సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ జమున బోరో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల 57 కేజీల విభాగం తొలి రౌండ్‌లో అసోంకు చెందిన జమున ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి మొఫాలాలీ (లెసోతో)పై గెలిచింది. బౌట్ ఆరంభమైన రెండు నిమిషాల్లోపే జమున సంధించిన పంచ్‌లకు తాళలేక మొఫాలాలీ రెండుసార్లు రింగ్‌లో పడిపోయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి జమునను విజేతగా ప్రకటించారు. పురుషుల 60 కేజీల విభాగం తొలి రౌండ్‌లో సందీప్ కుమార్ (భారత్) 3-0తో అస్‌మానిస్ (లాత్వియా)ను ఓడించాడు.
నిఖత్ నెగ్గలేదు...
మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. మంగళవారం జరిగిన ఈ బౌట్‌లో నిఖత్ 0-3 (37-38, 36-39, 36-39)తో ఇస్తిక్ నెరిమాన్ (టర్కీ) చేతిలో ఓడిపోయింది.
ప్రిక్వార్టర్స్‌లో జమున బోరో
Published Thu, Apr 17 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement
Advertisement