రోహ్‌తక్: ప్రపంచయూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలతో మెరిసిన భారత మహిళా బాక్సర్లకు హరియాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి రివార్డుగా దేశీ ఆవులను ప్రకటించింది. పతకం సాధించిన ఒక్కో బాక్సర్ ఒక్కో దేశీ అవును ప్రభుత్వం తరుపున రివార్డుగా ఇవ్వనున్నట్ల హరియాణ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకాశ్ ధనకర్ తెలిపారు.
గురువారం రోహ్‌తక్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( సాయ్) నిర్వహించిన బాక్సర్ల ఘనస్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యలు గెలిచిన మహిళా బాక్సర్ల కష్టానికి గుర్తుగా ప్రతి ఒక్కరికి పాలిచ్చే దేశీ ఆవులను రివార్డుగా ఇస్తామన్నారు. దీంతో వారు మరింత ధృడంగా తయారవుతారని పేర్కొన్నారు.
ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యలు సాధించిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించిన విషయం తెలిసిందే. గత నెల 19 నుంచి 26 మధ్య జరిగిన ఈ టోర్నిలో నీతూ, సాక్షి, జ్యోతి, శశిలు స్వర్ణపతకాలు సాధించగా.. అనుపమా, నేహాలు కాంస్య పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment