
ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 5–0తో భారత్‌కే చెందిన నీరజ్ స్వామిని ఓడించాడు.
మరో బౌట్‌లో ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ థాయ్‌లాండ్ బాక్సర్ థాని నరీన్‌రామ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్లు సర్జూబాలా దేవి, పింకీ జాంగ్రా సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment