world youth boxing
-
బాక్సర్లకు.. రివార్డుగా దేశీ ఆవులు..!
రోహ్తక్: ప్రపంచయూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలతో మెరిసిన భారత మహిళా బాక్సర్లకు హరియాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి రివార్డుగా దేశీ ఆవులను ప్రకటించింది. పతకం సాధించిన ఒక్కో బాక్సర్ ఒక్కో దేశీ అవును ప్రభుత్వం తరుపున రివార్డుగా ఇవ్వనున్నట్ల హరియాణ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకాశ్ ధనకర్ తెలిపారు. గురువారం రోహ్తక్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( సాయ్) నిర్వహించిన బాక్సర్ల ఘనస్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యలు గెలిచిన మహిళా బాక్సర్ల కష్టానికి గుర్తుగా ప్రతి ఒక్కరికి పాలిచ్చే దేశీ ఆవులను రివార్డుగా ఇస్తామన్నారు. దీంతో వారు మరింత ధృడంగా తయారవుతారని పేర్కొన్నారు. ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యలు సాధించిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించిన విషయం తెలిసిందే. గత నెల 19 నుంచి 26 మధ్య జరిగిన ఈ టోర్నిలో నీతూ, సాక్షి, జ్యోతి, శశిలు స్వర్ణపతకాలు సాధించగా.. అనుపమా, నేహాలు కాంస్య పతకాలు సాధించారు. -
5 ‘పంచ్’లు స్వర్ణాలు
గువాహటి: భారత మహిళా బాక్సర్లు ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలతో మెరిశారు. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. నీతు 5–0తో జజిరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్)పై, జ్యోతి 5–0తో ఎకతెరినా మొల్చనొవా (రష్యా)పై, సాక్షి 3–2తో ఇవీ జేన్ స్మిత్ (ఇంగ్లండ్)పై, శశి 4–1తో ఎన్గొక్ డొ హంగ్ (వియత్నాం)పై, అంకుశిత 4–1తో ఎకతెరినా డింక్ (రష్యా)పై విజయం సాధించారు. ఇప్పటికే నేహ యాదవ్ (ప్లస్ 81 కేజీలు), అనుపమ (81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. తాజా స్వర్ణంతో జ్యోతి అర్జెంటీనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ప్రేక్షకుల గ్యాలరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బౌట్లను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. -
సచిన్ సింగ్ సంచలనం
క్యూబా బాక్సర్‌పై విజయం ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో స్వర్ణం సెరుుంట్ పీటర్స్బర్గ్ (రష్యా): భారత యువ బాక్సర్ సచిన్ సింగ్ సివాచ్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 16 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో నమన్ తన్వర్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. బాక్సింగ్‌లో ‘రింగ్ మాస్టర్స్’గా పేరున్న క్యూబా బాక్సర్‌ను సచిన్ ఓడించి స్వర్ణం నెగ్గడం విశేషం. శనివారం జరిగిన 49 కేజీల విభాగంలో ఫైనల్లో సచిన్ 5-0 తేడాతో జోర్జి గ్రినాన్ (క్యూబా)పై ఏకపక్ష విజయం సాధించాడు. అంతర్జాతీయస్థారుు టోర్నీలో క్యూబా బాక్సర్‌పై ఓ భారత బాక్సర్ నెగ్గడం ఇదే ప్రథమం. ప్రపంచ యూత్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్ సచిన్. గతంలో నానో సింగ్ (2008లో), వికాస్ క్రిషన్ (2010లో) స్వర్ణాలు గెలిచారు. -
శ్యామ్ ‘పంచ్’ అదుర్స్
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో మెరిసిన వైజాగ్ బాక్సర్ 49 కేజీల విభాగంలో సెమీస్‌లోకి పతకంతోపాటు యూత్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం సోఫియా (బల్గేరియా): ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ అద్భుతం సృష్టించాడు. రింగ్‌లోకి దిగడమే తరువాయి ప్రత్యర్థిపై పంచ్‌లు కురిపిస్తూ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఈ వైజాగ్ కుర్రాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న 18 ఏళ్ల శ్యామ్ సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-1 తేడాతో యోల్ ఫినోల్ (వెనిజులా)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో శ్యామ్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో చైనా ఆతిథ్యమిచ్చే యూత్ ఒలింపిక్స్ క్రీడలకూ అర్హత సాధించాడు. తొలి రౌండ్లో ఆధిపత్యం చలాయించిన శ్యామ్ రెండో రౌండ్‌ను కోల్పోయాడు. అయితే మూడో రౌండ్లో పుంజుకున్న శ్యామ్ తన ప్రత్యర్థికి పగ్గాలు వేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత బాక్సింగ్ సమాఖ్యపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ పోటీల్లో భారత బాక్సర్లు ‘ఐబా’ పతాకం కింద పోటీపడుతున్నారు. 52 కేజీల విభాగం క్వార్టర్స్‌లో భారత బాక్సర్ గౌరవ్ 0-3తో పింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. నా జీవితంలోనే ఇది గొప్ప విజయం. గతంలో నేను మూడు అంతర్జాతీయ జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాను. తాజా ప్రదర్శన సీనియర్ స్థాయిలో అడుగుపెట్టేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను. - కాకర శ్యామ్ కుమార్ -
క్వార్టర్స్‌లో శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆది వారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి బ్రెండన్ ఇర్విన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. వైజాగ్‌లోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ బరిలోకి దిగిన వెంటనే తన పదునైన పంచ్‌లతో బ్రెండన్‌పై విరుచుకుపడ్డాడు. శ్యామ్ పంచ్‌ల ధాటికి బ్రెండన్ పరిస్థితిని గమనించిన రిఫరీ తొలి రౌండ్లోనే బౌట్‌ను నిలిపివేసి శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. యోల్ ఫినోల్ (వెనెజులా), మైకేల్ లెగోస్కీ (పోలండ్) మధ్య మ్యాచ్ విజేతతో శ్యామ్ క్వార్టర్స్‌లో తలపడతాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకి క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో గౌరవ్ 3-0తో విలియమ్ డొనోగూ (ఐర్లాండ్)ను వరుస రౌండ్లలో మట్టికరిపించడం విశేషం. క్వార్టర్స్‌లో సోలంకి... ఎల్వీ పింగ్ (చైనా)తో తలపడతాడు. 64 కేజీ విభాగంలో నీరజ్ పరాశర్ 1-2తో రిచర్డ్ టోత్ (హంగేరి) చేతిలో పరాజయం చవిచూశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సోలంకి
వరల్డ్ యూత్ బాక్సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. 52 కేజీల విభాగంలో ఆసియా రజత పతక విజేత గౌరవ్ సోలంకి, 64 కేజీల కేటగిరీలో నీరజ్ పర్సార్లు ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. బల్గేరియాలోని సోఫియాలో గురువారం జరిగిన 52 కేజీల రెండో రౌండ్ బౌట్లో సోలంకి 2-1తో దిమిత్రి అసాను (బల్గేరియా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్లో అసాను పంచ్‌లకు కాస్త తడబడిన భారత బాక్సర్ తర్వాతి రెండు రౌండ్లలో చెలరేగాడు. పదునైన పంచ్‌లతో వ్యూహాత్మకంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 64 కేజీ రెండో రౌండ్లో చగ్రెల్బెగ్ పజేవ్ (తుర్కుమెనిస్థాన్) బౌట్ నుంచి తప్పుకోవడంతో టెక్నికల్ నాకౌట్ (టీకేఓ) ద్వారా నీరజ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్స్‌లో సోలంకి.. విలియమ్ డోంగే (ఐర్లాండ్)తో; నీరజ్... నెనైల్ జార్జో (రొమేనియా)తో తలపడతారు.