రాహుల్‌ మీ పెళ్లి అప్పుడేనా? | Will you marry after becoming PM: Boxer Vijender asks Rahul | Sakshi
Sakshi News home page

రాహుల్‌ మీ పెళ్లి అప్పుడేనా?

Published Fri, Oct 27 2017 9:06 AM | Last Updated on Fri, Oct 27 2017 9:37 AM

Will you marry after becoming PM: Boxer Vijender asks Rahul

సాక్షి, న్యూఢిల్లీ : ఫస్ట్‌ యువరాజు... రారాజు అవ్వాలి. రారాజు అయిన వెంటనే దేశాన్ని పాలించే ప్రధాని కావాలి. ఇక ప్రధాని అయిన తర్వాతనైనా యువరాజు ఓ ఇంటి వాడవుతాడా? ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన టాఫిక్స్ ఇవే‌. రాహుల్‌ గాంధీ పెళ్లిపై ఎప్పడి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే వాళ్లు చాలామందే ఉన్నారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తాను రాహుల్‌గాంధీనే పెళ్లి చేసుకుంటా అంటూ పట్టుబట్టింది కూడా. కానీ ఆయన ఆ పప్పులేమీ ఉడకనీయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని ఆయన అధిరోహిస్తారని, దేశ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు తెలిసింది. రాహుల్‌ ప్రధానిగా బరిలోకి దిగబోతున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో ఆయన పెళ్లిపై కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

తాజాగా బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, యువరాజు పెళ్లిపై ఆతృతతో, మీరు ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుంటారా? అంటూ రాహుల్‌ని ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన 112వ యాన్యువల్‌ సెషన్‌ ఆఫ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో పాల్గొన్న యువరాజును విజేందర్‌ ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ కాస్త సిగ్గుపడుతూ‌.. ఎప్పుడు జరగాలని ఉంటే, అప్పుడే జరుగుతుందని, తాను మాత్రం విధిని నమ్ముతానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుసార్లు రాహుల్‌గాంధీకి తన పెళ్లి విషయంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2017 తర్వాత ఈ ఈవెంట్‌ ఉంటుందంటూ బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ సుబ్రమణ్యస్వామి అప్పట్లో కామెంట్లు కూడా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement