![Nikhat Zareen receives rousing welcome in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/2/boxing.jpg.webp?itok=KegD46jP)
శంషాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ గెలుచుకున్న నిఖత్ జరీన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నిఖత్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చాంపియన్‌న్‌షిప్ సాధించిన నిఖత్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు.
అనంతరం ఓపెన్‌టాప్ జీప్‌లో ఆమెతో పాటు ప్రయాణించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నిఖత్‌కు స్వాగతం పలికిన వారిలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment