కాకర శ్యామ్ కుమార్
జకార్తా: తెలుగుతేజం కాకర శ్యామ్ కుమార్ మళ్లీ తన పంచ్ పవర్‌తో అదరగొట్టాడు. ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో మరో నలుగురు భారత బాక్సర్లు కూడా పసిడి పతకాలు నెగ్గారు. మూడు సార్లు కింగ్స్ కప్‌లో విజేతగా నిలిచిన శ్యామ్ కుమార్ 49 కేజీల ఫైనల్లో 4–1తో మరియో బ్లాసియస్ కలి (ఇండోనేసియా)పై గెలుపొందాడు. ఇతనితో పాటు మనీశ్ కౌషిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్, మహిళల ఈవెంట్‌లో పవిత్ర బంగారు పతకాలు సాధించారు.
52 కేజీల ఫైనల్లో సల్మాన్ అన్వర్ 5–0తో ఫిలిప్పీన్స్‌కు చెందిన రోజెన్ లాడన్‌ను ఓడించగా, 64 కేజీల విభాగంలో ఆశిష్ 5–0తో సుగెర్ రే ఒకానా (ఇండోనేసియా)పై గెలుపొందాడు. 60 కేజీల ఈవెంట్‌లో మనీశ్ కౌషిక్ 5–0తో రెంటారో కిముర (జపాన్)పై నెగ్గాడు. మహిళల 60 కేజీల తుదిపోరులో పవిత్ర 5–0తో నిలవన్ టెచసుప్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. మరో మహిళా బాక్సర్ శశి చోప్రా (57 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment