ఇస్తాంబుల్: తన పంచ్ పవర్ చాటుకుంటూ భారత బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ తెలంగాణ బాక్సర్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ 5–0తో చార్లీ సియాన్ డేవిసన్ (ఇంగ్లండ్)పై ఘనవిజయం సాధించింది. నిఖత్‌తోపాటు మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించి భారత్‌కు పతకాలను ఖరారు చేశారు.
క్వార్టర్ ఫైనల్లో మనీషా 4–1తో నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై, పర్వీన్ 5–0తో షోయిరా జుల్కనరోవా (తజికిస్తాన్)పై విజయం సాధించారు. మరోవైపు భారత్‌కే చెందిన నీతూ (48 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), అనామిక (50 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), నందిని (ప్లస్ 81 కేజీలు) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో నీతూ 2–3తో అలు బల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో... పూజా 2–3తో జెస్సికా బాగ్లే (ఆస్ట్రేలియా) చేతిలో... అనా మిక 0–5తో ఇంగ్రిట్ లొరెనా (కొలంబియా) చేతిలో... జాస్మిన్ 1–4తో షకీలా రషీదా (అమెరికా) చేతిలో... నందిని 0–5తో ఖైజా మర్దీ (మొరాకో) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment