
Nikhat Zareen Into World Boxing Championships: ఇటీవల జరిగిన స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం సాధించి జోరు మీదున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. మే 6న ఇస్తాంబుల్ వేదికగా ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో జరీన్ 52 కేజీల విభాగంలో బరిలో దిగనుంది. సెలక్షన్ ట్రయల్స్‌లో జరీన్ 7-0తో మీనాక్షిను(హరియాణా) చిత్తుచేసి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గొహైన్ కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో (70 కేజీల విభాగం) పోటీపడేందుకు అర్హత సాధించింది. ట్రయల్స్‌లో అరుంధతిని ఓడించిన లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ తర్వాత పోటీపడే తొలి టోర్నీ ఇదే. ఈ ఈవెంట్‌కు నిఖత్ జరీన్, లవ్లీనాతో పాటు నీతు, అనామికా, శిక్ష, మనీశ, జాస్మైన్, పర్వీన్, అంక్షిత బొరో, సవిటీ బూర, పూజ రాణి, నందిని కూడా అర్హత సాధించారు. వాస్తవానికి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ పోటీలు గతేడాది డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి.
చదవండి: పీవీ సింధుకు ఘోర పరాభవం..