Indira Gandhi Indoor Stadium
-
జాతీయ బాక్సింగ్ శిబిరంలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత ఎలైట్ మహిళా బాక్సర్ల కోసం నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిన వారి జాబితాలో భారత మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ మొహమ్మద్ అలీ కమర్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లెవరికీ పాజిటివ్ రాలేదని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. కరోనా సోకిన వారందరూ క్వారంటైన్లో ఉన్నారని... నెగెటివ్ వచ్చిన వారికి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి తరలించామని ‘సాయ్’ వివరించింది. -
డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం విజేందర్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సర్క్యూట్లో అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్న బాక్సర్ విజేందర్ సింగ్ జూన్‌లో జరగబోయే డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం బరిలోకి దిగబోతున్నాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ‘నా తొలి టైటిల్ కోసం సొంత అభిమానుల మధ్య తలపడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తెలీకపోయినా ఇప్పటిదాకా కనబరిచిన జోరునే చూపిస్తాను’ అని విజేందర్ తెలిపాడు. అయితే చైనీస్ లేదా కొరియా బాక్సర్‌ను విజేందర్ ఎదుర్కొనే అవకాశం ఉందని అతడి భారత ప్రమోటర్ నీరవ్ తోమర్ తెలిపారు. దీనికి ముందు విజేందర్ మార్చి 12న మాంచెస్టర్‌లో జరిగే బౌట్‌తో పాటు ఏప్రిల్, మేలలో జరిగే మ్యాచ్‌ల్లోనూ తలపడనున్నాడు.