
‘బరువు’ బాధ్యత
ఫొటోలోని చిన్నారి అమీషా (తెల్లచొక్కా) వయసు ఐదేళ్లు. బరువు 47 కిలోలు. మూడేళ్ల యోగిత (ఎర్రచొక్కా) బరువు 33కిలోలు. ఏడాది వయస్సున్న హర్ష బరువు 17కిలోలు. వీరు ముగ్గురూ పుట్టిన కొద్ది నెలల నుంచే విపరీతంగా బరువు పెరుగుతూనే ఉన్నారు.
రైతు కూలీగా నెలకు ఐదారువేలకు మించి సంపాదనలేని తండ్రి రమేష్ నన్వాన్‌కు వీరి పోషణ భారమైంది. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని వాందీ గ్రామంలో ఈ కుటుంబం ఉంటోంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ఆ చిన్నారుల వైద్యఖర్చులు రాష్ట్ర సర్కారే భరిస్తుందని ప్రకటించారు. చిన్నారులను అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు.