Top Gear
-
టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
‘టాప్ గేర్’లో దూసుకెళ్తున్న శశికాంత్!
ఆది సాయికుమార్‘టాప్ గేర్’ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కె.శశికాంత్. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం..దర్శకుడిగా శశికాంత్‌కు మంచి పేరుని తెచ్చిపెట్టింది. తొలి సినిమానే ఓ డిఫరెంట్ జానర్‌ని ఎంచుకొని తన టాలెంట్ బయటపెట్టాడు. ఎంతో గ్రిప్పింగ్ గా స్టోరీని నడిపిస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అందుకే శశికాంత్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. శశికాంత్ తన రెండో సినిమాను ప్రముఖ హీరోతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. టాప్ గేర్ లాగే మరో డిఫరెంట్ పాయింట్ తీసుకొని స్టోరీ సిద్ధం చేసుకున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. -
'టాప్ గేర్' మూవీ రివ్యూ
టైటిల్: టాప్ గేర్ నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మజీ, సత్యం రాజేశ్, మైమ్ గోపీ, శత్రు, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్ చంద్ర నిర్మాణ సంస్థలు:ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాత: కేవీ శ్రీధర్ రెడ్డి దర్శకత్వం: కె.శశికాంత్ సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ: డిసెంబర్ 30,2022 యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'టాప్ గేర్'సినిమాతో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆది. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే: ఆది సాయికుమార్(అర్జున్) ఓ క్యాబ్ డ్రైవర్. రియా సుమన్(ఆద్య)ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. కొత్తగా పెళ్లైన దంపతులు కావడంతో చాలా అన్యోన్యంగా ఉంటారు. మైమ్ గోపీ(సిద్ధార్థ్) డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇతని ముఠాలో బ్రహ్మజీ, సత్యం రాజేశ్ కూడా ఉంటారు. డ్యూటీకి వెళ్లిన అర్జున్ ఇంటికొస్తుండగా ఓ క్యాబ్ బుకింగ్ ఆర్డర్ వస్తుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అనుకోకుండా ఆరోజు అతని క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు ఎక్కుతారు. ఆరోజు రాత్రి అర్జున్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అతనికి ఓ గుడ్ న్యూస్ చెప్పాలని భార్య ఆద్య ఇంటి దగ్గర నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ ఆరోజు రాత్రి అర్జున్ ఇంటికెళ్లాడా? ఆ గుడ్ న్యూస్ విన్నాడా? అసలు క్యాబ్‌లో ఎక్కిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత అర్జున్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? డ్రగ్స్ ముఠాకు, హీరోకు సంబంధం ఏంటీ? అర్జున్ను పోలీసులు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. కథ ఎలా సాగిందంటే.. డ్రగ్స్ ముఠా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విలన్ ఇంట్రడక్షన్‌తోనే కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆది, రియా సుమన్ పెళ్లి, దంపతుల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో ఎలాంటి పరిచయం లేకుండానే డైరెక్ట్‌గా పాత్రలను రంగంలోకి దించారు డైరెక్టర్. జీవనం సాఫీగా నడుస్తున్న క్యాబ్ డ్రైవర్ జీవితంలోకి డ్రగ్స్ ముఠా ఎంట్రీ కావడం, ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండానే కథ సాగడం ప్రేక్షకుల కాస్త బోర్ కొట్టించింది. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్ చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఫస్టాఫ్ ఓ రొమాంటిక్ సాంగ్ మినహా ఎలాంటి యాక్షన్ సీన్స్, కామెడీ లేకుండానే ముగుస్తుంది. సెకండాఫ్‌కు వచ్చేసరికి కథలో వేగం పెంచారు. డ్రగ్స్ ముఠా, హీరో మధ్య సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథలో డేవిడ్ అనే పాత్రే అసలు ట్విస్ట్. సెకండాఫ్ మొత్తం డ్రగ్స్ ఉన్న బ్యాగ్ చుట్టే కథ నడిపించారు. మధ్యలో అక్కడక్కడ కొత్త పాత్రల ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచారు. డ్రగ్స్ ముఠా, పోలీసులు, హీరో చుట్టే సెకండాఫ్ తిరుగుతుంది. మధ్యలో ఓ యాక్షన్ ఫైట్, డ్రగ్స్ బ్యాగ్ కోసం హీరో అర్జున్(ఆది) చేసే సాహసం హైలెట్. ఒకవైపు యాక్షన్ సన్నివేశాలు చూపిస్తూనే.. మరోవైపు భార్య, భర్తల ప్రేమానురాగాలను డైరెక్టర్ చక్కగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ నవ్వులు తెప్పించడం ఖాయం. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం శశికాంత్కే సాధ్యమైంది. ఓవరాల్‌గా మనుషుల ఎమోషన్స్‌తో ఇతరులు ఎలా ఆడుకుంటారనే సందేశాన్నిచ్చారు డైరెక్టర్. అలాగే డ్రగ్స్ బారినపడి యువత జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే సందేశమిచ్చారు డైరెక్టర్. ఎవరెలా చేశారంటే.. ఆది సాయికుమార్ యాక్షన్ బాగుంది. క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. రియా సుమన్ నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విలన్‌గా మైమ్ గోపీ(సిద్ధార్థ్) ఆకట్టుకున్నారు. శత్రు(ఏసీపీ విక్రం) పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం సినిమాకు ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు.ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. -
టాప్ గేర్ మూవీ పబ్లిక్ టాక్
-
ఆ ధైర్యం ఉంటేనే సినిమా తీయాలి: నిర్మాత శ్రీధర్ రెడ్డి
‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలెంజింగ్ మారింది. సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ నిర్మాతకు సవాళ్లే. వాటిని ఎదుర్కొగలను అనే ధైర్యం ఉంటేనే సినిమా నిర్మాణ రంగంలోకి దిగాలి’అని నిర్మాత కేవీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆది సాయి కుమార్, రియా జంటగా కె.శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేవీ శ్రీధర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ‘టాప్ గేర్’ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది. ► టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు. హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ► ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చగలను. ► టాప్ గేర్ సినిమాను చూశాక సాయి కుమార్.. ‘ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుంది’అని చెప్పారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. -
ఆది నా బెస్ట్ ఫ్రెండ్: హీరో సందీప్ కిషన్
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం టాప్ గేర్. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా తెరకెక్కించారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. 'మా నాన్నతో మొదలైన మా జర్నీ ఆది వరకు వచ్చింది. ఆది క్రికెటర్ అవ్వాలనుకున్నాం. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. అందరూ ఈ "టాప్ గేర్" సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మా ఆదికి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. 'శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్థానం సినిమాతో నా జర్నీ మొదలైంది. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ "టాప్ గేర్" సినిమాతో ఆది కెరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆదితో నేను ఒక సినిమా తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ.. 'శ్రీధర్ చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ... 'థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ. ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్‌ను లాంఛ్ చేశారు . -
అది అందరికీ అర్థం కాని పెద్ద పజిల్: ఆది సాయికుమార్
‘‘ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారన్న విషయం అంచనాలకు అందడంలేదన్న మాటలను నేనూ వింటున్నాను. ఓ సినిమా సెంట్రల్ ఐడియా కొత్తగా ఉందంటే సగం పాసైయినట్లే అని నమ్ముతాను’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘టాప్‌గేర్’ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఒక్కరోజులో జరిగే కథతో రూపొందిన చిత్రం ‘టాప్ గేర్’. ఏ మాత్రం తనకు సంబంధం లేని ఓ సమస్యలో ఇరుక్కునే ఓ క్యాబ్ డ్రైవర్ అందులో నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఈ సినిమా కథనం. మేజర్ షూటింగ్ అంతా కారులోనే చేశాం. స్క్రీన్‌ప్లే రేసీగా సాగుతుంది. నా గత చిత్రాల మాదిరిగానే ‘టాప్ గేర్’ కూడా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్. నా ప్రతి సినిమాకు నేను వంద శాతం కష్టపడుతూనే ఉన్నాను. నా సినిమా లను గమనిస్తే అందులోని ప్రధానాంశం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ‘టాప్‌గేర్’ కూడా అలాంటి కథాంశమే. ► ప్రస్తుతం మాస్ యాక్షన్ ఫిల్మ్ నిర్వచనం మారింది. ఇప్పుడు ఎక్కువగా ‘కేజీఎఫ్’లాంటి స్టయిలిష్ యాక్షన్ ఫిలింస్‌ని చూస్తున్నారు. భవిష్యత్‌లో నేనూ ఓ స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేస్తాను. ► థియేటర్స్‌లో ఓ హిట్ సాధించడం అనేది అందరికీ ఓ సవాలుగా మారింది. రీసెంట్గా విడుదలైన నా ‘క్రేజీ ఫెలో’ చిత్రం మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ మా సినిమా విడుదలైన మర్నాడే కన్నడ ‘కాంతార’ తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఫ్లోలో మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. బహుశా.. రాంగ్ రిలీజ్ డేట్ కావొచ్చు. ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలను ఆడియన్స్ ఓటీటీలోనే చూడాలని ఫిక్స్ అయ్యారో లేదా థియేట్రికల్ మూవీ అంటే ఏదో ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ఉండాలని ఫిక్స్ అయ్యారా? అన్నది ఇప్పుడు అందరికీ అర్థం కాని పెద్ద పజిల్. ► ప్రస్తుతానికి నెగటివ్ రోల్స్ చేయాలనుకోవడం లేదు. ఏదైనా అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం లక్కీ మీడియాలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పులిమేక’ వెబ్ సిరీస్ చేశాను. త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ► నాన్నగారు చేసిన ‘అసలేం గుర్తుకురాదు..’ (‘అంతఃపురం’) సినిమా పాటను రీమిక్స్ చేయా లని ఉంది. అయితే నా సినిమాలో ఆ పాటకు తగ్గ సందర్భం కుదరాలి. ఒకవేళ రీమిక్స్ చేస్తే దర్శకుడు కృష్ణవంశీగారే తీయాలి. -
ఈ ఏడాది చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
2022.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బోలెడన్ని హిట్స్ ఇచ్చింది. ఈ విజయాల పరంపరలో 18 పేజెస్, ధమాకా కూడా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త సంవత్సరంలో రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు అగ్ర కథానాయకులు. సంక్రాంతి బరిలోకి దిగుతామంటూ షూటింగ్స్‌లో మునిగిపోయారు. కుర్ర హీరోలు మాత్రం ఈ ఏడాదికి మేము గ్రాండ్‌గా ముగింపు పలుకుతామంటూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 2022 ఆఖరి వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం.. థియేర్లో రిలీజ్ కానున్న చిత్రాలు.. ► టాప్ గేర్ - డిసెంబర్ 30 ► లక్కీ లక్ష్మణ్ - డిసెంబర్ 30 ► డ్రైవర్ జమున - డిసెంబర్ 30 ► ఆ రోజే రాజయోగం - డిసెంబర్ 30 ► ఎస్5.. నో ఎగ్జిట్ - డిసెంబర్ 30 ► వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ దేవరకొండ- డిసెంబర్ 30 ► కొరమీను - డిసెంబర్ 31 ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు.. ఆహా ► అన్‌స్టాపబుల్ షో (ప్రభాస్ ఎపిసోడ్) - డిసెంబర్ 30 హాట్‌స్టార్ ► బటర్‌ఫ్లై - డిసెంబర్ 29 ► ఆర్ యా పార్ - డిసెంబర్ 30 ► ది ఎల్ వరల్డ్ - డిసెంబర్ 30 ► బ్యూటీ అండ్ ది బీస్ట్ - డిసెంబర్ 30 అమెజాన్ ప్రైమ్ ► టాప్ గన్ మేవరిక్ - డిసెండర్ 26 ► గోల్డ్ - డిసెంబర్ 29 నెట్‌ఫ్లిక్స్ ► 7 ఉమెన్ అండ్ మర్డర్ - డిసెంబర్ 28 ► డీఎస్పీ(తెలుగు డబ్బింగ్ చిత్రం) - డిసెంబర్ 30 ► వైట్ నాయిస్ - డిసెంబర్ 30 ► చోటా భీమ్ సీజన్ 15 - డిసెంబర్ 30 ► ద గ్లోరీ(కొరియన్ సిరీస్) - డిసెంబర్ 30 జీ5 ► ఉత్తవారన్ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్ 30 చదవండి: అవతార్ 2 సెన్సేషన్.. ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే? కంగనాకు పద్మశ్రీ.. మాకు మాత్రం గుర్తింపే లేదు: సీనియర్ హీరోయిన్స్ -
హీరో ఆదికి 'టాప్ గేర్' టీమ్ బర్త్‌డే విషెస్
'ప్రేమ కావాలి' అంటూ కెమెరా ముందుకొచ్చి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్యభరితమైన కథలతో అలరిస్తున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది. ఈ ఏడాది కూడా ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేశారాయన. ప్రస్తుతం ఆయన తెలుగులో టాప్ గేర్ సినిమా చేస్తున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో 'టాప్ గేర్' టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు ఆది సాయి కుమార్. చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్ చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల సత్యనారాయణ -
'యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి'.. 'టాప్ గేర్'లో ట్రైలర్
యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ముందుకొస్తున్నారు ఆది సాయి కుమార్. 'టాప్ గేర్'తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ హీరో రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అసలు కథేంటంటే..: కథలోని పాత్రలందరూ డేవిడ్, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్కూ సంబంధం ఏంటి? క్యాబ్ డ్రైవర్ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్లో ఆది యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది చెప్పే డైలాగ్ సినిమాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోబ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆది సాయికుమార్ 'టాప్ గేర్' ట్రైలర్ విడుదల
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం టాప్ గేర్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. డిసెంబర్30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను వదిలారు. మాస్ మహారాజ రవితేజ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘‘యుద్ధం గెలవాలంటే మృత్యువుతో పోరాడే గెలవాలి’’ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఎంతోకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఆది సాయికుమార్‌కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. -
Top Gear: నువ్వు నా వెన్నెల...
‘వెన్నెల వెన్నెల.. నువ్వు నా వెన్నెల.. దైవమే ప్రేమగా పంపేనే నిన్నిలా...’ అంటూ సాగుతుంది ‘వెన్నెల వెన్నెల...’ పాట. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె.శశికాంత్ డైరెక్షన్లో రూపొందిన ‘టాప్ గేర్’ చిత్రంలోని పాట ఇది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అదించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. కేవీ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని ‘వెన్నెల వెన్నెల’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
సిద్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల సాంగ్ విన్నారా?
యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టాప్ గేర్. కె శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వెన్నెల వెన్నెల పాటను రిలీజ్ చేశారు. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్ చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి -
వచ్చే నెల టాప్ గేర్
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇందులో ఆది టాక్సీ డ్రైవర్‌గా నటించారు. అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ పాయింట్‌ని మూవీలో టచ్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
ఆది సాయి కుమార్ 'టాప్ గేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ 'టాప్ గేర్' అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది సాయికుమార్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ ఆది సాయికుమార్ రీసెంట్గా అందరినీ మెప్పించారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న టాప్ గేర్ సినిమాతో ఆది సాయి కుమార్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. -
యాక్షనే కాదు రొమాన్స్‌లోనూ ‘టాప్ గేర్’ వేసిన ఆది
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఇటీవల ‘క్రేజీ ఫెలో’తో అలరించిన ఆది..త్వరలోనే ‘టాప్ గేర్’అనే డిఫరెంట కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్‌ను చూపిస్తోంది. యాక్షన్లోనే కాదు.. రొమాన్స్‌లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్ రియా సుమన్, ఆది కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. -
Top Gear: టాక్సీ డ్రైవర్‌గా ఆది సాయికుమార్
ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచమైయ్యాడు ఆదిసాయికుమార్. ఆ తర్వాత పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్.. మరికొద్ది రోజుల్లో టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మోషన్ పోస్టర్ లో ఆది సాయి కుమార్ కారు నడుపుతున్నట్లు చూపించి.. యాక్షన్ మోడ్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది. కే.వీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.