
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్... మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు.
ఫైనల్స్‌లో వన్షజ్ 5–0తో దెముర్ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్ మెకీ (ఇంగ్లండ్)పై, రవీనా 4–3తో మేగన్ డెక్లెయిర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్ 1–4తో యుటా సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment