Admika
-
కామెడీ దెయ్యం చిత్రంగా కాటేరి
తమిళసినిమా: మా కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు డీకే. ఈయన ఇంతకు ముందు యామిరుక్కు భయమేన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైభవ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా వరలక్ష్మిశరత్‌కుమార్, ఆద్మిక, మనాలి రాథోడ్ నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. పొన్నంబళం, కరుణాకరన్, రవిమరియ, జాన్‌విజయ్, కుట్టిగోపి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఎంఎస్.ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు డీకే తెలుపుతూ కాటేరి అంటే అందరూ రక్తం తాగే దెయ్యం అనుకుంటున్నారని, పూర్వ మనుషులు, ముత్తాతలు అని కూడా అర్థం ఉందన్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజాను కలిసి ఈ చిత్ర ఒన్లైన్ కథను చెప్పానన్నారు. ఆయకు నచ్చడంతో పాటు కాటేరి అనే టైటిల్ ఈ కథకు బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇందులో నటిస్తున్న నలుగురు హీరోయిన్లలో కాస్త స్వార్థం కలిగిన అమ్మాయిగా సోనం బాజ్వా, మనోతత్వ వైద్యురాలిగా ఆద్మిక నటిస్తున్నారని, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, మానాలి రాథోడ్‌లు 1960 కాలానికి చెందిన పోర్షన్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తన గత చిత్రం యామిర్కు భయమేన్ చిత్రంలో పాపులర్ అయిన పన్ని మూంజి వాయన్ లాంటి పాత్ర ఈ చిత్రంలోనూ చోటు చేసుకుంటుందన్నారు. కాటేరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, పిల్లలను అలరిస్తుందని చెప్పారు. తమ కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు డీకే పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
21న తెరపైకి మీసైమురుక్కు
తమిళసినిమా: మీసైమురుక్కు చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు దర్శకుడు సుందర్.సీ వెల్ల డించారు. ఆయన తన అవ్నీ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. యువ సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ ఆది కథ, కథనం, మాటలు, పాట లు, సంగీతం, దర్శకత్వం వహించి కథానా యకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మీసైమురుక్కు. ఆద్మిక, మనీషా కథానాయకలుగా నటించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. చిత్ర నిర్మాత సుందర్.సీ విలేకరులతో మాట్లాడుతూ తాను క్లబ్బుల పబ్బుల పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హిప్ హాప్ తమిళా ఆదిని కలిశానన్నారు. ఆ సయమంలో చిత్రంలోని ఐదు పాటలను ఐదుగురు సంగీతదర్శకులతో చేయించాలని భావించామని అన్నారు. అలా ఆదికి ఇచ్చిన పళగికలామా పాట బాగా నచ్చిందన్నారు. చిత్రంలో ని అన్ని పాటలను తానే చేస్తానని ఆది అడగటంతో తానూ ఒకే చెప్పానని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆదికి హీరో అవకాశం కల్పిస్తానని మాటిచ్చానని, అది ఇప్పుడు నెర వేర్చానని అన్నారు. చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే విధంగా ఉంటుందని సుందర్.సీ తెలిపారు. -
మీసై మురుక్కు అంటున్న హిప్ హాప్ తమిళ
తమిళసినిమా: వృత్తి ఏదైనా దాన్ని ప్రేమించి చేయాలి. అప్పుడే అందు లో విజయపుటంచులను చూడగలం. అందుకు ఉదాహరణలు ఎన్నో. ఇక ఒక చిన్న కుర్రాడు సంగీతంపై మోహం తో తానే సంగీత ఆల్బమ్‌ను తయారు చేసుకున్నాడు. అది సంగీత ప్రియుల మధ్య విశేష ఆదరణను పొందింది. ఆ తరువాత ఆ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి కొన్ని చిత్రాలలో పాటలు పాడి గాయకుడిగాను పేరు తెచ్చుకున్నాడు. ఆ పాటలు కూడా ప్రాచుర్యం పొందాయి. అలా అతనిలోని టాలెంట్‌ను గుర్తెరిగిన సినీ ప్రముఖుల్లో సుందర్.సీ ఒకరు. అంతే తాను దర్శకత్వం వహించిన ఆంబళ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా ఆ యువకుడిని పరిచయం చేశారు. ఆ కుర్రాడెవరో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఎస్. ప్రస్తుతం యువ సంగీత తరంగంగా దూసుకుపోతున్న ఆయనే హిప్ హాప్ తమిళ ఆది. అర ణ్మణై-2,తనీఒరువన్ తదితర సంచలన విజయాలను సొంతం చేసుకున్న చిత్రాల సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ ఇప్పుడు పలు కోణాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యారు. మీసై మురుక్కు చిత్రం ద్వారా కథకుడు, సంగీతదర్శకుడు, దర్శకుడు, కథానాయకుడు అంటూ పలు విధాలుగా తెరవెనుక, తెర ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుందర్.సీనే ఈయనకు దర్శకుడిగానూ, కథానాయకుడిగానూ అవకాశం కల్పించడం విశేషం. తాను జల్లికట్టు ఇతివృత్తంగా రూపొందించిన వీడియో ఆల్బమ్‌ను చూసి దర్శకుడు సుందర్.సీ హీరోగానూ,దర్శకుడిగానూ అవకాశం ఇచ్చారని హిప్ హాప్ తమిళ చెప్పారు. అవ్నీ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న మీసై మురుక్కు చిత్రంలో హిప్ హాప్ తమిళ సరసన నవ నటి ఆద్మిక నాయకిగా పరిచయం అవుతున్నారు. హాస్యనటుడు వివేక్ ఆయనకు మామగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియోను దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు.