women boxers
-
మనవాళ్ళు బంగారం
ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ మహిళా బాక్సింగ్ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు. మొత్తం నలుగురూ తమ బాక్సింగ్ పంచ్‌లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్ వారసులుగా బాక్సింగ్‌లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్‌కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్‌లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్‌కు చేరిన మహిళలు 24 మంది. వారిలో భారత మహిళా బాక్సింగ్ చతుష్టయం సత్తా చాటింది. భారత్‌తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్‌కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 పతకాలు సాధించిన భారత్ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్ టైటిల్ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్ ఛాంపియన్ అయిన వియత్నామ్‌కు చెందిన ప్రత్యర్థి నూయెన్ తీ తామ్‌పై ఫైనల్లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు. మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్లో రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్ పార్కర్‌పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్ మెలకువల్లో ఆరితేరిన నిఖత్ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్ వెయిట్ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు. 2018లో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లో ‘ఖేల్ మహాకుంభ్’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్‌లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్ మహాకుంభ్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది. మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్‌గా నిఖత్ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు. ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్ మేరీ కోమ్ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్‌ను భారత్‌కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! -
అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
మే 19, 2022... నిఖత్ జరీన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న గుర్తింపు వేరు. ఒకసారి యూత్ వరల్డ్ చాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచినా సరే, సీనియర్ స్థాయికి వచ్చేసరికి కనుమరుగైన వారి జాబితాలో ఆమె కూడా చేరుతుందని చాలా మంది అనుకున్నారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు మరో ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించినా నిఖత్‌పై ఎక్కువగా అంచనాలు లేవు. ఆమె ప్రదర్శనపై కూడా ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అని, మున్ముందు గొప్ప విజయాలు సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అందుకు కారణం అప్పటికే ఉత్తరాది, ముఖ్యంగా హరియాణా బాక్సర్లతోనే భారత బృందం నిండి ఉంది. ఆటా వారిదే, ఫలితాలు వారి నుంచే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా మేరీకోమ్‌తో పోటీ పడేందుకు సిద్ధపడి అదేదో తప్పు చేసినట్లుగా తన ప్రమేయం లేకుండానే చాలా మంది దృష్టిలో నిఖత్ జరీన్ విలన్‌గా మారిపోయింది. కానీ... కానీ... ఒక్క అద్భుత ప్రదర్శన అంతా మార్చేసింది... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో నిఖత్ సత్తా అందరికీ అర్థమైంది. నిఖత్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది. భారత్ నుంచి విశ్వ వేదికపై నిలబడగల అథ్లెట్ల జాబితాలో ఆమె కూడా చేరింది. అసలు కర్తవ్యంపైనే దృష్టి... గత వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం నుంచి నిఖత్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఎందుకంటే అగ్రశ్రేణి ఆటగాళ్లు విజయాలు సాధించడం మాత్రమే కాదు, వాటిని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గొప్ప ఘనతల తర్వాత వచ్చే కీర్తి కనకాదులు, ప్రచారాలు ప్లేయర్లను ఒక్కసారిగా ఆటకు దూరం చేసిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. సరిగ్గా ఈ విషయంలోనే నిఖత్ తడబడలేదు. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఎన్నో ప్రచార, బ్రాండింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవాలు, ఆపై టీవీ, సినిమా షోలు, అవార్డుల స్వీకరణ... ఇలా ఒక్కసారిగా నిఖత్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సమయంలోనూ ఆమె తన అసలు కర్తవ్యాన్ని మరచిపోలేదు. వెయిట్ కేటగిరీ మారినా... గత విజయం తర్వాత నిఖత్ ముందు నిలిచిన పెద్ద సవాల్ వెయిట్ కేటగిరీ! 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 52 కేజీల విభాగంలో టైటిల్ సాధించింది. దాంతో పారిస్ ఒలింపిక్స్–2024 అనేది అసలు లక్ష్యంగా మారింది. అయితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 52 కేజీల విభాగం లేకపోవడంతో తప్పనిసరిగా దానిని మార్చుకోవాల్సి వచ్చింది. ముందుకెళితే 54 కేజీల్లో అప్పటికే అక్కడ సత్తా చాటుతున్న అంతర్జాతీయ స్టార్ బాక్సర్లు, అనుభవజ్ఞులు ఉంటారు. దాంతో తన పంచ్ పవర్ పదును పని చేసేందుకు వెయిట్ తగ్గడమే సరైందని భావించి 50 కేజీలకు మారింది. దానికి అనుగుణంగా తన బరువును మార్చుకొని తీవ్రంగా సాధన చేసింది. భారత కోచ్ జాన్ వార్‌బర్టన్ సాధన విషయంలో నిఖత్‌కు అన్ని రకాలుగా సరైన దిశానిర్దేశం చేశారు. ఆమె శ్రమ ఫలితం బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కనిపించింది. వరల్డ్ చాంపియన్‌గా తన స్థాయిని ప్రదర్శిస్తూ అక్కడ సునాయాసంగా స్వర్ణం గెలుచుకుంది. అదీ తాను కొత్తగా మొదలుపెట్టిన 50 కేజీల కేటగిరీలో కావడంతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆపై మరో ఐదు నెలలకు వచ్చిన జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు మొదటి స్థానం లాంఛనమే అయింది. ఈ ఏడాది వ్యవధిలో ఆమె ఈ రెండు ఈవెంట్లు మినహా మరే టోర్నీలోనూ పాల్గొనలేదు. విదేశాల్లో కొన్ని టోర్నమెంట్లకు ఆహ్వానాలు అందినా... తన ఆట మెరుగవ్వాలంటే అలాంటి టోర్నీలలో ఆడి ‘విజేత’ అనిపించుకోవడంకంటే ప్రాక్టీస్ చేయడమే సరైందని జరీన్ భావించింది. చివరకు దాంతో ఫలితాన్ని అందుకుంది. ఆద్యంతం ఆధిపత్యం... సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది. సెమీస్ మినహా మిగిలిన బౌట్లలో ఎక్కడా తడబాటు లేకుండా ఆమె అలవోక విజయాలు అందుకుంది. ఒక బౌట్లో ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్), 4 బౌట్లలో 5–0తో నెగ్గిన ఆమె ఒక్క సెమీస్‌లో 5–2తో ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చింది. తాజా విజయంతో ఈ కేటగిరీలో నిఖత్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఇకపై పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగాల్సి ఉంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ, మెగా ఈవెంట్లో కూడా పతకం అందుకోవడం అసాధ్యం కాబోదు! -సాక్షి క్రీడా విభాగం చదవండి: WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్.. Congratulations to @nikhat_zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions. pic.twitter.com/PS8Sn6HbOD — Narendra Modi (@narendramodi) March 26, 2023 -
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
నిఖత్ పంచ్ అదిరె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను ప్రదర్శించారు. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షి ప్లో ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) తుది పోరుకు అర్హత సాధించి స్వర్ణ పతకాలకు విజయం దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 5–0తో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్ వలెన్సియా (కొలంబియా)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–2తో ఆసియా చాంపియన్ అలువా బల్కిబెకోవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 4–1తో లీ కియాన్ (చైనా)పై, స్వీటీ 4–3తో స్యు ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణం సాధించిన నిఖత్ ఈసారి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను ఓడించిన వలెన్సియాను నిఖత్ తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. రింగ్‌లో వేగంగా కదులుతూనే అవకాశం దొరికినపుడల్లా వలెన్సియాపై పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయించకుండా కూడా నిఖత్ జాగ్రత్త పడింది. ముందుగా తొలి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసి స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన నిఖత్ మూడో రౌండ్లో మాత్రం ప్రత్యర్థి కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రక్షణాత్మకంగా ఆడి కట్టడి చేసింది. 2 ఒకే ప్రపంచ చాంపియన్‌షి ప్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచి్చన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు భారత బాక్సర్లు (మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నగిశెట్టి ఉష) ఫైనల్ చేరారు. ఉష రజతం నెగ్గగా, మేరీకోమ్, సరిత, జెన్నీ, లేఖ స్వర్ణ పతకాలు గెలిచారు. 3 మేరీకోమ్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి ప్లో కనీసం రెండుసార్లు ఫైనల్‌కు చేరిన భారత బాక్సర్లుగా నిఖత్ జరీన్, స్వీటీ గుర్తింపు పొందారు. మేరీకోమ్ ఏకంగా ఏడుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం సాధించింది. నిఖత్ గత ఏడాది, స్వీటీ 2014లో ఫైనల్‌కు చేరారు. నేడు విశ్రాంతి దినం. శనివారం, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో లుత్సయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)తో నిఖత్ జరీన్... కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)తో లవ్లీనా పోటీపడతారు. -
Nikhat Zareen: ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్
Women's World Boxing Championship- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు నమోదు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ రెండో రౌండ్ బౌట్లో 5–0తో ఆఫ్రికా చాంపియన్ బూఆలమ్ రుమేసా (అల్జీరియా)ను ఓడించగా... మనీషా 5–0తో రహీమి టీనా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్‌ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్‌జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో భారత మహిళా బాక్సర్ల శిబిరం
న్యూఢిల్లీ: పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో భారత మహిళా బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలు జరగనున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో ఈ శిక్షణ శిబిరం జరగాల్సి ఉన్నా అక్కడ శిక్షణ పొందుతున్న బాక్సర్లతో పాటు సహాయక సిబ్బంది గత నెలలో కరోనా బారిన పడ్డారు. దాంతో శిబిరం వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ శిబిరంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు)తో పాటు లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) పాల్గొననున్నారు. వీరు ఇప్పటికే టోక్యో బెర్తులను ఖాయం చేసుకున్నారు. టోక్యోకు క్వాలిఫై అయిన మరో బాక్సర్ పూజా రాణి (75 కేజీలు) మాత్రం ఈ శిబిరంలో పాల్గొనడం లేదు. ఏఎస్ఐలో పాల్గొనే బాక్సర్లను మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులోనూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్తో పాటు ఆమెకు భాగస్వామ్యులుగా ఇద్దరు బాక్సర్లు ఉంటారు. ఇందుకోసం ప్రపంచ యూత్ చాంపియన్ అరుంధతి చౌదరి (69 కేజీలు), ముంజూ రాణి (48 కేజీలు), సోనియా లాథర్ (57 కేజీలు), శశి చోప్రా (64 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు) లాల్బుట్సాహి (64 కేజీలు)లను ఎంపిక చేశారు. గత నెలలో కరోనా బారిన పడి కోలుకుంటున్న మేరీకోమ్ కోచ్ చోటేలాల్ యాదవ్ ఆలస్యంగా శిబిరానికి రానున్నట్లు మేరీకోమ్ స్వయంగా తెలిపింది. ఒలింపిక్స్ కంటే ముందు భారత బాక్సర్లు మే 21 నుంచి జూన్ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. వాస్తవానికి ఈ టోర్నీ ఢిల్లీలో జరగాల్సి ఉన్నా కరోనా వల్ల దుబాయ్‌కు తరలించారు. -
జాతీయ బాక్సింగ్ శిబిరంలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత ఎలైట్ మహిళా బాక్సర్ల కోసం నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిన వారి జాబితాలో భారత మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ మొహమ్మద్ అలీ కమర్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లెవరికీ పాజిటివ్ రాలేదని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. కరోనా సోకిన వారందరూ క్వారంటైన్లో ఉన్నారని... నెగెటివ్ వచ్చిన వారికి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి తరలించామని ‘సాయ్’ వివరించింది. -
భారత బాక్సర్ల పతకాల పంట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిలేసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. పోలండ్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యంతో ఓవరాల్‌గా 13 పతకాలతో దుమ్మురేపారు. భారత బాక్సర్లు పోటీపడ్డ 13 విభాగాల్లోనూ పతకాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్స్‌లో భారతి (46 కేజీలు) 5–0తో ఇజాబెలా (పోలాండ్)పై; టింగ్‌మిలా డౌన్‌జెల్ (48 కేజీలు) 5–0తో ఎలైన (జర్మనీ)పై; సందీప్ కౌర్ (52 కేజీలు) 5–0తో కరోలినా అమ్‌పుల్‌స్కా (పోలాండ్)పై; నేహా (54 కేజీలు) 3–2తో నికోలినా (లాత్వియా)పై; జైబురా (పోలాండ్)పై కోమల్ (80 కేజీలు); లియోన (స్వీడన్)పై అర్షి (57 కేజీలు) విజయం సాధించి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అమీశ (50 కేజీలు) 0–5తో అలెక్సెస్ (పోలాండ్) చేతిలో, సాన్య నేగీ (60 కేజీలు) 2–3తో థెల్మా (స్వీడన్) చేతిలో, ఆశ్రేయ (63 కేజీలు) 1–4తో నైనా (సెర్బియా) చేతిలో, మితిక (66 కేజీలు) 2–3తో నటాలియా (పోలండ్) చేతిలో, రాజ్ సాహిబా (70 కేజీలు) 0–5తో జోఫియా (పోలాండ్) చేతిలో, లేపాక్షి (ప్లస్ 80 కేజీలు) 0–5తో ఓలీవియా (పోలాండ్) చేతిలో ఓడి రజతాలు దక్కించుకున్నారు. 75 కేజీల వెయిట్ కేటగిరీ సెమీఫైనల్లో నేహా 0–5తో పారడా డైరా (పోలాండ్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
బాబోయ్... ఈ ఆవులు మాకొద్దు
రోహ్తక్: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచినందుకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆవులను హరియాణా మహిళా బాక్సర్లు తిరిగి ఇచ్చేశారు. శారీరక పుష్టి కోసం ఆవు పాలు తాగితే మంచిదనే ఉద్దేశంతో బాక్సర్లు జ్యోతి గులియా, సాక్షి చౌదరి, నీతు గాంగాస్‌లకు తలా ఓ ఆవు ఇచ్చారు. ఆ ఆవులు పాలు ఇవ్వకపోగా తమని కుమ్మేస్తున్నాయని, గాయపరుస్తున్నాయని ఆ ముగ్గురు వాపోయారు. దీంతో గత నవంబర్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఆవుల్ని తిరిగి అప్పగించారు. ‘మా అమ్మ ఐదు రోజులపాటు ఆవుకు మేత పెట్టారు. అయితే పాలు పితికేందుకు ప్రయత్నించిన మూడుసార్లూ ఆమెను ఆవు తన్నింది. దీంతో మా అమ్మ నడుం దెబ్బతింది. మా వద్ద ఉన్న గేదెలు చాలు అని సంతృప్తి పడుతూ వెంటనే మేము ఆవును తిరిగి ఇచ్చేశాం’ అని ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి జ్యోతి గులియా తెలిపింది. ఇతర బాక్సర్లు నీతు, సాక్షిలకు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో వారూ ఆవులను తిరిగిచ్చేశారు. -
మహిళా బాక్సర్లకు శుభవార్త
2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఐదు కేటగిరీల్లో పోటీలు న్యూఢిల్లీ: టోక్యో ఆతిథ్యమివ్వనున్న 2020 ఒలింపిక్స్‌లో బాక్సింగ్ ఈవెంట్లో మహిళల కేటగిరీలను 3 నుంచి 5కు పెంచి... పురుషుల కేటగిరీలను 10 నుంచి 8కి కుదించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. టోక్యోలో మహిళా బాక్సర్లకు 51 కేజీలు, 57 కేజీలు, 60 కేజీలు, 69 కేజీలు, 75 కేజీల్లో పోటీలు నిర్వహిస్తారు. లండన్, రియో ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లకు 51 కేజీలు, 60 కేజీలు, 75 కేజీల్లో పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో తొలగించే రెండు కేటగిరీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఐఓసీ వర్గాలు తెలిపాయి. మహిళా కేటగిరీలను పెంచడం భారత్‌కు లాభిస్తుందని చీఫ్ కోచ్ గుర్బ„ŠS సింగ్ సంధు తెలిపారు. -
మహిళా బాక్సర్లకు ఇదేం నిబంధన?!
ఆటలు అబ్బాయిలకు, పాటలు అమ్మాయిలకు అనే సంప్రదాయ ఆలోచనా ధోరణి నుంచి మన సమాజం పూర్తిగా బయటపడలేదు. అందుకే శారీరకంగా కష్టమైన వృత్తులు, ఉద్యోగాలు, క్రీడలలో మహిళలకు ఈనాటికీ సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ‘కష్టమైన’ రంగాలలోకి ఇష్టపడి వెళ్లాలనుకున్నా... వారి గౌరవాన్ని, పరువును దెబ్బతీసి, వారిని వెనక్కి లాగే అవరోధాలు ఏదో ఒక దశలో మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయి. ఇందుకు తాజా నిదర్శనం... దక్షిణ కొరియాలోని జెజు నగరంలో రేపటి నుండి నవంబర్ 25 వరకు జరుగనున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు భారతదేశం నుండి ప్రయాణమైన ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (శాయ్) గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహించడం! ‘అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం’ నిబంధనల మేరకే, కొరియా వెళుతున్న భారత జట్టులో గర్భిణులు ఎవరూ లేరని నిర్థారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు ‘శాయ్’ చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై సహజంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భనిర్థారణ పరీక్షలు ఎవరిపైనైతే జరిపారో ఆ ఎనిమిది మందీ అవివాహితులు, జూనియర్లు కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ‘‘ఇలా పరీక్షలు నిర్వహించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే’’ అని డాక్టర్ పి.ఎస్.ఎం. చంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయన ఎవరో కాదు, క్రీడాకారుల ఫిట్నెస్కోసం ‘శాయ్’ తరచు సంప్రదించే వైద్యుడే. ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ అధ్యక్షుడు కూడా అయిన చంద్రన్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘‘పెళ్లికాని పిల్లలకు, పెళ్లీడు లేని జూనియర్లకు గర్భనిర్థారణ పరీక్షలు చేయడం అంటే, వారి శీల ప్రతిష్టను భంగపరచడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిబంధనల మాటేమిటి? ఆ మాటలో నిజం లేదంటారు చంద్రన్. అంటే, అసలు అలాంటి నిబంధనే లేదన్నది ఆయన వాదన. 2014 ఆగస్టు 31 నుంచి అమలులోకి వచ్చిన బాక్సింగ్ సంఘం నియమాలలో ప్రపంచ పోటీలకు వెళుతున్న బాక్సర్లకు గర్భనిర్థారణ పరీక్షలు జరిపి తీరాలన్న నిబంధన ఏదీ లేదని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ‘‘మహిళా బాక్సర్లు మెడికల్ సర్టిఫికెట్తో పాటు, అదనంగా నాన్-ప్రెగ్నెన్సీ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని మాత్రమే అసోసియేషన్ టెక్నికల్ రూల్స్ 2.1.4.2. లో ఉందనీ, దీనర్థం వారికి గర్భనిర్థారణ పరీక్షలు జరుపమని కాదనీ’’ చంద్రన్ అంటున్నారు. ఆ స్టేట్మెంట్ మీద కూడా తల్లిదండ్రులలో ఒకరు సంతకం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ‘‘పాపం, ఆ అమ్మాయిలు బాక్సింగ్‌లో విజయం సాధించి మాతృదేశానికి పేరుతేవాలన్న తపనలో ఇలాంటి వాటికి తలవొగ్గవలసి వస్తోంది’’ అని చంద్రన్ ఆవేదన చెందారు. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే చంద్రన్‌తో గొంతు కలపడం మొదలు పెట్టాయి కనుక ఇటువంటి అర్థరహితమైన, మహిళలను కించపరిచే నిబంధనలపై క్రీడా సంఘాలు గానీ, ఇతర రంగాల సంస్థలు కానీ పునరాలోచిస్తాయనే అనుకోవాలి. -
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు!
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం సిగ్గు పడే, మహిళలు క్రీడలను ఎంచుకునేందుకు తటపటాయించే ఘటన బాక్సింగ్ లో చోటు చేసుకుంది. ప్రపంచ చాంఫియన్ షిప్ లో పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. బాక్సింగ్ ఇండియా (బీఐ) సూచనల మేరకు ఇది జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సాయ్ వైద్య సలహాదారు డాక్టర్ పీఎస్ఎం చంద్రన్ బయటపెట్టారు. వీరిలో పెళ్లికానివారు, జూనియర్ బాక్సర్లు కూడా ఉన్నారు. భారత్ కు ఆడాలనే ఆశతో ఉన్న మహిళా బాక్సర్లు తమ బాధను బయటికి వ్యక్త పర్చలేకపోయారని, ఆధికారుల ఆదేశాలను పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారని చంద్రన్ చెప్పారు. అసలు ఏఐబీఏ నిబంధన ప్రకారం బాక్సర్లకు గర్భ నిర్ఱారణ పరీక్షలు జరపాలని ఎక్కడా లేదు. సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆ సర్టిఫికెట్ తో పాటు బాక్సర్లు సొంత పూచీపై నాన్ ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపువారైతే తల్లితండ్రులు ఈ డిక్లరేషన్ సమర్పించాలి.