నా పంచ్‌లే సమాధానం ఇస్తాయి: విజేందర్
స్వదేశంలో మరో విజయం సాధించి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకుంటానని భారత ప్రొఫెషనల్ స్టార్‌బాక్సర్ విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాతో ఈనెల 17న న్యూఢిల్లీలో విజేందర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చిన్న పిల్లాడని... అతడిని పదునైన పంచ్‌లతో నాకౌట్ చేస్తానని ఫ్రాన్సిస్ అన్నాడు. అయితే రింగ్‌లో పంచ్‌లతోనే తాను ఫ్రాన్సిస్‌కు సమాధానం ఇస్తానని, మరో నాలుగు రోజులు ఆగితే ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఎవరు చిన్న పిల్లాడో తెలుస్తుందని విజేందర్ దీటైన జవాబు ఇచ్చాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో విజేందర్ ఇప్పటివరకు ఆడిన ఏడు బౌట్‌లలోనూ విజయం సాధించి అజేయంగా ఉన్నాడు.