
గువాహటి: భారత మహిళా బాక్సర్లు ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలతో మెరిశారు. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా
నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. నీతు 5–0తో జజిరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్)పై, జ్యోతి 5–0తో ఎకతెరినా మొల్చనొవా (రష్యా)పై, సాక్షి 3–2తో ఇవీ జేన్ స్మిత్ (ఇంగ్లండ్)పై, శశి 4–1తో ఎన్గొక్ డొ హంగ్ (వియత్నాం)పై, అంకుశిత 4–1తో ఎకతెరినా డింక్ (రష్యా)పై విజయం సాధించారు. ఇప్పటికే నేహ యాదవ్ (ప్లస్ 81 కేజీలు), అనుపమ (81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. తాజా స్వర్ణంతో జ్యోతి అర్జెంటీనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ప్రేక్షకుల గ్యాలరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బౌట్లను 45 నిమిషాల పాటు నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment