ప్రేమించాలి.. ప్రేమను పంచాలి
ప్రేమను పంచే తల్లిదండ్రులే... ప్రేమను పొందడానికి ప్రథమార్హులు అని తెలిపే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. సంతోష్, మనీషా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగించింది. ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి సురేష్ మాట్లాడుతూ- ‘‘పరిణతిలేని ప్రేమ ఓ జంట జీవితంతో ఎలా ఆడుకుంది? అనే అర్థవంతమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మా సంస్థలో వచ్చిన గత చిత్రాలకు మించే విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుంది. తమిళనాట విజయ్ ‘తలైవా’ చిత్రంతో పాటు విడుదలై 16 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.
యువతరాన్ని విశేషంగా అలరించే విధంగా సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘సురేష్ కొండేటితో కలిసి నేను విడుదల చేసిన పిజ్జా, క్రేజీ, మహేష్ చిత్రాలు మంచి విజయాలుగా నిలిచాయి. మా కాంబినేషన్లో విడుదలవుతున్న ఈ నాల్గవ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుంది’’ అని సహనిర్మాత సమన్యరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: సూర్య వి.ఆర్, కూర్పు: ఆంటో