మీసై మురుక్కు అంటున్న హిప్ హాప్ తమిళ | aadi new movie Misai murukku | Sakshi
Sakshi News home page

మీసై మురుక్కు అంటున్న హిప్ హాప్ తమిళ

Published Fri, Oct 14 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

మీసై మురుక్కు అంటున్న హిప్ హాప్ తమిళ

మీసై మురుక్కు అంటున్న హిప్ హాప్ తమిళ

తమిళసినిమా: వృత్తి ఏదైనా దాన్ని ప్రేమించి చేయాలి. అప్పుడే అందు లో విజయపుటంచులను చూడగలం. అందుకు ఉదాహరణలు ఎన్నో. ఇక ఒక చిన్న కుర్రాడు సంగీతంపై మోహం తో తానే సంగీత ఆల్బమ్‌ను తయారు చేసుకున్నాడు. అది సంగీత ప్రియుల మధ్య విశేష ఆదరణను పొందింది. ఆ తరువాత ఆ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి కొన్ని చిత్రాలలో పాటలు పాడి గాయకుడిగాను పేరు తెచ్చుకున్నాడు.
 
ఆ పాటలు కూడా ప్రాచుర్యం పొందాయి. అలా అతనిలోని టాలెంట్‌ను గుర్తెరిగిన సినీ ప్రముఖుల్లో సుందర్.సీ ఒకరు. అంతే తాను దర్శకత్వం వహించిన ఆంబళ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా ఆ యువకుడిని పరిచయం చేశారు. ఆ కుర్రాడెవరో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఎస్. ప్రస్తుతం యువ సంగీత తరంగంగా దూసుకుపోతున్న ఆయనే హిప్ హాప్ తమిళ ఆది. అర ణ్మణై-2,తనీఒరువన్ తదితర సంచలన విజయాలను సొంతం చేసుకున్న చిత్రాల సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ ఇప్పుడు పలు కోణాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యారు.
 
 మీసై మురుక్కు చిత్రం ద్వారా కథకుడు, సంగీతదర్శకుడు, దర్శకుడు, కథానాయకుడు అంటూ పలు విధాలుగా తెరవెనుక, తెర ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుందర్.సీనే ఈయనకు దర్శకుడిగానూ, కథానాయకుడిగానూ అవకాశం కల్పించడం విశేషం. తాను జల్లికట్టు ఇతివృత్తంగా రూపొందించిన వీడియో ఆల్బమ్‌ను చూసి దర్శకుడు సుందర్.సీ హీరోగానూ,దర్శకుడిగానూ అవకాశం ఇచ్చారని హిప్ హాప్ తమిళ చెప్పారు. అవ్నీ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న మీసై మురుక్కు చిత్రంలో హిప్ హాప్ తమిళ సరసన నవ నటి ఆద్మిక నాయకిగా పరిచయం అవుతున్నారు. హాస్యనటుడు వివేక్ ఆయనకు మామగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియోను దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement