డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం విజేందర్ | Image for the news result Vijender Singh to Fight For WBO Asia Title in India | Sakshi
Sakshi News home page

డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం విజేందర్

Published Fri, Feb 19 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

Image for the news result Vijender Singh to Fight For WBO Asia Title in India

న్యూఢిల్లీ:  ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్న బాక్సర్ విజేందర్ సింగ్ జూన్‌లో జరగబోయే డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం బరిలోకి దిగబోతున్నాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ‘నా తొలి టైటిల్ కోసం సొంత అభిమానుల మధ్య తలపడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తెలీకపోయినా ఇప్పటిదాకా కనబరిచిన జోరునే చూపిస్తాను’ అని విజేందర్ తెలిపాడు. అయితే చైనీస్ లేదా కొరియా బాక్సర్‌ను విజేందర్ ఎదుర్కొనే అవకాశం ఉందని అతడి భారత ప్రమోటర్ నీరవ్ తోమర్ తెలిపారు. దీనికి ముందు విజేందర్ మార్చి 12న మాంచెస్టర్‌లో జరిగే బౌట్‌తో పాటు ఏప్రిల్, మేలలో జరిగే మ్యాచ్‌ల్లోనూ తలపడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement