లవ్లీ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం టాప్ గేర్. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా తెరకెక్కించారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. 'మా నాన్నతో మొదలైన మా జర్నీ ఆది వరకు వచ్చింది. ఆది క్రికెటర్ అవ్వాలనుకున్నాం. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. అందరూ ఈ "టాప్ గేర్" సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మా ఆదికి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. 'శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్థానం సినిమాతో నా జర్నీ మొదలైంది. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ "టాప్ గేర్" సినిమాతో ఆది కెరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆదితో నేను ఒక సినిమా తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ.. 'శ్రీధర్ చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.
చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ... 'థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ. ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.
ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్‌ను లాంఛ్ చేశారు .
Comments
Please login to add a commentAdd a comment