21న తెరపైకి మీసైమురుక్కు | Directed by Sunder Sea"s mesaimurukku film will be released on 21st of this month. | Sakshi
Sakshi News home page

21న తెరపైకి మీసైమురుక్కు

Published Thu, Jul 13 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

21న తెరపైకి మీసైమురుక్కు

21న తెరపైకి మీసైమురుక్కు

తమిళసినిమా:  మీసైమురుక్కు చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు దర్శకుడు సుందర్‌.సీ వెల్ల డించారు. ఆయన తన అవ్నీ మూవీస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. యువ సంగీతదర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ ఆది కథ, కథనం, మాటలు, పాట లు, సంగీతం, దర్శకత్వం వహించి కథానా యకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మీసైమురుక్కు. ఆద్మిక, మనీషా కథానాయకలుగా నటించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

చిత్ర నిర్మాత సుందర్‌.సీ విలేకరులతో మాట్లాడుతూ తాను క్లబ్బుల పబ్బుల పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హిప్‌ హాప్‌ తమిళా ఆదిని కలిశానన్నారు. ఆ సయమంలో చిత్రంలోని ఐదు పాటలను ఐదుగురు సంగీతదర్శకులతో చేయించాలని భావించామని అన్నారు. అలా ఆదికి ఇచ్చిన పళగికలామా పాట బాగా నచ్చిందన్నారు. చిత్రంలో ని అన్ని పాటలను తానే చేస్తానని ఆది అడగటంతో తానూ ఒకే చెప్పానని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆదికి హీరో అవకాశం కల్పిస్తానని మాటిచ్చానని, అది ఇప్పుడు నెర వేర్చానని అన్నారు. చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే విధంగా ఉంటుందని సుందర్‌.సీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement