క్వార్టర్స్‌లో శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆది వారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి బ్రెండన్ ఇర్విన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. వైజాగ్‌లోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ బరిలోకి దిగిన వెంటనే తన పదునైన పంచ్‌లతో బ్రెండన్‌పై విరుచుకుపడ్డాడు.
శ్యామ్ పంచ్‌ల ధాటికి బ్రెండన్ పరిస్థితిని గమనించిన రిఫరీ తొలి రౌండ్‌లోనే బౌట్‌ను నిలిపివేసి శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. యోల్ ఫినోల్ (వెనెజులా), మైకేల్ లెగోస్కీ (పోలండ్) మధ్య మ్యాచ్ విజేతతో శ్యామ్ క్వార్టర్స్‌లో తలపడతాడు.
మరోవైపు 52 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకి క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో గౌరవ్ 3-0తో విలియమ్ డొనోగూ (ఐర్లాండ్)ను వరుస రౌండ్లలో మట్టికరిపించడం విశేషం. క్వార్టర్స్‌లో సోలంకి... ఎల్‌వీ పింగ్ (చైనా)తో తలపడతాడు. 64 కేజీ విభాగంలో నీరజ్ పరాశర్ 1-2తో రిచర్డ్ టోత్ (హంగేరి) చేతిలో పరాజయం చవిచూశాడు.