
న్యూఢిల్లీ: భారత ఎలైట్ మహిళా బాక్సర్ల కోసం నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిన వారి జాబితాలో భారత మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ మొహమ్మద్ అలీ కమర్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లెవరికీ పాజిటివ్ రాలేదని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. కరోనా సోకిన వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారని... నెగెటివ్ వచ్చిన వారికి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి తరలించామని ‘సాయ్’ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment