Boxer Vijender Singh
-
ఆమె నిరాడంబరత నచ్చింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తనకు ఆదర్శమని రాజకీయ నేతగా మారిన బాక్సర్ విజేందర్ సింగ్ చెప్పారు. ఆమె నిరాడంబరత తనను ఆకట్టుకుందని అన్నారు. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న విజేందర్ సింగ్ దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. తన ప్రత్యర్థులు..బీజేపీ పాతకాపు రమేష్ బిధూరిని మంచి వ్యక్తి కాదని, ఆప్ అభ్యర్థి రాఘవ్ ఛద్దాను బచ్చా అని విజేందర్ అభివర్ణించారు. ఇతర అభ్యర్థులతో పోటీయే లేదన్నారు. ‘నేనో రైతు కుటుంబానికి చెందిన బస్సు డ్రైవర్ కొడుకుని. సున్నా నుంచి మొదలుపెట్టా’ అని అన్నారు. సీఎం కేజ్రీవాల్‌తో, ఆయన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. పాఠశాల విద్యకు కొత్తరూపునిస్తామని, స్వచ్ఛమైన నీళ్లు అందజేస్తామని ఆప్ చెప్పింది కానీ.. 8వ తరగతి తర్వాత వెళ్లేందుకు విద్యార్థులకు బడి లేకుండా పోయింది.. వాటర్ ట్యాంకర్ ధర ఎంత ఉందో అందరికీ తెలిసిన విషయమేనని విమర్శించారు. తాను మొదటిసారి పోటీ చేస్తున్నప్పటికీ నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వమంటే మధ్యతరగతి ప్రజలు భయపడిపోతున్నారని, దక్షిణ ఢిల్లీలో భయంతో కూడిన వాతావరణానికి చరమగీతం పాడేందుకు తాను ప్రయత్నిస్తానని అన్నారు. -
రాహుల్ మీ పెళ్లి అప్పుడేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ఫస్ట్ యువరాజు... రారాజు అవ్వాలి. రారాజు అయిన వెంటనే దేశాన్ని పాలించే ప్రధాని కావాలి. ఇక ప్రధాని అయిన తర్వాతనైనా యువరాజు ఓ ఇంటి వాడవుతాడా? ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన టాఫిక్స్ ఇవే. రాహుల్ గాంధీ పెళ్లిపై ఎప్పడి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే వాళ్లు చాలామందే ఉన్నారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తాను రాహుల్‌గాంధీనే పెళ్లి చేసుకుంటా అంటూ పట్టుబట్టింది కూడా. కానీ ఆయన ఆ పప్పులేమీ ఉడకనీయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఆయన అధిరోహిస్తారని, దేశ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు తెలిసింది. రాహుల్ ప్రధానిగా బరిలోకి దిగబోతున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో ఆయన పెళ్లిపై కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా బాక్సర్ విజేందర్ సింగ్, యువరాజు పెళ్లిపై ఆతృతతో, మీరు ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుంటారా? అంటూ రాహుల్‌ని ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన 112వ యాన్యువల్ సెషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న యువరాజును విజేందర్ ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ కాస్త సిగ్గుపడుతూ.. ఎప్పుడు జరగాలని ఉంటే, అప్పుడే జరుగుతుందని, తాను మాత్రం విధిని నమ్ముతానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుసార్లు రాహుల్‌గాంధీకి తన పెళ్లి విషయంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017 తర్వాత ఈ ఈవెంట్ ఉంటుందంటూ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ సుబ్రమణ్యస్వామి అప్పట్లో కామెంట్లు కూడా చేశారు. -
నా పంచ్‌లే సమాధానం ఇస్తాయి: విజేందర్
స్వదేశంలో మరో విజయం సాధించి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకుంటానని భారత ప్రొఫెషనల్ స్టార్బాక్సర్ విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాతో ఈనెల 17న న్యూఢిల్లీలో విజేందర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చిన్న పిల్లాడని... అతడిని పదునైన పంచ్‌లతో నాకౌట్ చేస్తానని ఫ్రాన్సిస్ అన్నాడు. అయితే రింగ్‌లో పంచ్‌లతోనే తాను ఫ్రాన్సిస్‌కు సమాధానం ఇస్తానని, మరో నాలుగు రోజులు ఆగితే ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఎవరు చిన్న పిల్లాడో తెలుస్తుందని విజేందర్ దీటైన జవాబు ఇచ్చాడు. ప్రొఫెషనల్ కెరీర్లో విజేందర్ ఇప్పటివరకు ఆడిన ఏడు బౌట్లలోనూ విజయం సాధించి అజేయంగా ఉన్నాడు. -
విజేందర్ ప్రత్యర్థి కెర్రీ హోప్
► జూలై 16న డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ బౌట్ ► తొలి టికెట్ సెహ్వాగ్‌కు న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. జూలై 16న జరిగే ఈ బౌట్లో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ యూరో చాంపియన్ కెర్రీ హోప్‌తో తను తలపడతాడు. స్థానిక త్యాగరాజ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు హోప్‌కు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటిదాకా తను 30 బౌట్లలో తలపడగా రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలున్నాయి. ఇక పోటీకి రెండు నెలల సమయం ఉండగా అప్పుడే మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘విజేందర్ భారత్‌లో స్టార్ కావచ్చు కానీ నా వరకు ఓ బాక్సర్ మాత్రమే. ఏడాది క్రితమే విజేందర్ ప్రొగా మారాడు. నాకు 12 ఏళ్ల అనుభవం ఉంది. స్వదేశంలో ఒత్తిడంతా అతడి పైనే ఉంటుంది. ఇది నా విజయాన్ని సునాయాసం చేస్తుంది’ అని హోప్ అన్నాడు. అయితే బౌట్ జరిగే రోజు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందని విజేందర్ తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు తొలి టికెట్‌ను తన స్నేహితుడు మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌కు అందించాడు. -
విజేందర్ సిక్సర్
► వరుసగా ఆరో బౌట్లోనూ గెలుపు ► ఈసారీ ప్రత్యర్థి నాకౌట్ లండన్: భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా పదునైన పంచ్‌లతో హడలెత్తిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో శుక్రవారం జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత ఎనిమిది రౌండ్లపాటు జరగాల్సిన బౌట్ విజేందర్ ధాటికి ముచ్చటగా మూడో రౌండ్లోనే ముగిసింది. విజేందర్ సింగ్ సంధించిన పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో విజేందర్ తన ప్రొఫెషనల్ కెరీర్లో వరుసగా ఆరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఆరు బౌట్లలో విజేందర్ తన ప్రత్యర్థులను నాకౌట్ చేయడం విశేషం. విజేందర్కు షాక్ ఇస్తానని బౌట్‌కు ముందు ప్రగల్భాలు పలికినా సోల్డ్రా రింగ్‌లోకి దిగాక చేతులెత్తేశాడు. ఆరంభం నుంచే విజేందర్ పంచ్‌లు విసరడంతో తొలి రౌండ్లోనే ఒకసారి సోల్డ్రా కుప్పకూలిపోయాడు. రెండో రౌండ్లోనూ విజేందర్ తన దూకుడు కనబరిచాడు. ఇక మూడో రౌండ్లో విజేందర్ పంచ్‌ల వర్షం కురిపించడంతో సోల్డ్రా ఓటమిని అంగీకరించాడు. -
నేడు విజేందర్ ఆరో బౌట్
బోల్టన్: అపజయం లేకుండా తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు (శుక్రవారం) తన ఆరో బౌట్లో తలపడనున్నాడు. పోలండ్‌కు చెందిన ఆండ్రెజెజ్ సోల్డ్రాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అయితే ఈసారి విజేందర్ తొలిసారిగా ఎనిమిది రౌండ్ల ఫైట్‌ను ఎదుర్కొనబోతున్నాడు. ‘నా ఆరో బౌట్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాను. సోల్డ్రాకు సంబంధించిన వీడియోలు చూశాను. అతనికి 16 ఫైట్లలో 81 రౌండ్ల అనుభవం ఉంది. నాకంటే అనుభవశాలే అయినా అతడిని నియంత్రిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోటీలో నెగ్గి వచ్చే నెలలో భారత్‌లో జరిగే డబ్ల్యుబీవో ఆసియా బౌట్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని 30 ఏళ్ల విజేందర్ భావిస్తున్నాడు. -
విజేందర్ పాంచ్ పటాకా
లండన్: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ఎదురులేకుండా కొనసాగిస్తున్నాడు. శనివారం ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్‌తో జరిగిన బౌట్లోనూ అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సాధించాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. తొలి రౌండ్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఫైట్ పూర్తి రక్షణాత్మకంగానే సాగినా అనంతరం భారత బాక్సర్ తన పవర్ పంచ్‌లను రుచి చూపించాడు. రెండో రౌండ్లో విజేందర్ కచ్చితమైన టైమింగ్‌తో విసిరిన పంచ్‌లకు రోయర్ కంటి కింద గాటు పడింది. ఆ తర్వాత విజేందర్ జోరుకు రోయెర్ ఎదురునిలువలేక ఐదో రౌండ్లో ఓటమిని అంగీకరించాడు. -
మళ్లీ నాకౌటేనా!
రోయెర్తో విజేందర్ బౌట్ నేడు లండన్: బరిలోకి దిగిన నాలుగు బౌట్లలోనూ ప్రత్యర్థులను నాకౌట్ చేసిన భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో గట్టిపోరుకు సిద్ధమయ్యాడు. తన కంటే అనుభవజ్ఞుడైన ఫ్రాన్స్ బాక్సర్ రోయెర్తో నేడు అమీతుమీ తేల్చుకోనున్నాడు. గత నాలుగు బౌట్లను మూడు రౌండ్లు కూడా దాటనీయని భారత బాక్సర్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. స్ట్రాట్ఫోర్డ్ ఎరెనాలో జరిగే ఈ బౌట్పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అయితే ప్రొఫెషనల్ కెరీర్లో ఏడేళ్ల అనుభవం ఉన్న రోయెర్ను ఓడించడం అంత సులువు కాదు. ఇప్పటి వరకు విజేందర్ తలపడిన బాక్సర్లలో ఇతడే బలమైన ప్రత్యర్థి. రోయెర్ 44 బౌట్లలో తలపడి 14 విజయాలు సాధించాడు. ‘రోయెర్ చాలా పటిష్టమైన ప్రత్యర్థి. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా పోరాడతాడు. అయితే అతను మెరుగైన బాక్సరే అయినా.. నేను కూడా తక్కువేమీ కాదు. వీలైనంత త్వరగా బౌట్‌ను ముగించేందుకు కృషి చేస్తా. గత వాటితో పోలిస్తే ఇది కాస్త ఎక్కువసేపు జరగొచ్చు. ఓ రకంగా నాకు కూడా మంచిదే’ అని విజేందర్ పేర్కొన్నాడు. -
పాము రక్తం తాగుతూ..!
విజేందర్‌తో పోరుకు ప్రత్యర్థి సన్నద్ధం మాంచెస్టర్: గత మూడు బౌట్లలో ప్రత్యర్థిని నాకౌట్ చేసిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌ను ఎలాగైనా ఓడించాలని అనుకున్నాడో ఏమోగాని... ఈసారి అతని ప్రత్యర్థి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. కేవలం ప్రాక్టీస్‌తో ఫలితం లేదనుకున్నాడెమో... శారీరకంగా ఇంకా పటిష్టం కావాలనే ఉద్దేశంతో విజేందర్ తాజా ప్రత్యర్థి అలెగ్జాండర్ హోర్వాత్ (హం గేరి) తన ఆహార జాబితాలో పాము రక్తాన్ని కూడా చేర్చుకున్నాడు. ఈనెల 12న లివర్‌పూల్‌లో విజేందర్, హోర్వాత్ల మధ్య బౌట్ జరగనుంది. విజేందర్ ఇప్పటివరకు మూడు బౌట్లలో పోటీపడగా మూడింటిలోనూ నాకౌట్ విజయాలు సాధించాడు. మరోవైపు 20 ఏళ్ల హోర్వాత్ ఏడు బౌట్లలో పాల్గొని ఐదింటిలో గెలిచాడు. ఒక బౌట్లో ఓడిపోయి, మరో బౌట్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ‘తాజా పాము రక్తాన్ని తాగడం మా కుటుంబంలో చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. నేను నిజమైన యోధుడిని. ఒకప్పుడు యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించేందుకు హంగేరి సైనికులు పాము రక్తాన్ని తాగేవారు. విజేందర్‌ను ఓడించేందుకు నేను ఇలా చేస్తున్నాను. పాము రక్తంతో మాటల్లో చెప్పలేనివిధంగా శక్తిమంతుడిని అవుతాను’ అని హోర్వాత్ అన్నాడు. -
డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం విజేందర్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సర్క్యూట్లో అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్న బాక్సర్ విజేందర్ సింగ్ జూన్‌లో జరగబోయే డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం బరిలోకి దిగబోతున్నాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ‘నా తొలి టైటిల్ కోసం సొంత అభిమానుల మధ్య తలపడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తెలీకపోయినా ఇప్పటిదాకా కనబరిచిన జోరునే చూపిస్తాను’ అని విజేందర్ తెలిపాడు. అయితే చైనీస్ లేదా కొరియా బాక్సర్‌ను విజేందర్ ఎదుర్కొనే అవకాశం ఉందని అతడి భారత ప్రమోటర్ నీరవ్ తోమర్ తెలిపారు. దీనికి ముందు విజేందర్ మార్చి 12న మాంచెస్టర్‌లో జరిగే బౌట్‌తో పాటు ఏప్రిల్, మేలలో జరిగే మ్యాచ్‌ల్లోనూ తలపడనున్నాడు. -
డబ్బు కోసం కాదు
ప్రొఫెషనల్‌గా మారడంపై విజేందర్ ముంబై : అమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెషనల్‌గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్లపాటు అమెచ్యూర్ బాక్సర్‌గా కొనసాగిన తాను ఇష్టపూర్వకంగానే ప్రొఫెషనల్‌గా మారినట్టు ఈ హర్యానా బాక్సర్ వివరించాడు. ‘డబ్బు కోసం నేను ప్రొఫెషనల్‌గా మారలేదు. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. కాంస్య పతకం కూడా సాధించాను. ప్రొఫెషనల్‌గా మారేందుకు నాకో అవకాశం లభించింది. దానిని సద్వినియోగం చేసుకుంటున్నాను’ అని బుధవారం ప్రొఫెషనల్ట్రైనింగ్ ప్రారంభించిన విజేందర్ చెప్పాడు.