World Boxing Championships
-
భారత బాక్సర్లకు మూడు రజతాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత బాక్సర్లు హార్దిక్ (80 కేజీలు), అమిశా (54 కేజీలు), ప్రాచీ (80 ప్లస్ కేజీలు) రజత పతకాలు నెగ్గారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌లో హార్దిక్ 2–3తో అశురోవ్ (రష్యా) చేతిలో, అమిశా 0–5తో అయాజాన్ (కజకిస్తాన్) చేతిలో, ప్రాచి 0–5తో షఖోబిద్దినొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మరో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్లో పోటీపడనున్నారు. -
సెమీస్‌లో పోరాడి ఓడిన దీపక్, నిశాంత్.. కాంస్యాలతో ముగింపు
తాషెకంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ మూడు కాంస్య పతకాలతో ముగించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. శుక్రవారం జరిగిన మూడు సెమీఫైనల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ శక్తినంతా ధారపోసి పోరాడినా ఫలితం లేకపోగా... మోకాలి గాయం కారణంగా తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) జట్టు వైద్య బృందం సలహా మేరకు రింగ్‌లోకి దిగకుండానే ప్రత్యర్దికి ‘వాకోవర్’ ఇచ్చాడు. గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన ఫ్రాన్స్ బాక్సర్ బిలాల్ బెనామాతో జరిగిన సెమీఫైనల్లో దీపక్ 3–4తో ఓడిపోయాడు. మూడు రౌండ్లలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దీపక్ పంచ్‌ల ధాటికి ఒకసారి రిఫరీ బెనామాకు కౌంట్‌బ్యాక్ ఇచ్చారు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో నిర్ణీత మూడు రౌండ్ల తర్వాత రిఫరీలు బౌట్‌ను సమీక్షించి చివరకు బెనామా పైచేయి సాధించినట్లు తేల్చారు. ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షిమ్‌బెర్జనోవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో నిశాంత్ దేవ్ 2–5తో ఓటమి చవిచూశాడు. అస్లాన్‌బెక్‌పై నిశాంత్ లెఫ్ట్, రైట్ క్రాస్ పంచ్‌లతో విరుచుకుపడినా వీటిలో కచ్చితత్వం లేకపోవడంతో చివరకు కజకిస్తాన్ బాక్సర్దే పైచేయి అయింది. సైడెల్ హోర్టా (క్యూబా)తో తలపడాల్సిన నిజామాబాద్ బాక్సర్ హుసాముద్దీన్ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేకపోయాడు. దియాజ్ ఇబనెజ్ (బల్గేరియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో హుసాముద్దీన్ మోకాలికి గాయమైంది. త్వరలోనే ఆసియా క్రీడలు ఉండటం... ఈ క్రీడలు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత టోరీ్నగా కూడా ఉండటంతో భారత బాక్సింగ్ వైద్య బృందం హుసాముద్దీన్ గాయం తీవ్రత పెరగకూడదనే ఉద్దేశంతో బరిలో దిగవద్దని సలహా ఇచి్చంది. దాంతో హుసాముద్దీన్ రింగ్‌లోకి దిగలేదు. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య 10. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు. విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ కుమార్ (2021), హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్ (2023) కాంస్య పతకాలు గెలిచారు. -
World Boxing Championships: ప్రిక్వార్టర్స్‌లో సచిన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సచిన్ సివాచ్ (54 కేజీలు) శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... నవీన్ కుమార్ (92 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. తొలి రౌండ్ బౌట్లో ప్రపంచ మాజీ యూత్ చాంపియన్ సచిన్ 5–0తో సెర్గీ నొవాక్ (మాల్డొవా)పై గెలుపొందగా... నవీన్ 0–5తో రేయస్ (స్పెయిన్) చేతిలో... గోవింద్ 0–5తో అల్ఖావెర్దోవి సాఖిల్ (జార్జియా) చేతిలో ఓడిపోయారు. -
Boxing World Championships: దీపక్ సంచలనం.. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో సావిన్ ఎడువార్డ్ (రష్యా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన దీపక్ (51 కేజీలు) సంచలన విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో దీపక్ 5–2తో 2021 ప్రపంచ చాంపియన్ బిబోసినోవ్ (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించాడు. 75 కేజీల విభాగం రెండో రౌండ్లో సుమిత్ కుందు 1–3తో సోసులిన్ పావెల్ (రష్యా) చేతిలో... ప్లస్ 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో నరేందర్ 0–5తో అర్జోలా అలెజాంద్రో (క్యూబా) చేతిలో ఓడిపోయారు. -
World Boxing Championships 2023: క్వార్టర్స్‌లో ఆకాశ్, నిశాంత్
తాష్కెంట్: పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆకాశ్ సాంగ్వాన్, నిశాంత్ దేవ్ ముందంజ వేశారు. 67 కేజీల విభాగంలో ఆకాశ్ 5–0తో ఫు మింగ్కే (చైనా)పై... 71 కేజీల విభాగంలో నిశాంత్ 5–0తో లీ సంగ్మిన్ (కొరియా)పై ఘన విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తర్వాతి మ్యాచ్‌లలో దులాత్ బెక్బావ్ (కజకిస్తాన్)తో ఆకాశ్... ఫొఖాహా నిదాల్ (పాలస్తీనా)తో తలపడతారు. -
World Boxing Championships: నరేందర్ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), గోవింద్ సహాని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపక్ కుమార్ (51 కేజీలు) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అయితే స్టార్ బాక్సర్ శివ థాపా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. తొలి రౌండ్ బౌట్లలో నరేందర్ 4–1తో మొహమ్మద్ అబ్రోరిదినోవ్ (తజికిస్తాన్)పై, గోవింద్ 5–0తో మెహ్రోన్ షఫియెవ్ (తజికిస్తాన్)పై, దీపక్ 5–0తో లూయిస్ డెల్గాడో (ఈక్వెడోర్)పై విజయం సాధించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన శివ థాపా ఈసారి మాత్రం నిరాశపరిచాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన శివ థాపా 3–4తో డోస్ రెస్ యురీ (బ్రెజిల్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో భారత బాక్సర్లు హుసాముద్దీన్ (57 కేజీలు), ఆశిష్ చౌధరీ (80 కేజీలు), నవీన్ (92 కేజీలు) పోటీపడతారు. -
చరిత్ర సృష్టించిన నిఖిత్ జరీన్.. భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2023లో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్ నిఖిత్ జరీన్ వియత్నాంకు చెందిన థామ్ గుయేన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖిత్ ఈ ఘనత సాధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై పూర్తి అధిపత్యం చెలాయించిన నిఖిత్ రెండో సారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక రెండువ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖిత్ జరీన్ అరుదైన రికార్డు సాధించింది. ఒకటి కంటే ఎక్కవ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖిత్ జరీన్ నిలిచింది. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత బాక్సర్ మేరీకోమ్ తొలి స్థానంలో ఉంది. -
శభాష్ సావిటీ.. భారత్ ఖాతాలో మరో బంగారు పతకం
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. గతంలో సిల్వర్ మెడల్ తోనే సరిపెట్టుకున్న సావిటీ .. ఈ సారి మాత్రం పట్టుదలతో ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఫైనల్లో ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్‌లతో సావిటీ విరుచుకుపడింది. రెండో రౌండ్ లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక అంతకుముందు 48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్ అల్టాంట్సెట్సెగ్పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. 𝐒𝐄𝐂𝐎𝐍𝐃 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳 SAWEETY BOORA beat Lina Wang of China in the FINAL 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @saweetyboora @BFI_official @Media_SAI @kheloindia pic.twitter.com/TUHqBhfUvf — Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023 చదవండి: World Boxing Championships 2023: పసిడి పంచ్ విసిరిన నీతూ -
World Boxing Championships 2023: పసిడి పంచ్ విసిరిన నీతూ
న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 48 కేజీల విభాగం ఫైనల్ బౌట్లో నీతూ ఘంగాస్ మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్ అల్టాంట్సెట్సెగ్పై 5-0 తేడాతో విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. హర్యాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి వెలుగులోకి వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో తొలి బౌట్ నుంచి ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన నీతూ.. తొలి 3 బౌట్లను రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేడంతో (RSC) విజయం సాధించింది. సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై 5-2 తేడాతో విజయం సాధించిన ఘంగాస్. ఫైనల్లో మంగోలియా బాక్సర్‌ను మట్టికరిపించి పసిడి పట్టింది. కాగా, ఇవాళే జరిగే మరో పసిడి పోరులో సావీటీ బూరా (81 కేజీలు) కూడా తన అదష్టాన్ని పరీక్షించుకోనుండగా.. రేపు జరిగే మరో రెండు పసిడి పోరాటాల్లో లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) వేర్వేరు ప్రత్యర్ధులతో పోటీ పడనున్నారు. Nitu Ghanghas is a world champion! 🥇 The Indian defeated her Mongolian opponent on points by a unanimous decision in the final. #WWCHDelhi pic.twitter.com/kmFrWKcGUM — ESPN India (@ESPNIndia) March 25, 2023 #NituGhanghas🇮🇳 wins Gold🥇Medal in finals of 48 Kg; Beats Mangolian boxer Lutsaikhan by 5-0 at Women Boxing Championship.#WorldChampionships | #WWCHDelhi | #Boxing | #WBC2023 pic.twitter.com/LtmakpiD9o — All India Radio News (@airnewsalerts) March 25, 2023 -
World Boxing Championships 2023: ‘పంచ్’ సమరానికి వేళాయే..
న్యూఢిల్లీ: మూడోసారి ప్రపంచ మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది. న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు సాయంత్రం జరిగే ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. గురువారం నుంచి బౌట్లు మొదలవుతాయి. 23న సెమీఫైనల్స్ జరుగుతాయి. 24న విశ్రాంతి దినం. 25, 26వ తేదీల్లో జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది. గతంలో 2006, 2018లలో భారత్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిచి్చంది. మూడోసారీ న్యూఢిల్లీ వేదికగానే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తుండటం విశేషం. మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో (48 కేజీలు, 50, 52, 54, 57, 60, 63, 66, 70, 75, 81, ప్లస్ 81 కేజీలు) బౌట్లు ఉంటాయి. 65 దేశాల నుంచి 300కుపైగా బాక్సర్లు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు. పతక విజేతలకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. స్వర్ణ పతక విజేతకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షలు)... రజత పతక విజేతకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), కాంస్య పతక విజేతలకు (ఇద్దరికి) 25 వేల డాలర్ల (రూ. 20 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం (నిఖత్ జరీన్), రెండు కాంస్య పతకాలు (మనీషా మౌన్, పర్వీన్ హుడా) సాధించింది. భారత బాక్సింగ్ జట్టు: నీతూ ఘణ్‌ఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనామాచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు), నుపుర్ షెరాన్ (ప్లస్ 81 కేజీలు). -
భారత బాక్సర్లకు మరో నాలుగు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాలపైనే పంచ్ విసురుతున్నారు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో నలుగురు మహిళా బాక్సర్లు ముస్కాన్ (75 కేజీలు), తమన్నా (50 కేజీలు), కీర్తి (ప్లస్ 81 కేజీలు), దేవిక (52 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తమన్నా 5–0తో జుని తొనెగవా (జపాన్)పై, దేవిక 5–0తో అస్యా (జర్మనీ)పై... అజింబై (మంగోలియా)పై ముస్కా న్, బొటికా (రొమేనియా)పై కీర్తి గెలిచారు. చదవండి: భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి! అద్భుతాలు చేస్తాడు -
జరీన్‌కు టీపీసీసీ రూ.5 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు టీపీసీసీ నగదు బహుమానం ప్రకటించింది. జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి ఇస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్లో ప్రకటించారు. -
Boxing World Championships: నిఖత్ జరీన్ పంచ్ అదిరెన్..
ఇస్తాంబుల్: తన పంచ్ పవర్ చాటుకుంటూ భారత బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ తెలంగాణ బాక్సర్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ 5–0తో చార్లీ సియాన్ డేవిసన్ (ఇంగ్లండ్)పై ఘనవిజయం సాధించింది. నిఖత్‌తోపాటు మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించి భారత్‌కు పతకాలను ఖరారు చేశారు. క్వార్టర్ ఫైనల్లో మనీషా 4–1తో నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై, పర్వీన్ 5–0తో షోయిరా జుల్కనరోవా (తజికిస్తాన్)పై విజయం సాధించారు. మరోవైపు భారత్‌కే చెందిన నీతూ (48 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), అనామిక (50 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), నందిని (ప్లస్ 81 కేజీలు) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో నీతూ 2–3తో అలు బల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో... పూజా 2–3తో జెస్సికా బాగ్లే (ఆస్ట్రేలియా) చేతిలో... అనా మిక 0–5తో ఇంగ్రిట్ లొరెనా (కొలంబియా) చేతిలో... జాస్మిన్ 1–4తో షకీలా రషీదా (అమెరికా) చేతిలో... నందిని 0–5తో ఖైజా మర్దీ (మొరాకో) చేతిలో ఓడిపోయారు. -
లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం చేసింది. టర్కీలో సోమవారం జరిగిన 70 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో లవ్లీనా 3–2తో చెన్ నియెన్ చిన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే 48 కేజీల విభాగం తొలి రౌండ్లో స్టెలుటా దుతా (రొమేనియా)తో భారత బాక్సర్ నీతూ తలపడుతుంది. -
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించిన తెలంగాణ అమ్మాయి
Nikhat Zareen Into World Boxing Championships: ఇటీవల జరిగిన స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం సాధించి జోరు మీదున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. మే 6న ఇస్తాంబుల్ వేదికగా ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో జరీన్ 52 కేజీల విభాగంలో బరిలో దిగనుంది. సెలక్షన్ ట్రయల్స్‌లో జరీన్ 7-0తో మీనాక్షిను(హరియాణా) చిత్తుచేసి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గొహైన్ కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో (70 కేజీల విభాగం) పోటీపడేందుకు అర్హత సాధించింది. ట్రయల్స్‌లో అరుంధతిని ఓడించిన లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ తర్వాత పోటీపడే తొలి టోర్నీ ఇదే. ఈ ఈవెంట్‌కు నిఖత్ జరీన్, లవ్లీనాతో పాటు నీతు, అనామికా, శిక్ష, మనీశ, జాస్మైన్, పర్వీన్, అంక్షిత బొరో, సవిటీ బూర, పూజ రాణి, నందిని కూడా అర్హత సాధించారు. వాస్తవానికి వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలు గతేడాది డిసెంబర్లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. చదవండి: పీవీ సింధుకు ఘోర పరాభవం.. -
సరితా దేవికి చుక్కెదురు
ఉలాన్–ఉదె (రష్యా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ విశ్వవిజేత సరితా దేవికి ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన 60 కేజీల విభాగం రెండో రౌండ్ బౌట్లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 0–5తో రష్యా బాక్సర్ నటాలియా షాద్రినా చేతిలో ఓడిపోయింది. 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ నందిని 0–5తో ఇరీనా (జర్మనీ) చేతిలో ఓడింది. -
అదరగొట్టిన భారత బాక్సర్లు!
న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన ఐదు విభాగాల బౌట్లకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు విజయాలు సాధించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (48 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 2006 చాంపియన్ లైష్రామ్ సరితా దేవి (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. మరో బౌట్లో గెలిచి సెమీస్ చేరుకుంటే మేరీకోమ్, మనీషా, లవ్లీనా, భాగ్యవతిలకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. రికార్డుస్థాయిలో ఆరో స్వర్ణంపై గురి పెట్టిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఈ మెగా ఈవెంట్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగిన ఈ మణిపూర్ బాక్సర్ 5–0తో ఐజెరిమ్ కెసెనయేవా (కజకిస్తాన్)ను ఓడించింది. తొలి రౌండ్లో ఆచితూచి ఆడిన మేరీకోమ్ రెండో రౌండ్లో అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌లు విసిరింది. బౌట్‌ను పర్యవేక్షించిన నలుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 30–27 పాయింట్లు ఇవ్వగా... మరోజడ్జి 29–28 పాయింట్లు ఇచ్చారు. ‘తొలి బౌట్ కఠినంగానే సాగింది. టోర్నీలో మొదటి బౌట్ కావడంతో ఒత్తిడితో పాల్గొన్నా. అయితే గత 16 ఏళ్లుగా నా అభిమానుల నుంచి ఈ రకమైన ఒత్తిడిని విజయవంతంగా అధిగమిస్తూ వస్తున్నా. ఈ తరహా ఒత్తిడంటే నాకు ఇష్టమే’ అని 35 ఏళ్ల మేరీకోమ్ వ్యాఖ్యానించింది. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా బాక్సర్ వు యుతో మేరీకోమ్ తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా మౌన్ మరో సంచలనం నమోదు చేసింది. 54 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ దీనా జాలమన్ (కజకిస్తాన్)తో జరిగిన బౌట్లో మనీషా 5–0తో గెలుపొందింది. ఈ ఏడాది దీనాపై మనీషాకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. పోలాండ్‌లో ఇటీవలే జరిగిన సిలెసియాన్ టోర్నీలోనూ మనీషా చేతిలో దీనా ఓడిపోయింది. ‘ఒకసారి రింగ్‌లో అడుగుపెడితే నా ప్రత్యర్థి ప్రపంచ చాంపియనా? రజత పతక విజేతా? లాంటి విషయాలు అస్సలు పట్టించుకోను. ( భాగ్యవతి ,లవ్లీనా,మనీషా,సరితా దేవి ) క్వార్టర్ ఫైనల్లో్లనూ దూకుడుగానే ఆడతా’ అని మనీషా వ్యాఖ్యానించింది. ఇతర బౌట్లలో లవ్లీనా 5–0తో 2014 ప్రపంచ చాంపియన్ అథెనా బైలాన్ (పనామా)పై... భాగ్యవతి 4–1తో నికొలెటా షోన్బర్గర్ (జర్మనీ)పై గెలుపొందారు. మరో బౌట్లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 2–3తో కెలీ హారింగ్టన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఫలితంపై సరితా దేవి అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం చలాయించాను. కానీ జడ్జిల నిర్ణయంతో నిరాశ చెందాను. అయితే వారి నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. 2014 ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న వివాదం కారణంగా నాపై ఏడాదిపాటు నిషేధం విధించారు. జడ్జిలను విమర్శించి మరోసారి వివాదంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’ అని 36 ఏళ్ల సరితా దేవి వ్యాఖ్యానించింది. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టోకా పెట్రోవా (బల్గేరియా)తో మనీషా; స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా; పాలో జెస్సికా (కొలంబియా)తో భాగ్యవతి తలపడతారు. -
పతకానికి విజయం దూరంలో...
♦ క్వార్టర్ ఫైనల్లో అమిత్, గౌరవ్ ♦ వికాస్, సుమీత్‌లకు చుక్కెదురు హాంబర్గ్ (జర్మనీ): ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అమిత్ ఫంగల్(49 కేజీలు), గౌరవ్ బిధురి(56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... వికాస్ కృషన్(75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్(91 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), శివ థాపా(60 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఏడో సీడ్ కార్లోస్ కిపో (ఈక్వెడార్)తో జరిగిన బౌట్లో అమిత్ 5–0తో సంచలన విజయం సాధించగా... గౌరవ్ 4–1తో మికోలా బుత్సెంకో (ఉక్రెయిన్)ను ఓడించాడు. మరో విజయం సాధిస్తే అమిత్, గౌరవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత వికాస్ 0–5తో విటేకర్ (ఇంగ్లండ్) చేతిలో, సుమీత్ 2–3తో జాసన్ వాటెలె (ఆస్ట్రేలియా) చేతిలో, మనోజ్ కుమార్ 1–4తో గాబ్రియెల్ పెరెజ్(వెనిజులా) చేతిలో ఓడిపోయారు. ఒటార్ ఎరానోసియాన్(జార్జియా)తో తలపడా ల్సిన శివ థాపా తీవ్ర జ్వరం కారణంగా బరిలోకి దిగకుండానే తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు.