Kamal Haasan Health Condition: Superstar Rajinikanth Calls To Kamal Haasan- Sakshi
Sakshi News home page

Kamal Hassan-Rajinikanth: కమల్‌ హాసన్‌ను పరామర్శించిన రజనీకాంత్‌

Published Thu, Nov 25 2021 12:51 PM | Last Updated on Thu, Nov 25 2021 1:17 PM

Rajinikanth Calls Up Kamal Haasan And Asks His Health Condition - Sakshi

Kamal Haasan Health Condition: విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తన తండ్రి కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, సినీనటి శృతిహాసన్ వెల్లడించారు. 

చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్‌ హాసన్‌

కమల్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమలహాసన్ ఆరోగ్యం బాగుందంటూ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ అధికారులు కూడా బులెటిన్ విడుదల చేశారు. కాగా పరిశ్రమలో కమలహాసన్, రజనీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కమల్‌కు కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న రజనీకాంత్... ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు.

చదవండి: విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం.. రంగంలోకి దిగిన సోనూసూద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement