ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన 'నిఖత్ జరీన్' (Nikhat Zareen)పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ ఎన్‌గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిష్ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం విశేషం. ఇప్పటికే ఈమె 2022లో 52కేజీల విభాగంలో మొదటిసారి వరల్డ్ చాంపియన్‌గా మారింది. అయితే ఇప్పుడు పొందిన విజయంతో ఈమె ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును కూడా గెలుచుకుంది.
భారత క్రీడా చరిత్రలో ఎదురులేకుండా నిలిచి కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిఖత్ జరీన్‌ను ప్రశంసిస్తూ కంపెనీ థార్ SUV గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది.
(ఇదీ చదవండి: ఎమ్‌ఆర్‌పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి)
మహీంద్రా థార్ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ కార్లలో ఇది ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి పర్ఫామెన్స్ విషయంలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు డీజిల్ ఇంజిన్స్, ఒక పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment