శభాష్‌ సావిటీ.. భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం

Mar 25 2023 8:59 PM | Updated on Mar 25 2023 9:35 PM

Saweety Boora beats Chinas Wang Lina to help India bag second gold at WBC  - Sakshi

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌-2023లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్‌ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. గతంలో సిల్వర్ మెడల్ తోనే సరిపెట్టుకున్న సావిటీ .. ఈ సారి మాత్రం పట్టుదలతో ఛాంపియన్‌గా నిలిచింది.

ఇక ఫైనల్లో  ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్లతో సావిటీ విరుచుకుపడింది. రెండో రౌండ్ లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక అంతకుముందు 48 కేజీల విభాగంలో  నీతూ ఘంగాస్ భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్‌ అల్‌టాంట్‌సెట్‌సెగ్‌పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది.


చదవండి: World Boxing Championships 2023: పసిడి పంచ్‌ విసిరిన నీతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement