Nikhat Zareen (Photo: BFI/ Twitter)
Nikhat Zareen- World Boxing Championship: ‘‘రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగాఉంది. అందులోనూ ఒలింపిక్ కేటగిరీలో స్వర్ణం గెలవడం ఇంకా సంతృప్తినిచ్చింది. టోర్నీలో సహజంగానే నా దృష్టిలో ఇదే కఠినమైన బౌట్. ఆమె ఆసియా చాంపియన్. హోరాహోరీగా తలపడ్డాం.
కామన్వెల్త్ క్రీడల్లో నేను పెద్దగా పోటీని ఎదుర్కోలేదు. ఈ తర్వాత ఇక్కడే మళ్లీ బరిలోకి దిగాను. కానీ ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో వరుస బౌట్‌లలో తలపడాల్సి వచ్చింది. అందుకే కొన్నిసార్లు నేను వేగంగా కదల్లేకపోయాను. ఫైనల్లో మాత్రం చివరి బౌట్ కాబట్టి పూర్తి శక్తిసామర్థ్యాలు వాడాలని నిశ్చయించుకున్నా. వంద శాతంకంటే ఎక్కువ ప్రయత్నించా.
గత ఏడాది పతకంతో పోలిస్తే ఇది ఎక్కువ శ్రమతో వచ్చింది. దీని కోసం బరువు తగ్గించుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సన్నాహానికి సమయం తక్కువగా ఉన్నా పూర్తి ఏకాగ్రతతో సాధన చేశా. ఉత్తమ బాక్సర్‌గా మహీంద్రా థార్ వాహనం బహుమతిగా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి నాకు వచ్చిన ప్రైజ్‌మనీతో అమ్మా, నాన్నను హజ్ యాత్రకు పంపిస్తా’’ అని భారత బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది.
బెస్ట్ బాక్సర్‌గా
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) మరోసారి చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాం బాక్సర్ థి టామ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అంతేకాకుండా టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది.
ఈ క్రమంలో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ విజయం అనంతరం ఈ మేరకు స్పందించింది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా తాను ఇక్కడిదాకా చేరుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్రను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్.. ఈ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు పేర్కొంది.
చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు
SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
2️⃣x World Champion 🇮🇳 @nikhat_zareen ’s reaction right after scripting history 🥳🔥@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @MahindraRise @NehaAnandBrahma https://t.co/29Wd7lBDfx pic.twitter.com/kLcmJzLdcw
— Boxing Federation (@BFI_official) March 26, 2023
Comments
Please login to add a commentAdd a comment