యశవంతపుర : ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన డాజల్ మిసెస్ ఇండియా యునివర్స్–2018 కిరీటాన్ని శివమొగ్గకు చెందిన మనీషా వరుణ్ దక్కించుకొంది. ఈ పోటీలు శ్రీలంక–భారత పర్యటక శాఖ అధికారులు నిర్వహించారు. ఈనెల 14న జరిగిన ఈ పోటీలలో శివమొగ్గకు చెందిన వక్క వ్యాపారి వరుణ్ భార్య మనీషా పాల్గొని మిసెస్ ఇండియా యునివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మిస్ ర్యాంప్ వాక్, మిసెస్ ఇండియా యునివర్స్ సౌత్ పురస్కారాలు దక్కించుకున్న ఆమె మిసెస్ ఇండియా యునివర్స్–2018లో విన్నర్‌గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment