
Women's World Boxing Championship- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు నమోదు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ రెండో రౌండ్ బౌట్‌లో 5–0తో ఆఫ్రికా చాంపియన్ బూఆలమ్ రుమేసా (అల్జీరియా)ను ఓడించగా... మనీషా 5–0తో రహీమి టీనా (ఆస్ట్రేలియా)పై గెలిచింది.
చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం