'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా' | Vijender will face Andrzej Soldra at Macron Stadium | Sakshi
Sakshi News home page

'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'

Published Sat, May 7 2016 1:14 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'

'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'

న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఆరో బౌట్ కు సిద్ధంగా ఉన్న విజేందర్ తన చివరి బౌట్ లో ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్‌ పై విజయం సాధించాడు. దీంతో అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆటగాడయ్యాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్‌లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. . ఆరో బౌట్ లో పోలాండ్ కు చెందిన ఆండ్రిజెజ్ సోల్డ్రాతో పోటీ పడనున్నాడు. ఆరో రౌండ్ మాత్రం అంత సులువుకాదంటూ అతడి ప్రత్యర్థి సవాలు చేస్తున్నాడు.

బోల్టాన్ లోని ప్రీమియర్ సూట్ మాక్రాన్ స్టేడియంలో సోల్డ్రాతో తలపడేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మొత్తం 14 రౌండ్లు ఆడిన విజేందర్ వరుసగా ఐదు విజయాలను సాధించాడు. ప్రత్యర్థి సోల్డ్రా మ్యాచ్ వీడియోలు చూశాను. ఆరో బౌట్ గెలవాలని తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెబుతండగా, తనలాంటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ కు ఇంతకుముందు ఎదురుకాలేదని బౌట్ రోజు తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరాడు. విజేందర్ బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తానంటూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మే 13న జరగనున్న వీరి పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement