మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కడప నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడంపై ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఒత్తిడిని తట్టుకోలేక నందిని, మనీషా ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందుకు మంత్రి నారాయణను బాధ్యుడిని చేసి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆనంద్, ఏబీవీపీ నగర కార్యదర్శి భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ కళాశాల ఎదట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కళాశాలలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ..ప్రైవేట్ కళాశాలల్లో మార్కుల కోసం విద్యార్థులను యంత్రాలుగా మార్చి మానసిక ప్రశాంతతను యాజమన్యాలు హరిస్తున్నాయని ఆరోపించారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో..
సోమా ఆర్కేడ్‌లోని నారాయణ కళాశాల(గర్ల్స్) ఎదుట ఏబీవీపీ నగర కమిటీ అధ్యక్షుడు భరత్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారాయణనను అడ్డుపెట్టుకొని విద్యావ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కడప ఘటన లో ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఇంతవర కు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం దా రుణమన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కరువైందని, రిషితేశ్వరి ఘటన మ రువక ముందే నందని, మనిషా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదన కలిగిం చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు శివ, సుమన్, భరత్, సురేష్‌నాయక్, మహేష్, ప్రశాంత్, అంజి, భాస్కర్ పాల్గొన్నారు.
నేడు విద్యాసంస్థల బంద్
కడప నారాయణ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన నందిని, మనిషా ఘటనకు నిరసనగా బుధవారం ఏబీవీపీ, వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్, పీడీఎస్‌యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.