కుత్బుల్లాపూర్ : పిల్లలు పుట్టి చనిపోతుండటం, భర్త మద్యానికి బానిస కావడంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.. ఎస్సై పరమేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవి (28) కోదండరామ్ దంపతులు సుభాష్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టి పది నెలల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు.
అప్పటి నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్న దేవి తరచూ భర్తతో గొడవ పడేది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తతో మరోసారి గొడవ పెట్టుకోవడంతో అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి లోనైన దేవి ఇంట్లో ఐరన్ రాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తెల్లవారుజామున ఇంటికి వచ్చిన కోదండరామ్ దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment