Technical knockout
-
విజేందర్‌లో ఆ సత్తా ఉంది: లీ బియర్డ్
లండన్: ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఇప్పటి వరకు చూపిన ఏకాగ్రత, క్రమశిక్షణను అలాగే కొనసాగిస్తే భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్ అవుతాడని అతని ట్రెయినర్ లీ బియర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను చాలా మందికి శిక్షణ ఇచ్చా. వాళ్లతో పోలిస్తే విజేందర్ నైపుణ్యం అమోఘం. ప్రపంచ చాంపియన్‌కు కావాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి’ అని బియర్డ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తలపడిన ఆరు బౌట్లలో విజేందర్... టెక్నికల్ నాకౌట్ ద్వారా ప్రత్యర్థులను ఓడించాడు. ‘ వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే రెండు వారాల వ్యవధిలోనే విజేందర్ రెండు బౌట్లలో పోటీపడ్డాడు. ఇది చాలా గొప్ప ప్రదర్శన. తన కంటే మెరుగైన ప్రత్యర్థులపై పోటీపడటమంటే సాధారణ విషయం కాదు. రింగ్‌లో విజేందర్ చాలా వేగంగా స్పందిస్తాడు అతని ఆలోచనా విధానం, కదలికలు, పంచ్ పవర్ సూపర్బ్. అయితే పెద్ద ఫైట్స్‌లో గెలవాలంటే కొన్ని కీలక సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్‌గా భవిష్యత్‌లో ప్రపంచ టైటిల్‌కు ఇతడు కూడా ఓ పోటీదారు అవుతాడు’ అని బియర్డ్ విశ్లేషించారు. -
'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఆరో బౌట్ కు సిద్ధంగా ఉన్న విజేందర్ తన చివరి బౌట్ లో ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్ పై విజయం సాధించాడు. దీంతో అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆటగాడయ్యాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. . ఆరో బౌట్ లో పోలాండ్ కు చెందిన ఆండ్రిజెజ్ సోల్డ్రాతో పోటీ పడనున్నాడు. ఆరో రౌండ్ మాత్రం అంత సులువుకాదంటూ అతడి ప్రత్యర్థి సవాలు చేస్తున్నాడు. బోల్టాన్ లోని ప్రీమియర్ సూట్ మాక్రాన్ స్టేడియంలో సోల్డ్రాతో తలపడేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మొత్తం 14 రౌండ్లు ఆడిన విజేందర్ వరుసగా ఐదు విజయాలను సాధించాడు. ప్రత్యర్థి సోల్డ్రా మ్యాచ్ వీడియోలు చూశాను. ఆరో బౌట్ గెలవాలని తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెబుతండగా, తనలాంటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ కు ఇంతకుముందు ఎదురుకాలేదని బౌట్ రోజు తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరాడు. విజేందర్ బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తానంటూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మే 13న జరగనున్న వీరి పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. -
విజేందర్ పాంచ్ పటాకా
లండన్: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ఎదురులేకుండా కొనసాగిస్తున్నాడు. శనివారం ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్‌తో జరిగిన బౌట్లోనూ అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సాధించాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. తొలి రౌండ్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఫైట్ పూర్తి రక్షణాత్మకంగానే సాగినా అనంతరం భారత బాక్సర్ తన పవర్ పంచ్‌లను రుచి చూపించాడు. రెండో రౌండ్లో విజేందర్ కచ్చితమైన టైమింగ్‌తో విసిరిన పంచ్‌లకు రోయర్ కంటి కింద గాటు పడింది. ఆ తర్వాత విజేందర్ జోరుకు రోయెర్ ఎదురునిలువలేక ఐదో రౌండ్లో ఓటమిని అంగీకరించాడు. -
క్వార్టర్స్‌లో శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆది వారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి బ్రెండన్ ఇర్విన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. వైజాగ్‌లోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ బరిలోకి దిగిన వెంటనే తన పదునైన పంచ్‌లతో బ్రెండన్‌పై విరుచుకుపడ్డాడు. శ్యామ్ పంచ్‌ల ధాటికి బ్రెండన్ పరిస్థితిని గమనించిన రిఫరీ తొలి రౌండ్లోనే బౌట్‌ను నిలిపివేసి శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. యోల్ ఫినోల్ (వెనెజులా), మైకేల్ లెగోస్కీ (పోలండ్) మధ్య మ్యాచ్ విజేతతో శ్యామ్ క్వార్టర్స్‌లో తలపడతాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకి క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో గౌరవ్ 3-0తో విలియమ్ డొనోగూ (ఐర్లాండ్)ను వరుస రౌండ్లలో మట్టికరిపించడం విశేషం. క్వార్టర్స్‌లో సోలంకి... ఎల్వీ పింగ్ (చైనా)తో తలపడతాడు. 64 కేజీ విభాగంలో నీరజ్ పరాశర్ 1-2తో రిచర్డ్ టోత్ (హంగేరి) చేతిలో పరాజయం చవిచూశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో జమున బోరో
సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ జమున బోరో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల 57 కేజీల విభాగం తొలి రౌండ్లో అసోంకు చెందిన జమున ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి మొఫాలాలీ (లెసోతో)పై గెలిచింది. బౌట్ ఆరంభమైన రెండు నిమిషాల్లోపే జమున సంధించిన పంచ్‌లకు తాళలేక మొఫాలాలీ రెండుసార్లు రింగ్‌లో పడిపోయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి జమునను విజేతగా ప్రకటించారు. పురుషుల 60 కేజీల విభాగం తొలి రౌండ్లో సందీప్ కుమార్ (భారత్) 3-0తో అస్మానిస్ (లాత్వియా)ను ఓడించాడు. నిఖత్ నెగ్గలేదు... మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. మంగళవారం జరిగిన ఈ బౌట్లో నిఖత్ 0-3 (37-38, 36-39, 36-39)తో ఇస్తిక్ నెరిమాన్ (టర్కీ) చేతిలో ఓడిపోయింది.