సచిన్ సింగ్ సంచలనం
క్యూబా బాక్సర్‌పై విజయం
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో స్వర్ణం
సెరుుంట్ పీటర్స్‌బర్గ్ (రష్యా): భారత యువ బాక్సర్ సచిన్ సింగ్ సివాచ్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 16 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో నమన్ తన్వర్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. బాక్సింగ్‌లో ‘రింగ్ మాస్టర్స్’గా పేరున్న క్యూబా బాక్సర్‌ను సచిన్ ఓడించి స్వర్ణం నెగ్గడం విశేషం. శనివారం జరిగిన 49 కేజీల విభాగంలో ఫైనల్లో సచిన్ 5-0 తేడాతో జోర్జి గ్రినాన్ (క్యూబా)పై ఏకపక్ష విజయం సాధించాడు.
అంతర్జాతీయస్థారుు టోర్నీలో క్యూబా బాక్సర్‌పై ఓ భారత బాక్సర్ నెగ్గడం ఇదే ప్రథమం. ప్రపంచ యూత్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్ సచిన్. గతంలో నానో సింగ్ (2008లో), వికాస్ క్రిషన్ (2010లో) స్వర్ణాలు గెలిచారు.