Kamal Haasan Tested Covid Positive: Admitted to Chennai Hospital - Sakshi
Sakshi News home page

Kamal Hassan Tested Corona Positive: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్‌ హాసన్‌

Nov 22 2021 3:52 PM | Updated on Nov 22 2021 7:04 PM

Kamal Haasan Tested Coronavirus Positive And Join In Chennai Hospital - Sakshi

Kamal Haasan Tested Coronavirus Positive: విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు.

చదవండి: యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..!

‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఆయన కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్‌ క్లాత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్‌హాసన్‌ అమెరికా వెళ్లారట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement