విజేందర్ పాంచ్ పటాకా | Vijender Singh Beats Matiouze Royer For Fifth Pro Boxing Win in a Row | Sakshi
Sakshi News home page

విజేందర్ పాంచ్ పటాకా

Published Sun, May 1 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

విజేందర్   పాంచ్ పటాకా

విజేందర్ పాంచ్ పటాకా

లండన్: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ఎదురులేకుండా కొనసాగిస్తున్నాడు. శనివారం ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్‌తో జరిగిన బౌట్‌లోనూ అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సాధించాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్‌లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు.

తొలి రౌండ్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఫైట్ పూర్తి రక్షణాత్మకంగానే సాగినా అనంతరం భారత బాక్సర్ తన పవర్ పంచ్‌లను రుచి చూపించాడు. రెండో రౌండ్‌లో విజేందర్  కచ్చితమైన టైమింగ్‌తో విసిరిన పంచ్‌లకు రోయర్ కంటి కింద గాటు పడింది. ఆ తర్వాత విజేందర్ జోరుకు రోయెర్ ఎదురునిలువలేక ఐదో రౌండ్‌లో ఓటమిని అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement