
సాక్షి, చెన్నై: నటుడు విమల్ విలేకరి అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడిక్కుమ్ కరంగళ్’. ముంబై బ్యూటీ మనీషా నాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈమె ఇంతకుముందు తెలుగులో రెండుచిత్రాలు, కన్నడంలో ఒక చిత్రం చేశారు. ఒడియన్ టాకీస్ పతాకంపై కె.అన్నాదురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేలుదాస్ దర్శకత్వంతో పాటు సహ నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద 23 ఏళ్లు పని చేసిన ఆయన సోదరుడి కొడుకు రాఘవ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్మీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటుడు విమల్ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ విలేకరిగా బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. ఈ షూటింగ్‌ను చెన్నైలో 45 రోజుల్లో పూర్తి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment